World Tobacco Day
-
యువతకు గాలమేస్తున్నారు..
న్యూఢిల్లీ: పొగాకు లాబీ కన్ను ఇప్పుడు యువతపై పడింది. వారిని ఎలాగైనా పొగాకుకు బానిసలుగా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ సిగరెట్లలో యువతకు నచ్చే రుచి, వాసనలు చేర్చడం ఈ ప్రయత్నాల్లో భాగమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం గుర్తించింది. పీచు మిఠాయి, బబుల్గమ్, చెర్రీ పండ్ల రుచి వాసనలతో పొగాకు ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా ఆరోగ్యానికి చేసే హానిని కాదని.. యువత పొగాకును ఎక్కువగా వినియోగిస్తుందని పరిశ్రమ వర్గాల అంచనా. అంతేకాదు.... యూఎస్బీ డ్రైవ్, ఐస్‌క్యాండీ వంటి ఆకారాల్లో పొగాకు ఉత్పత్తులను సిద్ధం చేసి మరీ యువతకు గాలమేస్తున్నారు. (కరోనాకు ధూమపానం మంచిదేనట!) శుద్ధమైనవి, తక్కువ హాని చేసేవన్న లేబుళ్లు తగిలించడం వెనుక కూడా పరిశ్రమ హస్తం ఉందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. చాలా దేశాల్లో టెలివిజన్, ప్రింట్, సామాజిక మాధ్యమాల్లో పొగాకు ప్రకటనలివ్వడంపై నిషేధం ఉన్న నేపథ్యంలో కంపెనీలు యూటూబర్లు, ఇతర సామాజిక మాధ్యమ ఇన్‌ఫ్లుయెన్షర్లు (ప్రభావం చూపగలవారు)తో పరోక్షంగా తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్నట్లు, తద్వారా 18 ఏళ్ల లోపు వయసు వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. (ఊపిరాడటం లేదు..!!) యువత ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల అమ్మకం చేపట్టడం, తినుబండారాలు, కూల్‌డ్రింక్స్ అమ్మే చోట పొగాకు ఉత్పత్తుల ప్రచారం, సిగరెట్లు విడిగా అమ్మడం, పొగాకు ఉత్పత్తుల నియంత్రణకు ప్రభుత్వాలు చేసే అన్ని రకాల ప్రయత్నాలపై కొర్రీలు వేస్తూ వాటి అమలును జాప్యం చేయడం వంటివి ఈ ప్రయత్నాల్లో భాగంగానే చూడాలి. ఈ ఎత్తుగడలన్నింటినీ చిత్తు చేసే లక్ష్యంతోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది ‘నో టొబాకో డే’ ఇతివృత్తంగా కార్యక్రమాలను అమలు చేస్తోంది. కంపెనీల కుటిలయత్నాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ‘రహస్యం బట్టబయలు’ అన్న శీర్షికతో ప్రచార సామగ్రిని సిద్ధం చేసింది. ఆదాయానికి.. అలవాట్లకు లింకు ధూమపానం అలవాటయ్యేందుకు వ్యక్తులు, దేశాల ఆదాయానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ధనిక దేశాల్లో పొగతాగే వాళ్లు ఎక్కువగా ఉండటం దీనికి నిదర్శనం. అయితే అలవాట్లు మారేందుకు ఎక్కువ సమయం ఏమీ పట్టడం లేదు. 2000 సంవత్సరంలో యునైటెడ్ కింగ్డమ్లో దాదాపు 38 శాతం మంది పొగరాయుళ్లు ఉండగా... తాజా లెక్కల ప్రకారం ఇప్పుడు ఇది 22 శాతానికి తగ్గిపోయింది. ఇలాంటి హెచ్చుతగ్గులు చాలాదేశాల్లో కనిపిస్తాయి. ధూమపానం మానేస్తే... పొగ తాగడం వల్ల రకరకాల రసాయనాలు శరీరంలోకి చేరతాయి. వీటిల్లో చాలావరకూ రక్తంలోని ఆక్సిజన్‌ను హరించేవే. పొగతాగడం మానేసిన తరువాత కొంత కాలానికే రక్తంలో ఆక్సిజన్ మోతాదు పెరిగిపోతుంది. ఫలితంగా మరింత శక్తి, ఉత్సాహం లభిస్తాయి. అలాగే ఆహారపు రుచి తెలిసేలా చేసే టేస్ట్ బడ్స్ మళ్లీ చురుకుగా పనిచేయడం మొదలవుతుంది. దీంతో తినే తిండి రుచి, వాసనలు స్పష్టంగా తెలుస్తాయి. పొగాకు కారణంగా ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన గార, రసాయనాలు క్రమేపీ తగ్గిపోయి ఊపిరి పీల్చుకోవడం భారంగా అనిపించదు. అంతేకాదు.. పోషకాలు అందడం ఎక్కువ కావడం వల్ల చర్మంపైని ముడుతలు తగ్గుతాయి. -
పీల్చేవారికీ ప్రమాదమే..
పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్ అంటాడు ‘కన్యాశుల్కం’లో గిరీశం. పొగ తాగేవారు తమను తాము సమర్థించుకునే మాట ఇది. నిజానికి పొగతాగడం అంటే జీవితానికి పొగ పెట్టుకోవమే. చుట్ట, బీడీ, సిగరెట్.. ఏ రూపంలోనైనా పొగ తీవ్ర అనర్థాలను తెచ్చిపెడుతుంది. ఊపిరితిత్తులు, గుండె, రక్తనాళాలను దెబ్బతీస్తూ గుండెజబ్బులు, పక్షవాతం వంటి ముప్పులను తెచ్చిపెడుతుంది. రకరకాల కేన్సర్లకూ కారణమవుతుంది. పొగాకు వినియోగానికి ఎంత దూరంగాఉంటే అంత మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. తిరుపతి (అలిపిరి): ఈ నగరానికి ఏమైంది.. ఓ వైపు మసి.. మరో వైపు పొగ.. ఎవరూ మాట్లాడరేం.. కాలే బీడీ, సిగరెట్ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి.. ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం.. అంటూ థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు తప్పకుండా వచ్చే ప్రకటన. జీవితాన్ని పొగబారుస్తున్న పొగాకు వినియోగాన్ని రూపుమాపాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు జారీ చేస్తున్న ప్రకటన ఇది. కానీ, ఆచరణకు వస్తే విశ్రాంతి సమయంలో ఓ దమ్ము లాగించేస్తున్న వారే ఎక్కువ. మరి ఎందుకిలా అంటే.. మంచిది కాదని తెలిసినా మానలేక పోతున్నాం.. గతంలో పెట్టె సిగరెట్ కాల్చేవాళ్లం ఇప్పుడు సగం పెట్టే కాలుస్తున్నాం.. అంటూ పొగరాయుళ్లు డైలాగులు చెబుతుంటారే తప్ప, పొగాకుకు దూరంగా ఉండడం లేదు. గుట్కా రూపంలోనూ పొగాకు వినియోగిస్తున్న వారు ఉన్నారు. పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1988 నుంచి ఏటా పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తోంది. ఈమేరకు అవగాహన కార్యక్రమాల ఫలితంగా భారత్‌లో పొగతాగే వారి సంఖ్యను 33.8 శాతం నుంచి 23 శాతానికి తగ్గించగలిగారు. అనర్థాలే అధికం.. పొగాకును ఎక్కువగా సిగరెట్, చుట్ట రూపంలో పొగరాయుళ్లు వినియోగిస్తారు. గుట్కా నమలడం ఇతరత్రా రూపాల్లో తీసుకుంటున్నవారూ ఉన్నారు. పొగాకును ఏ రూపంలో తీసుకున్నా అనర్థాలే అధికమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగాకు శరీర అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఊపిరితిత్తులకు ముప్పు.. పొగ పీల్చగానే నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది. మనం పీల్చే గాలిలో స్వచ్ఛమైన ఆక్సిజన్ శరీరానికి అందుతుంది. హానికర కార్బన్ డైయాక్సైడ్, ఇతరత్రా వాయువులు విడిపోతాయి. ఆక్సిజన్‌ను హిమోగ్లోబిన్ పీల్చుకుని మిగిలిన వాయువులను బయటకు పంపుతుంది. పొగ తాగడం వల్ల శరీరంలోని కార్బన్ మోనాౖMð్స డ్, సైనైడ్ వంటి విష పదార్థాలు గాలి గదిలో చేరి హిమోగ్లోబిన్‌తో గాఢమైన బంధాన్ని ఏర్పరుచుకుంటాయి. దీంతో హిమోగ్లోబిన్‌కు ఆక్సిజన్ మోసుకుపోయే సామర్ధ్యం తగ్గి కార్బన్ మోనాక్సైడ్‌తో కణాలువిషపూరితమవుతాయి. ఫలితంగా ఎంఫసియా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ ఫల్మనరీ డిసీజ్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయి. తల భాగాలకు దెబ్బ.. సిగరెట్ కాల్చడం, గుట్కా నమలడంవల్ల తలలో ని పలు భాగాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. సిగరెట్ కాల్చడంవల్ల చెంపల లోపలి పొర తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. దంతాలకు ఉండే చిగుళ్లు కరిగి పోతాయి. దంతాల రంగు మారిపోతుంది. నోటి లోపలి మృదువైన పొరలు దెబ్బతిని ఆ ప్రాంతంలో కేన్సర్ వచ్చే అవకాశముంది. కేన్సర్ వచ్చే ముందు నోటిలో తెల్లటి మచ్చలు ఏర్పడుతాయి. దీనిని ల్యూకోప్లీకియా అంటారు. నోరు, నాలుక, అంగిలి, ట్రాకియా, ఈసోఫీగన్.. ఇలా నోటిలోని ప్రతిభాగమూ కేన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం.. శరీరాన్ని నియంత్రించే కీలకమైన భాగం మెదడే. దానికి ఆక్సిజన్ అందించే కెరోటిడ్ రక్తనాళాల్లో గానీ, ఇతర రక్తనాళాల్లో గాని రక్తం చిక్కబడి మెదడుకు రక్తప్రవాహం అందక పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. ఒకసారి పక్షవాతం వస్తే, ఇక రోగి జీవితాంతం ఇతరులపై ఆధారపడి దుర్భర జీవితం గడపాల్సిందే. గొంతు కేన్సర్.. పొగాకు సేవించడం వల్ల నోటి తరువాత గొంతు సమస్యలు ఉత్పన్న మవుతాయి. గొంతులో ఉండే ప్రతి అవయవమూ పొగబారినపడి కేన్సర్‌కు లోనయ్యే ప్రమాదం ఉంది. గొంతులో ఉండే స్వరపేటిక, థైరాయిడ్, గొంతు నుంచి ఊపిరితిత్తుల్లోకి వెల్లే బ్రాంకియా..ఇలా ప్రతి భాగమూ దెబ్బతి అవయవాలన్నింటికీ కేన్సర్ వచ్చే అవకాశం ఉంది. గుండెపోటు వచ్చే ప్రమాదం.. సిగరెట్ ముట్టించిన మురుక్షణం నుంచే గుండె వేగం అదుపు తప్పుతుంది. పది నిమిషాల పాటు అదే పనిగా సిగరేట్ తాగితే గుండె వేగం 30 శాతానికి పైగా పెరుగుతుంది. అంటే అవసరానికి మించి గుండె కొట్టుకుంటుందన్న మాట. సిగరెట్ తాగడం వల్ల రక్తం చిక్కబడుతుంది. దీంతో రక్తప్రవాహం సాఫీగా జరగక రక్తనాళాల మధ్య రక్తపు గడ్డలు ఏర్పడి గుండెకు రక్తం అందకపోవచ్చు. ఏ భాగానికి రక్తం అందకపోయినా ఆక్సిజన్, పోషకాలు అందక ఆ భాగం చచ్చుబడిపోయే ప్రమాదం ఉంది. ఇదే పరిణామం గుండెకు రక్తం సరఫరా చేసే కరోనరీ ఆర్టరీలో జరిగితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. పీల్చేవారికీ ప్రమాదమే.. పొగ తాగేవారి కంటే పీల్చేవారు తీవ్ర అనారోగ్యా ల బారినపడే అవకాశం ఉందని నిపుణులు చెబు తున్నారు. పొగతాగేవారిని యాక్టివ్ స్మోకర్లుగా, పీల్చేవారిని పాసివ్ స్మోకర్లుగా పిలుస్తారు. పొగ పీల్చడంవల్ల మహిళల్లో పునరుత్పత్తి శక్తి తగ్గుతుం ది. ఎక్కువ పీల్చడం వల్ల అబార్షన్లు జరగడం.. ఒకవేళ పిండం ఎదిగినా చివర్లో మృతిచెందిన శిశువులు జన్మించడం వంటి సమస్యలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ్లా 2.5 కోట్ల మంది పొగతాగేవారున్నట్లు అంచనా. ఒక సిగరెట్ తాగితే 43 రకాల విష వాయువులు వెలువడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
రోజుకు ఐదు సిగరెట్ల ఖర్చు కోటి రూపాయలు..
న్యూఢిల్లీ : పొగతాగడం ఆరోగ్యానికి ఎంత హానికరమో ప్రతిఒక్కరికీ తెలుసు. స్మోకర్లకూ ఈ విషయంపై ఇంకా బాగా అవగాహన ఉంటుంది. అయినా కూడా పొగరాయుళ్లు మాత్రం సిగరెట్ ను వదిలిపెట్టరు. గుప్పుగుప్పుమని పొగవదులుతూనే ఉంటారు. కానీ మీకు తెలియని మరో విషయమేమిటంటే.. స్మోకింగ్ మీరు ఊహించదానికంటే ఎక్కువగా మిమ్మల్ని ఆర్థికంగా కుంగదీస్తుంది. వరల్డ్ నో-టుబాకో డేగా సందర్భంగా ఎకనామిక్ టైమ్స్ ఆరోగ్యానికి స్మోకింగ్ కలుగజేసే ముప్పుతో పాటు ఆర్థికంగా ఏమేర దెబ్బతీస్తుందో గణాంకాలతో సహా వివరించింది. ఒకవేళ మీకు 30 ఏళ్ల వయసు ఉండి రోజుకు ఐదు సిగరెట్లు కాల్చకుండా ఉండలేకపోతున్నారనుకుంటే... రిటైర్మెంట్ వయసు 60ఏళ్లకు వచ్చేసరికి మీరు కోటికి పైగా రూపాయలకు పైగా కోల్పోవాల్సి వస్తుందని తెలిపింది. ఆ కోటి రూపాయలతో పాటు, పరోక్షంగా మరింత మొత్తాన్ని కోల్పోతారని ఎకనామిక్ టైమ్స్ అంచనావేసింది. సిగరెట్లపై చేసే వ్యయం... సిగరెట్లపై చేసే పొగరాయుళ్లు చేసే వ్యయం ఆర్థికంగా భారీగా దెబ్బకొడుతోంది. ఒక్కో సిగరెట్ ధర రూ.10-15 మధ్యలో ఉంటే, రోజుకు ఐదు సిగరెట్లను కాల్చితే వాటితో 60రూపాయల మేర ఖర్చవుతుంది. అంటే నెలకు 1800 రూపాయల పైననే సిగరెట్ల కోసం వెచ్చిస్తారు. నెలకు ఖర్చు ఏడాదికి వీటిపై పెంపు 30 ఏళ్లలో సిగరెట్లపై చేసే వ్యయం రూ.1800 8 శాతం రూ.24.47 లక్షలు ఒకవేళ ఆ మొత్తాన్ని సిగరెట్లపై కాకుండా.. పెట్టుబడులుగా పెట్టి ఉంటే, 9 శాతం వడ్డీతో రూ.69.23 లక్షలు పొదుపు చేస్తారు. ఇవి కేవలం అంచనాలు మాత్రమే. పొగాకు ఉత్పత్తులపై పన్నులు విపరీతంగా పెరుగుతుంటాయి. దీంతో సిగరెట్ ధరలు ప్రతేడాది గణనీయంగా పైకి ఎగుస్తూ ఉంటాయి. గత నాలుగేళ్లలో ప్రతేడాది సగటున 20 శాతం మేర సిగరెట్ ధరలు పెరిగాయి. గత నాలుగేళ్లలో సిగరెట్ ధరలు రెండింతలు కంటే ఎక్కువగా పైకి ఎగిశాయి. గోల్డ్ ఫ్లేక్ కింగ్స్ ప్యాకెట్ ధరలు సిగరెట్ తాగడం వల్ల అయ్యే వైద్య ఖర్చులు... నెలకు అయ్యే ఖర్చు వార్షిక పెంపు 30 ఏళ్లలో ఖర్చు 400 రూపాయలు 12 శాతం రూ.11.59 లక్షలు ఒకవేళ ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెడితే 9 శాతం వడ్డీతో రూ.26.7 లక్షలవుతాయి. అయితే వినియోగదారుల ద్రవ్యోల్బణంతో పోలిస్తే వైద్య ద్రవ్యోల్బణం చాలా అధికంగా ఉంటుంది. డ్రగ్స్ ధరలు, డాక్టర్ల కన్సల్టేషన్ ఛార్జీలు, డయాగ్నోస్టిక్ ఛార్జీలు సగటున 15 శాతం మేర పెరిగాయి. ఏడాదికి 12 శాతం పెంపుతోనే వీటిని గణించింది ఎకనామిక్ టైమ్స్. ఇన్సూరెన్స్ వ్యయాలు... లైఫ్ ఇన్సూరర్స్ స్మోకర్ల నుంచి ఎక్కువ ప్రీమియంలు వసూలు చేస్తాయి. కోటి రూపాయల బీమా కవర్ చేయాలంటే 30ఏళ్ల వ్యక్తి ప్రతినెలా రూ.460 ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన... నెలవారీ ఖర్చు వార్షిక పెంపు 30ఏళ్లలో ఖర్చు రూ.460 నిల్ రూ.1.65 లక్షలు ఈ మొత్తాన్ని కూడా 9శాతంతో ఇన్వెస్ట్ చేస్తే అది రూ.7.52 లక్షలవుతుంది. సిగరెట్ల ఖర్చు మెడికల్ వ్యయాలు ఇన్సూరెన్స్ ఖర్చు రూ.69.23 లక్షలు + రూ.26.70 లక్షలు + రూ.7.52 లక్షలు ఈ మొత్తం కలిపితే రూ.1.03 కోట్లవుతుంది.