
గ్రహం అనుగ్రహం, డిసెంబర్ 19, 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి శు.అష్టమి ఉ.6.33 వరకు, తదుపరి నవమి తె.4.15 వరకు, (తెల్లవారితే ఆదివారం), నక్షత్రం ఉత్తరాభాద్ర రా.8.28 వరకు, వర్జ్యం ఉ.7.06 నుంచి 8.35 వరకు, దుర్ముహూర్తం ఉ.6.28-7.55 వరకు, అమృతఘడియలు సా.4.03 నుంచి 5.55 వరకు
భవిష్యం
మేషం: పనులు చకాచకా సాగుతాయి. ఆర్థిక ప్రగతి కలుగుతుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. ధన లబ్ధి.
వృషభం: వ్యయప్రయాసలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు.
మిథునం: వ్యవహారాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. కీలక సమాచారం అందుతుంది. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
కర్కాటకం: ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. గృహ యోగం కలిగే అవకాశం ఉంది. ఆహ్వానాలు అందుతాయి.
సింహం: రుణ యత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు వచ్చే ప్రమాదం ఉంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్య భంగం.
కన్య: శ్రమాధిక్యం. పనుల్లో స్వల్ప ఆటంకాలు కలుగుతాయి. రుణ యత్నాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ధన వ్యయం.
తుల: నూతన విద్య, ఉద్యోగ యోగాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పెట్టుబడులు అందుతాయి. దైవ చింతన కలగవచ్చు.
వృశ్చికం: వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. శుభ కార్యాలకు డబ్బు ఖర్చుచేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విందువినోదాలు.
ధనుస్సు: పనులు మందగిస్తాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఒప్పందాలు వాయిదా పడవచ్చు. శ్రమ పెరుగుతుంది. మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఇంటా బయటా చికాకులుండొచ్చు.
మకరం: ప్రయాణాలు వాయిదా పడవచ్చు. శ్రమాధిక్యం. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య భంగం. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.
కుంభం: కొత్త పరిచయాలు పెరుగుతాయి. పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆప్తులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. ఆస్తిలాభం కలుగుతుంది.
మీనం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు వచ్చే అవకాశం ఉంది. అనుకోని ధన వ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. దూర ప్రయాణాలు ఉంటాయి.
- సింహంభట్ల సుబ్బారావు