
కువైట్ : ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తికానున్న సందర్భంగా కువైట్ వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ‘వాక్ విత్ జగనన్న’ కార్యక్రమాన్ని మాలియా ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన జరుగుతుందని, ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి, మంత్రులు ఖునీ చేస్తున్నారని మండిపడ్డారు.
మంత్రులు ప్రజలకు డబ్బులు పంచి రాత్రికి రాత్రి అధికారంలోకి వస్తామని చెప్పడం సిగ్గచేటన్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు జననేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తికానున్న నేపథ్యంలో వారికి సంఘీభావంగా ‘వాక్ విత్ జగనన్న’ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులైన కువైట్ వైఎస్‌ఆర్‌సీపీ కో కన్వీనర్ యం.నరసారెడ్డి, ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి లను అభినందించారు.
2019లో జగన్‌మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునే దిశగా ప్రవాసాంధ్రులు కృషి చేయాలని కో కన్వీనర్ గోవిందు నాగరాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కువైట్ కమిటి ముఖ్య నాయకులతో పాటు భారీగా వైఎస్‌ఆర్ కుటుంబ అభిమానులు పాల్గొన్నారు.



Comments
Please login to add a commentAdd a comment