సాక్ష్యముంటే ‘బాస్’ కూడా నిందితుడే | Evidence that the 'boss' the offender | Sakshi
Sakshi News home page

సాక్ష్యముంటే ‘బాస్’ కూడా నిందితుడే

Published Mon, Jun 1 2015 11:53 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

సాక్ష్యముంటే  ‘బాస్’ కూడా నిందితుడే - Sakshi

సాక్ష్యముంటే ‘బాస్’ కూడా నిందితుడే

అభిప్రాయం
 
కేసీఆర్‌కూ, చంద్రబాబుకూ మధ్య పోటీ కనుక ‘గేమ్’ అని రేవంత్‌రెడ్డి అనడంవల్ల చంద్రబాబే లంచాలు పంపించాడనే ఆలోచన ఊహ స్థాయి దాటి సమాచారం విలువ తెచ్చుకుని సాక్ష్యంగా బలపడితే అతనూ నిందితుడయ్యే అవకాశం ఉంది.
 
ఎంఎల్‌సీ ఎన్నికల నేప థ్యంలో యాభై లక్షల రూపా యల నోట్లు ఇస్తూ తెలుగు దేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా దొరికి, లం చం ఇచ్చిన నేరానికి అరెస్ట య్యారు. ఈ ఘటనను రహస్య కెమెరాల ద్వారా విభిన్న కోణాల నుంచి చిత్రీక రించిన దృశ్యాలూ, దొరికిన డబ్బు మూట, పంచిన సహాయకుడు, వెంట వచ్చిన వ్యక్తి గట్టి సాక్ష్యాలే కనుక పోలీసు అధికారులు ఆయన్ను అరెస్టు చేసే నిర్ణయం తీసుకున్నారు. నేరగాడని అనుమానించడానికి తగిన సాక్ష్యాలు ఉండడం వల్లనే రేవంత్‌రెడ్డిని 14 రోజుల పాటు రిమాండ్ చే శారు.

 ఏదైనా రుజువైతేనే...
 నేరం జరిగిందని మామూలు వ్యక్తులు, పోలీసు అభి యోగపత్రాలు, మీడియా భావిస్తే సరిపోదు. ఓట్లు కొనుగోలు చేస్తున్నారనీ, అమ్ముకుంటున్నారనీ అంద రూ అనుమానిస్తున్నారు. కాని తగిన సాక్ష్యం ఉంటేనే కేసు నమోదవుతుంది. ప్రాధమిక సాక్ష్యాలుంటేనే అరెస్ట్ సాధ్యం. రుజువైతేనే జైలు. నేరగాడని రుజువైన తరు వాత కూడా బెయిల్ సాధ్యమే. అప్పీలులో కేసే కొట్టి వేస్తే ఏమీ ఉండదు.  
  లంచం ఇవ్వడం, ఇవ్వజూపడం కూడా ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం కింద నేరం. అంగీకరించడం, తీసుకోవడం, అడగడం కూడా నేరమే. ఈ నేరానికి సహకరించిన వారు, ఆర్థిక సాయం చేసినవారు, ఇత రత్రా సహకారం అందించిన వారు అంతా నేరగాళ్లే అవుతారని భారతీయ శిక్షాస్మృతి, నేరశాస్త్ర సూత్రాలు వివరిస్తున్నాయి. కొందరు వ్యక్తులు ఉమ్మడి ఉద్దేశంతో నేరానికి పాల్పడితే అందులో భాగస్థులంతా సమాన బాధ్యులై శిక్ష అనుభవిస్తారు.  కాని వారికి ఉమ్మడి నేర ఉద్దేశం ఉందని రుజువు చేయాలి. ఐపీసీ సెక్షన్ 34 ఈ సూత్రాన్ని వివరిస్తున్నది.
 
కలసి ఆలోచించినవారు నేరగాళ్లే...
 మరొక కీలకమైన నేర న్యాయసూత్రం సెక్షన్ 120 బి. క్రిమినల్ కుట్ర చేసిన వారు, అంటే నేరం చేయడానికి కలసి ఆలోచించి ఆచరించిన వారంతా నేరగాళ్లే. కానీ ఇక్కడ కూడా కుట్ర రుజువు కావాలి. కాన్స్‌పరసీ అంటే కలసి శ్వాసించడం. అంత దగ్గరగా కలసి నేరానికి ప్లాన్, ప్లాట్ రచించిన వారు, అందుకు సంబంధించిన సాక్ష్యాలుంటేనే  నేరగాళ్లవుతారు. ఇంతకీ ఉమ్మడి ఉద్దే శాలు, కుట్రలు రుజువవుతాయా?
 
కీలక సాక్ష్యం...
 ఓట్లు అమ్ముకున్నా నేరమే కనుక, వెంటనే ఓటర్లం దరినీ జైలుకు పంపడం న్యాయం కాదు, సాధ్యం కాదు. ఓట్లు అమ్ముకున్న నేరం రుజుైవైతే ైజైళ్లు సరిపోక పోయినా, సరిపోయినా వారు ఎన్ని లక్షల మంైదైనా సరే జైలుకు పంపడమే సమన్యాయం. కాని దొరికితేనే దొంగలు. రేవంత్‌రెడ్డి కేసులో వీడియో చిత్రాలతో పాటు, కీలకమైన సాక్ష్యం- నియమిత ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌దే అవుతుంది. వీడియోలు, డ బ్బుమూటలు, నోట్ల లెక్కల వివరాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, వచ్చిన సమ యం, సంచి పైకి మోసిన సమయం, నోట్లు తీసి బల్ల మీద పెట్టిన సమయం, స్టీఫెన్‌సన్ చెప్పిన ప్రతి మాటకు సమర్థన అయితేనే, ఆ మాటలను బలోపేతం చేసే మరికొన్ని సాక్ష్యాలు జత కూడితేనే నేరం రుజువ వుతుంది.

ప్రస్తుతం మనముందు, కోర్టుల ముందు, మీడియా ముందు సమాచారమే ఉంది. అవి సాక్ష్యా లవుతాయో లేవో తెలియదు. మీడియాలో వచ్చిన వీడియో ఫుటేజ్ సమాచారం, ఏసీబీ తీసిన వీడియో చిత్రాలు, అసైలైనవనీ, వాటిని ఎవరూ మార్చలేదని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో తేలితేనే సాక్ష్యం అవుతుంది. ఇప్పుడు ఇంకా ఆ సాక్ష్యాన్ని ప్రవేశపెట్టలేదు. ఆ సాక్ష్యం రేవంత్‌రెడ్డి నేరాన్ని రుజువుచేసే అవకాశం ఉంది కనుక అతను నిందితుడై అరెస్టయినాడు. ఆయన కారు నడి పిన వాడు, డబ్బు సంచి పట్టుకొచ్చినవాడు, కట్టలు లెక్కపెట్టి బయట పెట్టినవాడు నేరంలో సహకరించి నట్టు సాక్ష్యం ఉండడం వల్ల వారు యజమాని (రేవంత్‌రెడ్డి)తో కలసి నేరగాళ్లుగానే ఉండిపోతారు.

‘బాస్’ మాటేమిటి?
రేవంత్‌రెడ్డి కేసులో తనకు ‘బాస్ చెప్పాడ’ని అన్నట్టు రికార్డ్ అయింది. బాస్ ఎవరో అందరికీ తెలుసు కనుక, ఆ బాస్‌కూ శిక్ష పడాలని ఆశించడం ఆకాంక్షే అవుతుంది కాని సాక్ష్యం కాదు, సాక్ష్యం లేకుంటే శిక్ష సాధ్యం కాదు. కేసీఆర్‌కూ, చంద్రబాబుకూ మధ్య పోటీ ఉంది కనుక ‘గేమ్’ అని రేవంత్‌రెడ్డి అనడం వల్ల చంద్రబాబే లం చాలు పంపించాడనే ఆలోచన ఊహ స్థాయి దాటి సమాచారం విలువ తెచ్చుకుని సాక్ష్యంగా బలపడితే అతను కూడా నిందితుడయ్యే అవకాశం ఉంది. అది పరిశోధనలు, సాక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది. తెలంగాణ , ఆంధ్ర పోలీసులు కాకుండా నిష్పాక్షికమైన వారు, సీబీఐ లేదా ఇతర పోలీసు దర్యాప్తు బృందాలు  దర్యాప్తు చేయాలని కూడా కోరవచ్చు.
 
పోలీసులకు సవాలే!

 రాజకీయాల మాటెలా ఉన్నా పోలీసులకు మాత్రం ఇటువంటి కేసులు సవాళ్ల్లే. స్టీఫెన్‌సన్ అయిదు కోట్ల రూపాయలు రహస్యంగా అందుకుని ఉంటే పోలీ సులసమస్య ఇంకా జటిలంగా మారి ఉండేది. ఆయన పోలీసులకు చెప్పడం వల్ల, ఏసీబీ కెమెరాలతో సమర్థ వంతంగా వ్యవహరించడం వల్ల ఈ సాక్ష్యాల సేకరణ జరిగింది. విచిత్రమేమంటే అబద్ధాలను అబద్ధాలని రుజువుచేసే అవకాశాలు ఈ దేశంలో కనిపించడం లేదు. ఇంతగా కెమెరాల్లో చిక్కిన తరువాత కూడా డబ్బు నేనివ్వలేదు, అంతడబ్బు నాకెక్కడిది, అయినా నేనెందుకు ఇస్తాను అనే అబద్ధాలను, ఇంకా పోలీ సులను లేదా ఇంకెవరినో బట్టలిప్పించి కొడతాను అనే మాటలకు ఏ పర్యవసానాలూ లేకపోవడం మరొక విచిత్రం. దర్యాప్తులు సమర్థవంతంగా ైనైపుణ్యంతో నిర్వహించి, బలమైన సాక్ష్యాలు దొరికి, విచారణ సకాలంలో జరిగితేనే కుట్రదారులంతా దొరుకుతారు, జైలుకు వెళతారు. అవినీతి కేసుల దర్యాప్తు, విచారణ, ప్రాసిక్యూషన్‌లో అవినీతి లేకుండా ఉంటేనే అవినీతి అంతమవుతుంది.
 professorsridhar@gmail.com
 
http://img.sakshi.net/images/cms/2015-06/71433183209_Unknown.jpg 
మాడభూషి శ్రీధర్

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement