బెంగళూరు: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం ‘వందే భారత్ మిషన్’ను ప్రారంభించిన విషయం విదితమే. మే 7న ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే చాలా మంది భారత్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో మేఘనా అనే మహిళ వందే భారత్ మిషన్ ద్వారా లండన్ నుంచి ఎయిరిండియా విమానంలో సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరుకు పయనమయ్యారు. ఈ క్రమంలో విమాన సిబ్బంది తమకు అందించిన సేవలు, ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాలను ట్విటర్ ద్వారా పంచుకున్నారు. విదేశాల నుంచి భారత్‌కు బయల్దేరిన వారు.. తన ట్వీట్ల ద్వారా తమ జర్నీని ప్లాన్ చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు.(శ్రామిక్ రైళ్లలో స్వస్థలాలకు 10 లక్షల మంది కార్మికులు)
విమానం కాస్త ఆలస్యంగా వచ్చింది. ప్రయాణానికి ముందే.. 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటామని ధ్రువీకరిస్తూ మా నుంచి అండర్‌టేకింగ్ ఫాంలో సంతకం తీసుకున్నారు. అత్యవసర సమయంలో ఎయిర్ ఇండియా వ్యవహరిస్తున్న తీరు నిజంగా ప్రశంసనీయం. ప్రతీ ప్రశ్నకు ఎంతో ఓపికగా సమాధానమిస్తున్నారు. నేను బ్రిటీష్ ఎయిర్‌వేస్‌లో బుక్ చేసుకున్న టికెట్లు మార్చిలో రద్దయ్యాయి. దాని గురించి ఇంతవరకు ఎటువంటి స్పందనా లేదు. డబ్బు తిరిగి ఇస్తారో లేదో కూడా తెలియదు. అది వేరే విషయం అనుకోండి.(పిల్లాపాపలతో ఊరికి బాట పట్టిన దృశ్యాలు)
ఇక మా ప్రయాణం విషయానికొస్తే... బోర్డింగ్ గేటు వద్ద అందరు ప్రయాణీకులకు స్క్రీనింగ్ చేస్తున్నారు. కరోనా లక్షణాలు బయటపడిన వాళ్లను యూకేలోనే క్వారంటైన్‌కు పంపించారు. అలా గంటన్నర ఆలస్యం అయింది. ఇక విమానం ఎక్కగానే మూడింట రెండు వంతుల మందికి విమాన సిబ్బంది ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ అందించారు. ప్రతీ సీట్లో రెండు పెద్ద బాక్సుల్లో ఆహారం, నీళ్లు ముందే పెట్టి ఉంచారు. ఢిల్లీలో దిగగానే.. అదే విమానంలో మళ్లీ బెంగళూరుకు వచ్చాను. మళ్లీ స్సాక్స్, కాఫీ అందించారు. ఆ తర్వాత హెల్త్ చెకప్. బ్యాగేజ్ కలెక్షన్. క్వారంటైన్ కోసం హోటల్ బుకింగ్. (విదేశాల నుంచి భారత్‌కు విమానాల రాక)
ఎవరినీ హోం క్వారంటైన్‌కు అనుమంతించలేదు. 5 స్టార్ సింగ్ హోటల్ క్వారంటైన్ సింగిల్- రూ. 4100, 5 స్టార్ డబుల్- 5900, 3 స్టార్ సింగిల్-రూ. 1850, 3 స్టార్ డబుల్ రూ. 2450, నో స్టార్ 1200రూ. ఆ తర్వాత బస్సులో హోటల్‌కు వెళ్లాం. స్వాబ్ టెస్టు చేశాం. ధన్యవాదాలు ఎయిర్‌ఇండియా. పీపీఈ ధరించి మాకు సేవ అందించారు. హోటల్ సిబ్బంది కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు’’ అని వరుస ట్వీట్లు చేశారు.
Updates about quarantine facilities here https://t.co/zoINc0n7KN
— Meghana (@GoingMeghana) May 11, 2020
Comments
Please login to add a commentAdd a comment