గోరఖ్‌పూర్ : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మీడియాపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయనకు పద్మావత్ చిత్ర విడుదలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో మీడియాపై ఆయన చికాకు పడ్డారు.
‘‘నేనేమైనా జ్యోతిష్కుడిని అనుకుంటున్నారా? ముఖ్యమంత్రిని. చిత్రం విడుదల అవుతుందో.. లేదో నేనెలా చెప్పగలను. ఆ నిర్ణయం నా చేతుల్లో లేదు. జరిగేది జరుగుతుంది. ఈ విషయంలో ఇంకా ప్రశ్నలు అడగకండి’’ అంటూ మీడియాపై యోగి అసహనం ప్రకటించారు. ఈ లెక్కన్న ఖచ్ఛితంగా చిత్రంపై నిషేధం విధించాలన్న ఆలోచనలో ఆయన లేడనే విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా, యోగి గతంలో ఓసారి ఈ చిత్ర వివాదంపై స్పందిస్తూ... ‘ప్రజల మనోభావాలతో ఆడుకోవటం చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి అలవాటైన పనే’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున్న నిరసనలు వినిపిస్తున్నాయని, కాబట్టే ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే జనవరి 25న పద్మావత్ హిందీతోపాటు తెలుగు, తమిళ్‌లో విడుదల కాబోతోంది. మధ్య ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల కానివ్వబోమని ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment