
మోర్తాడ్ (బాల్కొండ) : పర్యాటకుల స్వర్గధామమైన మలేషియాలో భారత్‌తో పాటు మరో 22 దేశాల పౌరుల ప్రవేశాన్ని రద్దు చేస్తూ అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపింది. ఈ నిషేధం ఈ నెల 7వ తేదీ నుంచి అమలులోకి రాగా డిసెంబర్ 31 వరకు కొనసాగనుంది. కోవిడ్ 19 రహిత దేశంగా మలేషియాను నిలపాలనే ఉద్దేశ్యంతో ఈ ఆంక్షలు విధించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇక మలేషియాలో పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కొందరు ఏజెంట్లు పలువురిని విజిట్ వీసాలపై తరలించారు. వీరిలో తెలంగాణకు చెందిన వారే అధికంగా ఉన్నారు. వీరిలో కొంతమంది అప్పులు చేసి స్వదేశానికి చేరుకోగా, మరికొంత మంది మలేషియాలోనే చిక్కుకుపోయారు. తాజాగా అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ దేశానికి వెళ్లాలనుకున్నా, అక్కడి నుంచి తిరిగి భారత్‌కు రాలేని పరిస్థితి. (కరోనా కట్టడికి ఉ.కొరియా షూట్ ఎట్ సైట్)
Comments
Please login to add a commentAdd a comment