
ఆగ్రా(యూపీ): నీటి పంపు విషయంలో తలెత్తిన వివాదం ఇద్దరు మహిళలు బహిరంగంగానే కొట్టుకునే స్థాయికి చేరుకుంది. యూపీలోని కాళింది విహార్‌కు చెందిన రమాశర్మ, అమె ఇంటి పొరుగున ఉంటున్న మీరా కుమారికి మధ్య నీటి పంపు విషయమై గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే ఆదివారం ఈ గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి.
సంపు విషయంలో మరోసారి గొడవ జరగడంతో ఆగ్రహించిన రమాశర్మ, మీరా కుమారిని జుట్టుపట్టుకొని లాక్కుని ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చింది. అనంతరం ఇష్టానుసారంగా కొట్టడం ప్రారంభించింది. కిందపడేసి మరీ, ఆమె మీద కూర్చొని పిడిగుద్దులు గుద్దింది. మీరా కుమారి కూడా రమాశర్మను జట్టుపట్టుకొని ప్రతిఘటించడానికి ప్రయత్నించింనా ఫలితం లేకపోవడంతో కేకలు వేసింది. మీరా అరుపులు విన్న స్థానికులంతా అక్కడకు చేరుకుని ఆమెను కాపాడారు. కాగా ఈ తతంగాన్నాంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీయడంతో, ఇప్పుడది వైరల్‌గా మారింది. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment