
తాజాగా జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సాధించిన ఈ అద్భుత విజయాన్ని ప్రపంచం నలుమూలలా ఉన్న వైఎస్సార్‌సీపీ అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అమెరికాలోని డెలావేర్ స్టేట్ ఎన్నారైలు విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు.
వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌ను రాజన్న కంటే ఇంకా అద్భుతం గా పరిపాలిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమం లో ఎన్నారై వైఎస్సార్‌సీపీ కమిటీ మెంబెర్స్, డెలావేర్ వైసీపీ ఇంచార్జి అంజిరెడ్డి శాగంరెడ్డి, రవి మరక, జగన్ దుద్దుకుంట మరియు డెలావేర్ వైఎస్సార్‌సీపీ కమిటీ మెంబర్స్ సాయి, శశి, దర్మ, లక్ష్మీనారాయణ, అఫ్రోజ్, రవి దుంప, రమణ, కిశోర్, చరణ్, మధు, హరి, భరత్, భాస్కర్, నిరంజన్, చంద్ర, శ్రీనివాస్, జనార్దన్, హరి, సుధాకర్ చేజర్ల, నవీన్, నరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరు వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment