
గ్రహం అనుగ్రహం (27.08.2015)
గ్రహం అనుగ్రహం (27.08.2015)
గ్రహం అనుగ్రహం (27.08.2015)
శ్రీ మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి శు.ద్వాదశి ఉ.6.24 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం ఉత్తరాషాఢ రా.6.57 వరకు
వర్జ్యం రా.10.50 నుంచి 12.22 వరకు
దుర్ముహూర్తం ఉ.9.56 నుంచి 10.46 వరకు
తదుపరి ప.2.54 నుంచి 3.44 వరకు
అమృతఘడియలు ప.12.45 నుంచి 2.19 వరకు
సూర్యోదయం: 5.48 సూర్యాస్తమయం: 6.15
రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు.
భవిష్యం
మేషం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వస్తు లాభాలు. వివాదాలు తీరతాయి. సోదరుల నుంచి సహాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది.
వృషభం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇంటా బయటా చికాకులు. అనారోగ్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.
మిథునం: దూర ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యం
కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభవార్తలు అందుతాయి. ఆర్థిక ప్రగతి. రుణ విముక్తి కలగవచ్చు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
సింహం: పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ఆహ్వానాలు రాగలవు. దైవ దర్శనాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి.
కన్య: ఆర్థిక ఇబ్బందులు. రుణ యత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం పడవచ్చు.
తుల: దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇంటా బయటా చికాకులు. దైవ దర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు చికాకులు.
వృశ్చికం: కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ధనలాభం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
ధనుస్సు: కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. శ్రమ తప్ప ఫలితం ఉండదు. వ్యాపార, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.
మకరం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజన కంగా ఉంటాయి.
కుంభం: రుణాలు చేస్తారు. బంధు విరోధాలు. అనారోగ్యం. పనుల్లో ఆటంకాలు కలగవచ్చు. వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు చోటుచేసుకుంటాయి.
మీనం: నూతన పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. స్థిరాస్తివృద్ధి. వాహనయోగం కలుగుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
- సింహంభట్ల సుబ్బారావు