
కౌలాలంపూర్ : మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటరాక్టివ్ వర్చ్యువల్ ఈవెంట్ ద్వారా ఆన్లైన్‌లో వినూత్నంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర గీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తెలంగాణ అమర వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా లైవ్‌లోనే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. అలాగే లైట్ హౌస్ చిల్డ్రన్ వెల్ఫేర్ హోమ్ వారికి కావలసిన సరుకులను సరఫరా చేశారు.
ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, నరేంద్రనాథ్, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్, ట్రేసరర్ మారుతీ, జాయింట్ ట్రేసరర్ రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ రవి వర్మ, కృష్ణ వర్మ, కిరణ్ గాజంగి, హరి ప్రసాద్, వివేక్, రాములు, సుందర్, కృష్ణ రెడ్డి, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న, వైస్ ప్రెసిడెంట్- అశ్విత, యూత్ వింగ్ యూత్ ప్రెసిడెంట్- కార్తీక్, యూత్ వైస్ ప్రెసిడెంట్- కిరణ్ గౌడ్, యూత్ వైస్ ప్రెసిడెంట్- రవితేజ, కల్చరల్ వింగ్ మెంబర్స్ విజయ్ కుమార్, చందు, రామ కృష్ణ, నరేందర్, రంజిత్, సంతోష్, ఓం ప్రకాష్, అనూష, దివ్య, సాహితి, సాయిచరని, ఇందు, మైగ్రంట్ వింగ్ మెంబర్స్ ప్రతీక్, మధు, శ్రీనివాస్, రఘునాథ్ , సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment