నిప్పంటించుకుని.. స్వామిని కౌగిలించుకుని.. | woman self immolates, hugs godman in karnataka | Sakshi
Sakshi News home page

నిప్పంటించుకుని.. స్వామిని కౌగిలించుకుని..

Published Tue, Jan 20 2015 2:20 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

నిప్పంటించుకుని.. స్వామిని కౌగిలించుకుని.. - Sakshi

నిప్పంటించుకుని.. స్వామిని కౌగిలించుకుని..

బెంగళూరు(బనశంకరి): కర్ణాటకలోని కొప్పళ మఠంలో శరీరానికి నిప్పంటించుకున్న ఓ మహిళ మంటలు రేగుతుండగా స్వామీజీని కౌగిలించుకుంది. సోమవారం జరిగిన ఈ ఉదంతంలో మహిళ మరణించగా, స్వామీజీ తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలయ్యారు. యలబుర్గి తాలూకా మటికట్టి గ్రామంలో శివానంద స్వామీజీకి చెందిన కొప్పళ మఠంలో ప్రధాన శిష్యురాలిగా ఉంటున్న శరణమ్మ ప్రభావతితో స్వామీజీకి వివాహేతర సంబంధం ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం సాగుతోంది.

 

మఠం ఆస్తిలో తనకు భాగం ఇవ్వాలంటూ స్వామీజీని ఆమె డిమాండ్ చేస్తూ వచ్చిందని సమాచారం. ఇందుకు స్వామి కాదనడంతో శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ప్రభావతి.. పూజలో నిమగ్నమై ఉన్న స్వామీజీని కౌగిలించుకున్నట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement