విభజన వినాశనానికే! | Andhra Pradesh Division Leads to Destruction! | Sakshi
Sakshi News home page

విభజన వినాశనానికే!

Published Thu, Aug 22 2013 2:00 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM

విభజన వినాశనానికే! - Sakshi

విభజన వినాశనానికే!

విశ్లేషణ: గోదావరి నుంచి కృష్ణా నదిలోకి లభించే నీటితో నాగార్జునసాగర్, కృష్ణా డెల్టాలను రక్షిస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది. కృష్ణానది ద్వారా రాయలసీమకు నికరజలాల కేటాయింపు కేవలం 19 టీఎంసీలు మాత్రమే. నికరజలాలు, మిగులుజలాలు అని చూడకుండా అన్ని ప్రాంతాలకు నీరందించే సమగ్ర నీటి విధానం రూపొందించి అందరికీ న్యాయం జరగడానికి అన్ని ప్రాంతాల వారు సహకరించాలి. అలాకాకుండా ఒక వేళ విభజనే జరిగితే రాష్ట్రం వినాశనం కాక తప్పదు.
 
 సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడు తున్నది. రాజకీయ పార్టీల ప్రమే యం లేకుండా పూర్తిగా ప్రజా ఉద్యమంగా అది ముందుకు సాగుతున్నది. రాష్ట్రాన్ని ముక్క లు చేస్తున్నారని, హైదరాబాద్ తమది కాకుండాపోతున్నదనే బాధను జీర్ణించుకోలేక భావో ద్వేగంతో ఒక్కసారిగా ఈ ఉద్య మం పెల్లుబుకింది. ఈ నేపథ్యం లో గత 60 ఏళ్లలో సాగునీటి వనరులు, అవసరాలు,  పం పిణీ తీరుతెన్నులను పరిశీలిద్దాం. 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగం గా ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ర్ట, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయి.
 
 మన రాష్ట్రంలో అప్పటికే ఉన్న కృష్ణ, గోదావరి, పెన్న, నాగావళి, వంశధార నదులపై ఉన్న బ్యారేజీలు, కర్నూలు-కడప కాలువ, అనేక పెద్ద చెరువుల ద్వారా వ్యవసాయం పెద్ద ఎత్తున కొనసాగింది. గణనీయ మైన ఉత్పత్తి జరిగిన ఆంధ్రప్రదేశ్ దేశానికే అన్నపూర్ణగా, ధాన్యాగారంగా నిలిచింది. 1960 నుంచి అన్ని రాష్ట్రాలలో అనేక పెద్ద నీటిపారు దల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. మన రాష్ట్రంలో నాగా ర్జునసాగర్, శ్రీరామ్‌సాగర్, శ్రీశైలంతో పాటు తుంగభద్ర, సోమశిల, తెలుగుగంగ వగైరా ప్రాజెక్టుల నిర్మాణం జరి గింది. అలాగే ఎగువ రాష్ట్రాలలో కూడా ఆల్మట్టి, ఉజ్జని వగైరా ప్రాజెక్టులను నిర్మించారు. అన్ని ప్రాంతాలలో నీటికి డిమాండ్ పెరిగింది. బోర్‌బావుల నుంచి విద్యుత్ మోటార్ల సహాయంతో నీటి వినియోగం పెరిగింది.
 
 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మహారాష్ట్ర, కర్ణాటకలకు అదనంగా 258 టీఎంసీలు కేటాయించడంతో ఎగువ రాష్ట్రాలు నిర్మించిన అనేక చిన్న, పెద్ద తరహా ప్రాజెక్టుల వలన ఆల్మట్టి ఎత్తు పెరిగి అదనంగా 103 టీఎంసీలు నీటి నిల్వ స్థోమత పెరిగి, నీటి వినియోగం పెరగడంవలన మన రాష్ట్రానికి నీటి చేరిక గణనీయంగా తగ్గింది. మిగులు జలాల ఆధారంగా మన రాష్ట్రంలో నిర్మించిన తెలంగాణ లోని భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్, శ్రీశై లం ఎడమగట్టు కాలువ (సొరంగమార్గం)కు 150 టీఎంసీలు, రాయలసీమలో తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రి-నీవా, కేసీ కెనాల్, గండికోట లిప్ట్, ఆంధ్రాలోని వెలిగొండ ప్రాజెక్టులకు 170 టీఎంసీల నీరు కావాలి. ఈ ప్రాజెక్టుల నిర్మాణం 80 శాతం మేర పూర్తయింది. రెండు మూడేళ్లలో పూర్తి వినియోగంలోకి వస్తాయి.
 
 కాని అసలు సమస్య నీటి లభ్యతే. నీటి అవసరాలు ఆయా ప్రాజెక్టులకు ఈ విధంగా ఉన్నాయి. జూరాల ప్రాజె క్టు ఆధారంగా తెలంగాణలోని జూరాల కాలువలకు 22, బీమాకు 25, నెట్టెంపాడుకు 23, కోయిల్‌సాగర్‌కు 5, మొత్తం 75 టీఎంసీలు; శ్రీశైలం ప్రాజెక్టు ఆధారంగా ఎడమవైపున తెలంగాణలోని కల్వకుర్తికి 25, ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం ద్వారా 39, హైదరాబాద్ మంచినీటికి 18 మొత్తం 82 టీఎంసీలు; అలాగే కుడివైపున రాయలసీమ లోని ఎస్‌ఆర్‌బీసీకి 22, తెలుగుగంగకు 30, గాలేరు- నగరికి 38, హంద్రీ-నీవాకు 42, కేసీకెనాల్ సప్లిమెంటేషన్ కు 10, చెన్నైకి మంచినీటికి 15, వెలిగొండ (ప్రకాశం జిల్లా)కు 43, సోమశిల వగైరాలకు 20, మొత్తం 220 టీఎంసీల నీరు కావాలి. కాబట్టి శ్రీశైలం వరకు కృష్ణానది ద్వారా రావలసిన నీరు 75+82+220+33 (నీటి ఆవిరి నష్టాలతో కలిపి) మొత్తం 410 టీఎంసీలు. ఇందులో నికర జలాలు 72 టీఎంసీలు మాత్రమే.
 
 మనకు కేటాయించిన 811 టీఎంసీలలో తుంగభద్ర నది ద్వారా 110 టీఎంసీలు, మైనర్ ఇరిగేషన్ 116, మీడి యం ఇరిగేషన్ 53, నాగార్జునసాగర్ దిగువ ప్రాంతం నుంచి కృష్ణా డెల్టాకు లభించాల్సిన 81 టీఎంసీలు మొత్తం 360 టీఎంసీలు లభ్యమైనట్లుగానే భావించాలి. అనగా కృష్ణానది ద్వారా నేరుగా లభించవలసింది 451 టీఎంసీ లు మాత్రమే. ఇందులో నీటి ఆవిరికి కేటాయించిన 50 టీఎంసీలు జూరాల, శ్రీశైలం ఆధార ప్రాజెక్టులకే సరిపో తుంది. అంటే దాదాపు శ్రీశైలం దిగువకు కృష్ణానది నీరు పారే అవకాశమే లేదు.
 
 ఈ వివరాల ప్రకారం మనకు కేటాయించిన 811 టీఎంసీలు లభిస్తే కేవలం శ్రీశైలం వరకు ఉన్న ప్రాజెక్టుల ద్వారా 32 లక్షల ఎకరాల సాగుకు మాత్రమే నీరు అందే అవకాశం ఉంది. ఈ ఆయకట్టు మొత్తం తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ, రాయలసీమలోని 4 జిల్లా లతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలు. అందువలన ఈ దుర్భిక్ష ప్రాంతాలకు తాగు, సాగు నీరు అవసరాల కోసం నీరు అందించాల్సిన అవస రం ఎంతైనా ఉంది. కానీ అదే సమయంలో శ్రీశైలం దిగు వకు నీరు ప్రవహించకపోతే నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా లకు కావలసిన 365 టీఎంసీల నీరు ఎలా లభిస్తుంది? సాగు ఎలా అవుతుంది?
 
 కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్‌లకు నీరు అందించాలి కాబట్టి గోదావరి మిగులు జలాలను కృష్ణానదిలోకి మళ్లిం చాల్సిందే. దానికి ప్రధానంగా పోలవరం - విజయవాడ లింకు ద్వారా 80 టీఎంసీలు, దుమ్ముగూడెం - నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్ లింక్ ద్వారా 160 టీఎంసీలు మళ్లిస్తే శ్రీశైలం దిగువ అవసరాలు తీరుతాయి. శ్రీశైలం దిగువన కృష్ణానది ద్వారా లభించే నీటిని పైప్రాంతాలకు వినియో గించటం ద్వారా, దిగువ ప్రాంతాలకు గోదావరి నదిని మళ్లించటం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నీటి సమ స్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి.
 
 ఇక గోదావరి విషయానికొస్తే గోదావరి నుంచి మన రాష్ట్రానికి 1,480 టీఎంసీలు కేటాయించినప్పటికీ మొత్తం నీరు సద్వినియోగం కావడం లేదు. మహారాష్ట్ర సరిహద్దు లలో ఉన్న శ్రీరామ్‌సాగర్ అతి పెద్ద ప్రాజెక్టు. గోదావరి నదీ గర్భానికి ఇరువైపుల గల భూములు 60 నుంచి 320 మీటర్ల ఎత్తులో ఉండటం వలన నీరు పారనందున శ్రీరామ్‌సాగర్ దిగువన ఎటువంటి ప్రాజెక్టు నిర్మాణం జరగలేదు. ధవళేశ్వరం వద్ద నిర్మించిన కాటన్ బ్యారేజీ ద్వారా గోదావరి డెల్టాలోని 10 లక్షల ఎకరాలు గత 150 ఏళ్లుగా సాగవుతూనే ఉన్నాయి. తెలంగాణలోని భూములకు నీరు అందించేందుకు అనేక ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపట్టారు. అవి ఇంది రాసాగర్ (రుద్రంకోట) రాజీవ్ సాగర్ (దుమ్ముగూడెం), దేవాదుల (కంతలపల్లి), కాళేశ్వరం, ఎల్లంపల్లి, ప్రాణ హిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకాలు. ఇవన్నీ వివిధ దశలలో ఉన్నాయి. వీటి ద్వారా 44 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఈ పథకాలకు కావలసిన విద్యుత్ సుమారు 6,300 మెగావాట్లు.
 
 నదుల అనుసంధానంలో అత్యంత తక్కువ ఖర్చు తో, గ్రావిటీ ద్వారా గోదావరి మిగులు జలాలను కృష్ణాన దిలోకి తరలించే పథకమే పోలవరం - విజయవాడ లింక్. బచావత్ అవార్డు ప్రకారం నీటి కేటాయింపులు ఉండి, 1980లో ఐదు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగినా, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అన్నీ అడ్డంకులే. కాలువల నిర్మాణం 90 శాతం పూర్తయినా గోదావరి నదిపై పోలవరం వద్ద ప్రాజెక్టు నిర్మాణం ఆరంభ దశలోనే ఉంది. ఈ ప్రాజెక్టుకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతోపాటు తెలంగాణవాదులు కూడా కోర్టులలో కేసులు వేసి అడ్డుకుంటున్నారు. గోదావ రిలో అక్టోబర్ నుంచి నీటి ప్రవాహం గణనీయంగా తగ్గి పోతున్నది. జూలై 15 నుంచి నవంబర్ 15 వరకు చూస్తే మొదటి 45 రోజులలో 10 లక్షల క్యూసెక్కులకుపైగా, తదుపరి 35 రోజులలో 2 నుంచి 5 లక్షల క్యూసెక్కులు, మిగిలిన 40 రోజులలో 75 నుంచి 30 వేల క్యూసెక్కులు మాత్రమే ఉంటున్నది.
 
 పోలవరం ఎగువన తెలంగాణలో నిర్మించే ఎత్తిపో తల పథకాలకు కావలసిన నీరు 72 వేల క్యూసెక్కులు. కానీ ప్రవాహం 2007 నుంచి 2012 మధ్యకాలంలో అక్టో బర్ నెలలో సగటున 57,462 క్యూసెక్కులు, నవంబర్ నెలలో 44,758 క్యూసెక్కులు మాత్రమే. అందువలన కనీ సం గోదావరి డెల్టా మొదటి పంటను కాపాడాలన్నా పోల వరం నిర్మాణం తప్పనిసరి. పోలవరం నిర్మాణం ద్వారా గోదావరి, కృష్ణా డెల్టాలతోపాటు నాగార్జునసాగర్ ఆయ కట్టుకు కూడా కొంతమేర నీటికొరత తీరుతుంది. ప్రత్య క్షంగా 40 లక్షల ఎకరాలకు, పరోక్షంగా 20 లక్షల ఎకరా లకు మేలు చేకూరుతుంది. లభ్యమయ్యే 960 మెగావాట్ల జల విద్యుత్తును ఎగువన ఎత్తిపోతల పథకాలకు ఉపయో గించవచ్చు. అలాగే దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ లింక్ కూడా తిరిగి ప్రారంభించాలి. దీని ద్వారా నాగార్జునసాగర్ మూడవ జోన్ ఆయకట్టుకేకాక, సాగర్ జలాశయంలోకి నీటిని పంప్ చేయడం ద్వారా సాగర్ ఆయకట్టుకు కూడా మేలు జరుగుతుంది.
 
 కాబట్టి గోదావరి నుంచి కృష్ణా నదిలోకి లభించే నీటితో నాగార్జునసాగర్, కృష్ణా డెల్టాలను రక్షిస్తే రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది. ఇది చాలా అవసరం. కృష్ణానది ద్వారా (తుంగభద్ర కాకుండా) రాయలసీమకు నికరజలాల కేటాయింపు కేవలం 19 టీఎంసీలు మాత్రమే. నికరజలాలు, మిగులుజలాలు అని చూడకుండా అన్ని ప్రాంతాలకు నీరందించే సమగ్ర నీటి విధానం రూపొందించి అందరికీ న్యాయం జరగడానికి అన్ని ప్రాంతాల వారు సహకరించాలి. అలాకాకుండా ఒక వేళ విభజనే జరిగితే రాష్ట్రం వినాశనం కాక తప్పదు.    
 

- యెర్నేని నాగేంద్రనాథ్
 అధ్యక్షులు, రైతాంగ సమాఖ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement