
గ్రహం అనుగ్రహం, ఆదివారం 5, జులై 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం
శ్రీ మన్మథనామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
అధిక ఆషాఢ మాసం
తిథి బ.చవితి రా.1.03 వరకు
నక్షత్రం ధనిష్ఠ రా.12.20 వరకు
వర్జ్యం ఉ.5.34 నుంచి 7.07 వరకు
దుర్ముహూర్తం సా.4.50 నుంచి 5.41 వరకు
అమృతఘడియలు ప.2.35 నుంచి 4.10 వరకు
సూర్యోదయం : 5.33
సూర్యాస్తమయం : 6.35
రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు
భవిష్యం
మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వస్తు లాభాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు.
వృషభం: కొత్తగా రుణాలు చేస్తారు. పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆలోచనలు కలిసిరావు. విద్యార్థులకు శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారులకు ఒత్తిడులు. ఉద్యోగులు పనిభారంతో సతమతమవుతారు.
మిథునం: దూర ప్రయాణాలు. ఇంటా బయటా చికాకులు. అనుకోని ధన వ్యయం. శ్రమకు తగ్గ ఫలితముండదు. బాధ్యతలు పెరుగు తాయి. వ్యాపార విస్తరణలో ఆటంకాలు. ఉద్యోగ మార్పులు.
కర్కాటకం: చిరకాల మిత్రులను కలుసుకుంటారు. పనులు సాఫీగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం నెలకొంటుంది.
సింహం: వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.
కన్య: అనుకోని ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు కలిసిరావు. శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తప్పవు.
తుల: నిర్ణయాలలో తొందరవద్దు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం.
వృశ్చికం: బంధువులను కలుసుకుంటారు. విందు వినోదాలు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
ధనుస్సు: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలలో మార్పులు చోటుచేసుకుంటాయి. దైవచింతన. విద్యార్థుల యత్నాలలో ఆటంకాలు. వ్యాపారులకు కొంత గందరగోళం. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ఒత్తిడులు.
మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు. సేవలకు గుర్తింపు రాగలదు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కుంభం: మిత్రులతో అకారణంగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనులు మధ్యలో విరమిస్తారు. అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.
మీనం: కొత్త పనులు చేపడతారు. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. పలుకు బడి పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
- సింహంభట్ల సుబ్బారావు