సాక్షి, హైదరాబాద్ : గల్ఫ్ తో సహా 18 దేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే భారతీయులను భర్తీ చేయడానికి అవసరమైన రిక్రూటింగ్ ఏజెన్సీ లైసెన్సు పొందడం ఎలా అనే విషయంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
అధికారులు సమావేశం కానున్నారు. మే 1 న ఉదయం 10 గం.లకు హైదరాబాద్ నాంపల్లి లోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ (పిఓఈ) కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలిపారు.
భారత దేశంలో 1200 పైచిలుకు రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీలు ఉండగా, ఇందులో 500 వరకు ముంబైలో, మిగతావి ఇతర మెట్రో నగరాలలో ఉన్నాయని భీంరెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో తగినన్ని రిజిస్టర్డ్ ఏజెన్సీలు లేకపోవడం వలన ఆశావహులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. పలువురి విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీల బ్యాంకు గ్యారంటీ రూ.50 లక్షలు చెల్లించే స్థోమతలేనివారి కోసం రూ.8 లక్షల బ్యాంకు గ్యారంటీతో చిన్న ఏజెన్సీల లైసెన్సు కూడా పొందవచ్చని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment