ఢిల్లీలో ఘోరం.. కదిలే బస్సులో వివాహితపై గ్యాంగ్ రేప్
నోయిడా: ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. నగరు శివారున వెళ్తున్న బస్సులో దుండగులు ఓ వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బస్సు డ్రైవర్, సహాయకుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
శనివారం రాత్రి బాధితురాలు దాద్రి వెళ్లేందుకు కనౌజ్ దగ్గర బస్సు ఎక్కింది. అయితే గమ్యస్థానం చేరినా ఆమె గుర్తించకపోవడంతో ఢిల్లీ చేరారు. బాధితురాలిని దాద్రిలో దించుతామని బస్సు డ్రైవర్, అతని సహాయకుడు నమ్మబలికి వెనక్కు తీసుకెళ్లి దారుణానికి పాల్పిడినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమెను వైద్య పరీక్షలకు పంపారు. నిందితులు పరారీలో ఉన్నారు.