
ఆశయం కోసమే జీవించిన మాననీయుడు
భావోద్వేగంతో ఆశయం కోసం ప్రాణాలర్పించడం వేరు. ఆశయం కోసం యావజ్జీవితాన్ని అంకితం చేయడం వేరు. ఎస్వీ రాజు రెండో కోవకు చెంది నవారు. తనతో నా జ్ఞాప కాలు 60 ఏళ్ల వెనుకటివి. 20 ఏళ్ల వయసులో జీవిక కోసం దక్షిణాది నుంచి ముంబై వెళ్లిన రాజు అప్పట్లో.. అంటే 1959లో ఆవిర్భవించిన స్వతంత్ర పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శిగా చేరారు. రాజా జీ స్థాపించిన ఈ పార్టీకి రంగా అధ్యక్షుడు కాగా ఎం ఆర్ మసాని ప్రధాన కార్యదర్శి.
1950 ప్రారంభంలో కమ్యూనిస్టు భావజాల ప్రచారం జాతిని ఊపేసింది. దాన్ని ఎదుర్కొనడా నికి ఏదో ఒకటి చేయమని సర్దార్ పటేల్, మసానీని కోరారు. కూర్చోవడానికి ఒకచోటు, రూ.5 వేలను ఇస్తే అలాగే చేయగలనన్నారు మసానీ. సర్దార్ ఆదే శంతో నాటి బాంబే రాష్ట్ర ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయ్ ఆ ఏర్పాట్లను పూర్తి చేశారు. అలా అందివ చ్చిన చిన్న మొత్తంతోనే మసానీ ఉదార తత్వశాస్త్రం పై సంబంధించిన పలు పుస్తకాలను ప్రచురించి పంపిణీ చేశారు. ఫ్రీడమ్ ఫస్ట్ అనే మాస పత్రికను కూడా ఆయ న ప్రారంభించారు. ఈ పత్రిక గత 64 ఏళ్లుగా నిరంత రాయంగా ప్రచురిత మవుతూవచ్చింది.
1998 మే 27న మసానీ అస్తమయంతో రాజు ఫ్రీడమ్ ఫస్ట్ పత్రిక తోపాటు ఇతర బాధ్యతల నూ స్వీకరించారు. అత్యవసర పరి స్థితి కాలంలో పేరొందిన ప్రెస్ ప్రభుత్వ ఆదేశాలకు పూర్తిగా లొంగిపోయినప్పుడు ది స్టేట్స్‌మన్, ఇండి యన్ ఎక్స్‌ప్రెస్, ఫ్రీడమ్ ఫస్ట్ వంటి పత్రికలే పత్రికా స్వాతంత్య్రం కోసం లేచి నిలబడ్డాయి. అరవైల మధ్యలో గుంటూరు వైద్య కళాశాలలో మెడికోగా ఉన్నప్పుడు రాజుతో నాకు పరిచయం ఏర్పడింది. ఆనాటినుంచి ఆయనతో స్నేహబంధం సాగిస్తూ వచ్చాను. 1963-64 మధ్యలో 17వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళ నలో, 1972-73నాటి చారిత్రాత్మక జై ఆంధ్ర ఉద్య మంలో రాజు మాకు మార్గదర్శకత్వం వహించారు. స్వతంత్ర పార్టీ కథ ముగిసిపోయాక రాజు ఏడేళ్ల పాటు మసానీ కార్యదర్శి గా పనిచేశారు. తర్వాత నాలుగేళ్ల పాటు గల్ఫ్ దేశాల్లో పనిచేశారు. కూడ బెట్టిన కొద్ది మొత్తంతో ముంబైలోని చెంబూరు ప్రాంతంలో చిన్న ఇల్లు కొనుక్కున్నారు. ముంబైకి వెళ్లడం ఎ ప్పుడు తటస్థించినా మసానీ, పాయ్, నాని పాల్కీవాలా, రాజుతో కాస్సేప యినా గడిపి వచ్చేవాడిని. ఆంధ్రప్రదేశ్‌లోని గుం టూరు, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, విశా ఖపట్నంతోపాటు మద్రాసు, కోయంబత్తూరుల్లో కూడా మేము విద్యపై పలు వర్క్‌షాపులను నిర్వ హించాం. రాజు ఆధ్వర్యంలో 1997లో గుంటూరు పట్టణంలో ‘50 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత’ భారత్ అనే అంశంపై మూడురోజుల వర్క్‌షాపును నిర్వ హించాం. 2004లో గుంటూరులోనే వ్యవసాయ సం క్షోభంపై సభ నిర్వహించాం.
1977లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాక ప్రొఫె సర్ ఎస్‌పీ అయ్యర్‌తో కలసి రాజు ‘విదర్ ది విండ్ బ్లోస్’ అనే గ్రంథాన్ని రచించారు. తన పుస్తకంలో ఆయన నాపేరు కూడా ప్రస్తావించారు. మసానీ శత జయంతి ఉత్సవాలను 2005 కాలంలో హైదరాబా ద్‌లో నిర్వహించాం. రైతుల సమస్యలపై హైదరాబా ద్‌లో ఎన్నో సభలు పెట్టాం. వైఎస్ రాజశేఖరరెడ్డి, జక్కర్, బర్నాలా వంటి ప్రముఖ రాజకీయనేతలు, స్వామినాథన్ వంటి శాస్త్రవేత్తలు వీటిలో పాల్గొన్నా రు. గోపాలకృష్ణ గోఖలే శత వర్థంతి సందర్భంగా గతేడాది నవంబర్ 15న ఒక గోష్టి నిర్వ హించారు. రాజుతో అదే నా చివరి సమావేశం.
ఉదారవాదంపై రాజాజీ, మినూమసానీ, రం గా వంటి ప్రముఖుల అమోఘమైన వారసత్వం గత 25 ఏళ్లుగా జాతిపై ప్రభావం చూపుతూ వస్తోంది. దురదృష్టవశాత్తూ రాజు తదితరులు తమ కాలం కన్నా పావు శతాబ్దం ముందుండేవారు. రాజుకు తన పరిమితులు తెలుసు. అందుకే ఆయన బహిరంగ జీవితంలోకి రాకుండా ఎల్లప్పుడూ తెరవెనుకే ఉండేవారు.
(ఇటీవలే కన్నుమూసిన సోషలిస్టు
చింతనాపరుడు ఎస్‌వీ రాజు స్మరణలో...)
వ్యాసకర్త మాజీ పార్లమెంట్ సభ్యులు
మొబైల్: 986637673
యలమంచిలి శివాజీ