
కౌలాలంపూర్ : దీపావళి పండుగ సందర్బంగా మలేషియా తెలుగు ఫౌండేషన్(ఎంటీఎఫ్) ఆధ్వర్యంలో వయో వృద్దులకు దీపావళి కానుకలు అందించారు. పహంగ్ లోని అమ్మవారి ఆలయములో వయో వృద్దులకి పంచలు, చీరలు అందించారు. గత ఐదు సంవత్సరాలుగా ఎంటీఎఫ్ పలు స్వచ్చంద కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇలాంటి కార్యక్రమాలు మలేషియాలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఏడాది ఎంటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ప్రెసిడెంట్ కాంతారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


Comments
Please login to add a commentAdd a comment