అడ్డతోవన విభజన న్యాయమా?
వైఎస్ బతికి ఉంటే ఈ కల్లోలం ఉండేది కాదు. జగన్ మీద, వైఎస్ కుటుంబం మీద కక్షసాధింపులో సోనియా ఓటమి చెందింది. ఉప ఎన్నికల్లో ఈ సత్యం రుజువైంది. సమైక్యత కోసం ప్రజలు సాగిస్తున్న సమరంలో సోనియాకు రెండవ ఓటమి తప్పదు!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటా నికి మూడు ప్రాంతాల్లోనూ ఏకాభిప్రాయం అవసరమని జనత ఘోషిస్తోంది. గర్జిస్తోంది. కమిటీలు, కమిషన్లు దానినే చాటి చెప్పాయి. కాంగ్రెస్ వర్కిం గ్ కమిటీ నిర్ణయించిన నాటికీ నేటికీ పరిస్థితుల్లో పెను మార్పు లు సంభవించాయి. సీమాంధ్ర లోని అన్ని వర్గాల ప్రజలు దాదాపు రెండు నెలల నుంచి సాగిస్తున్న వీరోచిత ఉద్యమం అపూర్వం. సమైక్యతే వారి ఏకైక నినాదం. కాంగ్రెస్ నాయకులు ఇళ్లకు వెళ్లలేని పరి స్థితి నెలకొంది. సమైక్యతను సమర్థించకపోతే వారికి రాజ కీయ మనుగడ లేదు. సీడబ్ల్యూసీ నిర్ణయం శిలాశాసనం కాదు, కారాదు. విభజన నిర్ణయం సీమాంధ్రలో అమలు జరగదు. స్వాతంత్య్ర పోరాట కాలం నాడు కూడా ఇంతటి మహత్తర ఉద్యమం చూడలేదు. జనఘోషను పెడచెవిన పెడితే రాగల పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
వారి సమస్యలు వేరు...
సమస్యలోని సంక్లిష్టతను అర్థం చేసుకోకుండా సీడబ్ల్యూసీ రాజకీయ లబ్ధి కోసం తొందరపాటును ప్రదర్శించింది. ఏకపక్షంగా వ్యవహరించింది. నాడు ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఏర్పడ్డాయంటే మధ్యప్రదేశ్, బీహార్, యూపీ శాసనసభలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. వీటికీ తెలం గాణకూ పోలికే లేదు. వీటికి హైదరాబాద్ లాంటి క్లిష్టమైన సమస్య లేదు. కృష్ణా, గోదావరి లాంటి నదీ జలాల సమ స్యలు లేవు. తెలుగువారంతా ఒకటి కావాలన్న చిరకాల కాంక్ష, దాని కోసం సాగిన సుదీర్ఘ చరిత్ర వంటివి వాటికి లేవు. ఇవేమీ లెక్క చేయకుండా పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టమనడం దుందుడుకు ఆలోచనే.
రాజ్యాంగంలోని 3వ అధికరణం ప్రకారం కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అవకాశం ఉంది. పాత రాష్ట్రం నుంచి ఒక భాగం విడిపోవాలంటే ఆ రాష్ట్ర శాసనసభ అభిప్రా యం తీసుకోవాలని ఆ అధికరణమే చెబుతోంది. ఇది ఆషామాషీగా అన్నమాట కాదు. దానికి విలువ లేకపోతే రాయటమెందుకు? ఏకాభిప్రాయం కావాలన్న సూత్రానికి ప్రాతిపదిక ఆయా రాష్ట్రాలలోని ఏ ప్రాంతానికీ నష్టం వాటిల్లకూడదన్న భావం అందులో కీలకమైనది. కాంగ్రెస్ అధిష్టానం మొదటి నుంచి ఏకాభిప్రాయ సూత్రాన్ని నొక్కి చెబుతూ వచ్చింది. కానీ, ఇప్పుడు సీడబ్ల్యూసీ తప్పటడు గులు వేయడానికి కారణం 2014 ఎన్నికలే. వాటిని దృష్టి లో పెట్టుకొని తెలంగాణలో ఎక్కువ సీట్లు సంపాదించుకో వచ్చనే రాజకీయ వ్యూహంతోనే వ్యవహరించింది. ఈ తొందరపాటే కొంప ముంచింది. సమైక్యతకు చిచ్చు పెట్టింది. అడ్డగోలుగా రాష్ట్రాన్ని చీల్చే నిర్ణయం చేయిం చింది. మెజారిటీ శాసనసభ్యులు, మెజారిటీ ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారు గనుక ఆ నిర్ణయం నుంచి సీడబ్ల్యూసీ తిరోగమించకతప్పదు. ఇది పార్టీ నిర్ణయమే గనుక వెనక్కి తగ్గడంలో తప్పులేదు. నాడు డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన నుంచి కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేయలేదా? రెండవ ఎస్సార్సీయే పరిష్కారమని ఒక నాడు సీడబ్ల్యూసీ చేసిన నిర్ణయం కాలగర్భంలో కలిసి పోలేదా?
ఫజల్ అలీ సహేతుక ఆలోచన
1953లో జవహర్‌లాల్ నెహ్రూ జస్టిస్ ఫజల్ అలీ అధ్యక్షు డుగా, హెచ్.ఎన్.కుంజ్రూ, కె.ఎం.ఫణిక్కర్ సభ్యులుగా మొదటి ఎస్సార్సీని నియమించి, భాషాప్రయుక్తంగా రాష్ట్రాలను పునర్విభజించాలని ఆదేశించాడు. ఆ కమిషన్ 1955లో సమర్పించిన తుది నివేదికలో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణలకు కలిపి హైదరాబాద్ నగరం రాజధానిగా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పింది. కృష్ణా, గోదా వరి లాంటి గొప్ప నదుల మీద మంచి ప్రాజెక్టులు నిర్మిం చి, నిర్వహించుకోవడానికి ఏకీకృత ప్రభుత్వం అవసర మని భావించింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ఈ 57 ఏళ్లలో సీమాంధ్రులు తమ శక్తియుక్తులను ఉపయోగించి రాజధా నిని అభివృద్ధి చేశారు. ఇది తమ రాజధానిగా మురిసి పోతున్నారు. సీమాంధ్రలోని ప్రతి కుటుంబానికి హైదరా బాద్‌తో సంబంధం ఉంది. అందువల్లనే సీమాంధ్రలోని ఆబాలగోపాలం సమైక్యత కోసం ప్రాణాలొడ్డి నిలబడుతు న్నారు. సీమాంధ్ర ఉద్యోగులు ఎస్మాకు భయపడటం లేదు.
జీతాలు లేకున్నా నిలబడ్డారు. ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా కాంగ్రెస్ అధిష్ఠానం వెనుక డుగు వేయకతప్పదు. నదీ జలాలను గురించి కూడా ఫజల్ అలీ కమిషన్ దూరదృష్టితో చక్కని ఆలోచన చేసిం ది. రాష్ట్రంలోని జలసంపదను చక్కగా ఉపయోగించుకోవా లంటే అది సమష్టి ప్రభుత్వంలోనే సాధ్యమని తేల్చి చెప్పింది. గోదావరి జలాలను వినియోగించుకుని ఆహార భద్రత సాధించాలన్నా, దుర్భిక్ష ప్రాంతాలు ఎడారిగా మారకుండా ఉండాలన్నా కూడా సమైక్య ప్రభుత్వంలోనే సాధ్యం. పోలవరం ప్రాజెక్టు పనులు నిరాఘాటంగా జర గాలంటే, దుమ్ముగూడెం, టెయిల్‌పాండ్ ప్రాజెక్టులు నిరా క్షేపణీయంగా అమలు జరగాలంటే సమైక్య ప్రభుత్వం లోనే సాధ్యం. గోదావరి జలాలు ఏటా 3,000 టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి. వాటిలో 15 శాతం కృష్ణలోకి మళ్లించి, కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ ఆయకట్టుకు గోదా వరి జలాలు మళ్లించినప్పుడే దుర్భిక్ష ప్రాంతంలో కృష్ణా మిగులు జలాలతో నిర్మిస్తున్న 7 ప్రాజెక్టులకు కృష్ణా నికర జలాలు ఇవ్వడం సాధ్యం. ఇది సమైక్యంగా ఉన్నప్పుడే కార్యరూపం దాలుస్తుంది.
శ్రీకృష్ణ కమిషన్ ఓటు సమైక్యతకే
సమస్య సంక్లిష్టతను బట్టే నిష్పాక్షికతకు పేరు గాంచిన జస్టిస్ శ్రీకృష్ణ అధ్యక్షుడిగా ఒక కమిషన్‌ను కేంద్ర ప్రభు త్వం నియమించింది. కొందరు వక్రబుద్ధులు బురదజల్లే ప్రయత్నం చేసినా, అన్ని పక్షాలు కమిషన్‌ను స్వాగతిం చాయి. తెలంగాణతో సహా రాష్ట్రమంతటా కమిషన్ పర్య టించింది. ఫజల్ అలీ కమిషన్ నివేదికను కూడా అధ్య యనం చేసింది. మొదటి ప్రాధాన్యం సమైక్య రాష్ట్రమే మే అని చెప్పింది. తెలంగాణకు చట్టబద్ధమైన ప్యాకేజీ సిఫా ర్సు చేసింది. విభజన అనివార్యమైతే ఏకాభిప్రాయంతోనే చేయవలసిన ఉంటుందని స్పష్టం చేసింది.
ఏకపక్షంగా వ్యవహరిస్తారా?
ఈ సమస్య ఎనిమిదిన్నర కోట్ల ప్రజలకు సంబంధించిన సున్నిత సమస్యగా సీడబ్ల్యూసీ చూడలేదు. దీనిని తమ సొంత వ్యవహారంగా చూసింది. కమిషన్ల సిఫార్సులను పెడచెవిన పెట్టింది. నాడు నెహ్రూ ఆంధ్రప్రదేశ్‌కు ఎం దుకు అంగీకరించిందీ, ఇందిరాగాంధీ వేర్పాటు ఉద్య మాలను ఎలా అణచివేసిందీ, తన పార్టీ వారిని కూడా లెక్కచేయక, పార్టీకంటే దేశం, ప్రజలు గొప్పవారని ఎలా భావించిందీ నేటి కాంగ్రెస్ నాయకత్వం విస్మరించింది. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ విలీనమైనప్పుడు కాంగ్రెస్‌లోని అభివృద్ధి నిరోధకశక్తులు ఎలా ప్రతిఘటించిందీ, బూర్గుల రామకృష్ణారావు ఎలా ముఖ్యమంత్రి పదవి త్యాగం చేసిం దీ, తెలంగాణ పోరాట యోధులు రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవిలు సమైక్య తను ఎలా సమర్థించిందీ నేటి కాంగ్రెస్ నాయకత్వానికి స్పృహలో లేదు. తనకు సలాంచేసి గులాములుగా మారిన వారందరికీ సోనియా పదవులు ఇచ్చింది. సీడబ్ల్యూసీలో ఆమె మాటకు ఎదురులేదు. కాంగ్రెస్‌లో వ్యక్తి పూజ రాజ్యమేలుతోంది. పార్టీ నుంచి ఫిరాయింపులు జరగకుం డా భ్రమల్లో పెట్టి చాలాకాలం సోనియా వారినందరినీ అట్టిపెట్టింది. తుదకు ఓటు, సీటు రాజకీయం సీడబ్ల్యూసీ లో నెగ్గింది.
వైఎస్ గనుక ఉండి ఉంటే...
సీడబ్ల్యూసీ జూలై 30న విభజన నిర్ణయం చేసినప్పటి నుం చి ఇంతవరకు సీమాంధ్ర అంతటా సమైక్యతకు జైకొ డుతూ ఊరూ, వాడా ఏకం చేసిన తీరు నభూతో నభవి ష్యతి. సోనియాకు విధేయులుగా ఉన్న సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులూ, ఎంపీలు, ఎమ్మె ల్యేలు ఆ మైకం నుంచి బయటపడి, ఆమెని కలిసి యథా స్థితిని కొనసాగించా లని, విభజన ప్రక్రియ ముందుకు సాగరాదని తెగేసి చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. వారి మాట చెల్లుబడి కాకపోతే పదవులకు రాజీనామా ఇస్తా మని ప్రకటించారు. ఆచరణలో వీరి తెగువ ఏపాటిదో తేల వలసి ఉన్నది. వైఎస్ బతికి ఉంటే ఈ కల్లోలం ఉండేది కాదు. జగన్ మీద, వైఎస్ కుటుంబం మీద కక్షసాధింపులో సోనియా ఓటమి చెందింది. ఉప ఎన్నికల్లో ఈ సత్యం రుజువైంది. సమైక్యత కోసం ప్రజలు సాగిస్తున్న సమ రంలో సోనియాకు రెండవ ఓటమి తప్పదు!
-ఎన్.శివరామిరెడ్డి,
మాజీ శాసన సభ్యులు