హిజ్రా వేధింపులు.. యువకుడి ఆత్మహత్య | youth william suicide due to transgender | Sakshi
Sakshi News home page

హిజ్రా వేధింపులు.. యువకుడి ఆత్మహత్య

Published Wed, May 4 2016 8:47 PM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM

హిజ్రా వేధింపులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

బెంగళూరు: హిజ్రా వేధింపులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులోని బయప్పనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. బయప్పనహళ్లికి చెందిన విలియం(21) అదే ప్రాంతంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఆ ఏరియాలో ఉండే హిజ్రాలతో రెండేళ్లుగా పరిచయం ఉంది. వారం కిందట ఓ హిజ్రా విలియం ఇంటికి వచ్చి తన చెల్లెలిని వివాహం చేసుకోవాలని తీవ్రంగా వేధించింది. ఈ విషయంపై మనో వేదనకు గురైన విలియం మంగళవారం సాయంత్రం బయప్పనహళ్లి వద్ద రైలు కింద తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై బయప్పనహళ్లి రైల్వేపోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement