పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్ అంటాడు ‘కన్యాశుల్కం’లో గిరీశం. పొగ తాగేవారు తమను తాము సమర్థించుకునే మాట ఇది. నిజానికి పొగతాగడం అంటే జీవితానికి పొగ పెట్టుకోవమే. చుట్ట, బీడీ, సిగరెట్.. ఏ రూపంలోనైనా పొగ తీవ్ర అనర్థాలను తెచ్చిపెడుతుంది. ఊపిరితిత్తులు, గుండె, రక్తనాళాలను దెబ్బతీస్తూ గుండెజబ్బులు, పక్షవాతం వంటి ముప్పులను తెచ్చిపెడుతుంది. రకరకాల కేన్సర్లకూ కారణమవుతుంది. పొగాకు వినియోగానికి ఎంత దూరంగాఉంటే అంత మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
తిరుపతి (అలిపిరి): ఈ నగరానికి ఏమైంది.. ఓ వైపు మసి.. మరో వైపు పొగ.. ఎవరూ మాట్లాడరేం.. కాలే బీడీ, సిగరెట్ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి.. ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం.. అంటూ థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు తప్పకుండా వచ్చే ప్రకటన. జీవితాన్ని పొగబారుస్తున్న పొగాకు వినియోగాన్ని రూపుమాపాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు జారీ చేస్తున్న ప్రకటన ఇది. కానీ, ఆచరణకు వస్తే విశ్రాంతి సమయంలో ఓ దమ్ము లాగించేస్తున్న వారే ఎక్కువ. మరి ఎందుకిలా అంటే.. మంచిది కాదని తెలిసినా మానలేక పోతున్నాం.. గతంలో పెట్టె సిగరెట్ కాల్చేవాళ్లం ఇప్పుడు సగం పెట్టే కాలుస్తున్నాం.. అంటూ పొగరాయుళ్లు డైలాగులు చెబుతుంటారే తప్ప, పొగాకుకు దూరంగా ఉండడం లేదు. గుట్కా రూపంలోనూ పొగాకు వినియోగిస్తున్న వారు ఉన్నారు. పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1988 నుంచి ఏటా పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తోంది. ఈమేరకు అవగాహన కార్యక్రమాల ఫలితంగా భారత్‌లో పొగతాగే వారి సంఖ్యను 33.8 శాతం నుంచి 23 శాతానికి తగ్గించగలిగారు.
అనర్థాలే అధికం..
పొగాకును ఎక్కువగా సిగరెట్, చుట్ట రూపంలో పొగరాయుళ్లు వినియోగిస్తారు. గుట్కా నమలడం ఇతరత్రా రూపాల్లో తీసుకుంటున్నవారూ ఉన్నారు. పొగాకును ఏ రూపంలో తీసుకున్నా అనర్థాలే అధికమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగాకు శరీర అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
ఊపిరితిత్తులకు ముప్పు..
పొగ పీల్చగానే నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది. మనం పీల్చే గాలిలో స్వచ్ఛమైన ఆక్సిజన్ శరీరానికి అందుతుంది. హానికర కార్బన్ డైయాక్సైడ్, ఇతరత్రా వాయువులు విడిపోతాయి. ఆక్సిజన్‌ను హిమోగ్లోబిన్ పీల్చుకుని మిగిలిన వాయువులను బయటకు పంపుతుంది. పొగ తాగడం వల్ల శరీరంలోని కార్బన్ మోనాౖMð్స డ్, సైనైడ్ వంటి విష పదార్థాలు గాలి గదిలో చేరి హిమోగ్లోబిన్‌తో గాఢమైన బంధాన్ని ఏర్పరుచుకుంటాయి. దీంతో హిమోగ్లోబిన్‌కు ఆక్సిజన్ మోసుకుపోయే సామర్ధ్యం తగ్గి కార్బన్ మోనాక్సైడ్‌తో కణాలువిషపూరితమవుతాయి. ఫలితంగా ఎంఫసియా, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ ఫల్మనరీ డిసీజ్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయి.
తల భాగాలకు దెబ్బ..
సిగరెట్ కాల్చడం, గుట్కా నమలడంవల్ల తలలో ని పలు భాగాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. సిగరెట్ కాల్చడంవల్ల చెంపల లోపలి పొర తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. దంతాలకు ఉండే చిగుళ్లు కరిగి పోతాయి. దంతాల రంగు మారిపోతుంది. నోటి లోపలి మృదువైన పొరలు దెబ్బతిని ఆ ప్రాంతంలో కేన్సర్ వచ్చే అవకాశముంది. కేన్సర్ వచ్చే ముందు నోటిలో తెల్లటి మచ్చలు ఏర్పడుతాయి. దీనిని ల్యూకోప్లీకియా అంటారు. నోరు, నాలుక, అంగిలి, ట్రాకియా, ఈసోఫీగన్.. ఇలా నోటిలోని ప్రతిభాగమూ కేన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.
మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం..
శరీరాన్ని నియంత్రించే కీలకమైన భాగం మెదడే. దానికి ఆక్సిజన్ అందించే కెరోటిడ్ రక్తనాళాల్లో గానీ, ఇతర రక్తనాళాల్లో గాని రక్తం చిక్కబడి మెదడుకు రక్తప్రవాహం అందక పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. ఒకసారి పక్షవాతం వస్తే, ఇక రోగి జీవితాంతం ఇతరులపై ఆధారపడి దుర్భర జీవితం గడపాల్సిందే.
గొంతు కేన్సర్..
పొగాకు సేవించడం వల్ల నోటి తరువాత గొంతు సమస్యలు ఉత్పన్న మవుతాయి. గొంతులో ఉండే ప్రతి అవయవమూ పొగబారినపడి కేన్సర్‌కు లోనయ్యే ప్రమాదం ఉంది. గొంతులో ఉండే స్వరపేటిక, థైరాయిడ్, గొంతు నుంచి ఊపిరితిత్తుల్లోకి వెల్లే బ్రాంకియా..ఇలా ప్రతి భాగమూ దెబ్బతి అవయవాలన్నింటికీ కేన్సర్ వచ్చే అవకాశం ఉంది.
గుండెపోటు వచ్చే ప్రమాదం..
సిగరెట్ ముట్టించిన మురుక్షణం నుంచే గుండె వేగం అదుపు తప్పుతుంది. పది నిమిషాల పాటు అదే పనిగా సిగరేట్ తాగితే గుండె వేగం 30 శాతానికి పైగా పెరుగుతుంది. అంటే అవసరానికి మించి గుండె కొట్టుకుంటుందన్న మాట. సిగరెట్ తాగడం వల్ల రక్తం చిక్కబడుతుంది. దీంతో రక్తప్రవాహం సాఫీగా జరగక రక్తనాళాల మధ్య రక్తపు గడ్డలు ఏర్పడి గుండెకు రక్తం అందకపోవచ్చు. ఏ భాగానికి రక్తం అందకపోయినా ఆక్సిజన్, పోషకాలు అందక ఆ భాగం చచ్చుబడిపోయే ప్రమాదం ఉంది. ఇదే పరిణామం గుండెకు రక్తం సరఫరా చేసే కరోనరీ ఆర్టరీలో జరిగితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
పీల్చేవారికీ ప్రమాదమే..
పొగ తాగేవారి కంటే పీల్చేవారు తీవ్ర అనారోగ్యా ల బారినపడే అవకాశం ఉందని నిపుణులు చెబు తున్నారు. పొగతాగేవారిని యాక్టివ్ స్మోకర్లుగా, పీల్చేవారిని పాసివ్ స్మోకర్లుగా పిలుస్తారు. పొగ పీల్చడంవల్ల మహిళల్లో పునరుత్పత్తి శక్తి తగ్గుతుం ది. ఎక్కువ పీల్చడం వల్ల అబార్షన్లు జరగడం.. ఒకవేళ పిండం ఎదిగినా చివర్లో మృతిచెందిన శిశువులు జన్మించడం వంటి సమస్యలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ్లా 2.5 కోట్ల మంది పొగతాగేవారున్నట్లు అంచనా. ఒక సిగరెట్ తాగితే 43 రకాల విష వాయువులు వెలువడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment