టెన్సీసీ : అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. టెన్సీసీ రాష్ట్రంలో తెలుగు వ్యక్తి ఎడ్ల సునీల్ హత్యకు గురయ్యారు. ఇద్దరు మైనర్‌లు కాల్చి చంపారు. గత 25 ఏళ్లుగా టెన్సీసీలోని నార్త్ నాష్ విల్లేలో సునీల్ స్థిరపడ్డారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటి నుంచి మనవడిని తీసుకుని బయటకు వస్తుండగా సునీల్‌పై ఇద్దరు మైనర్‌లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సునీల్ అక్కడికక్కడే కుప్పకూలారు. హత్య తరువాత సునీల్‌కు సంబంధించి కారులోనే ఇద్దరు దుండగులు పారిపోయారు. కుటుంబసభ్యులు సమాచారం ఇవ్వడంతో కొద్దిసేపట్లోనే హంతకులను పోలీసులు పట్టుకున్నారు.
ఎడ్లసునీల్ బంధువులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, తెలంగాణలోని మెదక్‌లోనూ ఉన్నారు. టెన్సీసీలోని వివిధ చర్చిలలో పాటలు పాడటం ద్వారా సునీల్ చాలా మందికి సుపరిచితులు. మెదర్ చర్చిలోనూ ఆయన చాలా సార్లు పాటలు పాడారని ఆయన బంధువులు తెలిపారు. ఎడ్ల సునీల్ హత్యతో ఎన్‌ఆర్‌ఐలు షాక్‌కు గురయ్యారు. ఆయన కుటుంబానికి పలువురు సంతాపం తెలిపారు. ఈ హత్య జాతివిద్వేశం వల్ల జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment