
గ్రహం అనుగ్రహం, మార్చి 15, 2016
శ్రీమన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం,
శిశిర ఋతువు ఫాల్గుణమాసం
తిథి శు.సప్తమి సా.4.33 వరకు, తదుపరి అష్టమి నక్షత్రం
రోహిణి ప.1.33 వరకు, తదుపరి మృగశిర
వర్జ్యం ఉ.5.57 నుంచి 7.28 వరకు, తిరిగి రా.6.54 నుంచి 8.26వరకు
దుర్ముహూర్తం ఉ.8.33 నుంచి 9.24 వరకు
తదుపరి రా.10.55 నుంచి 11.45 వరకు
అమృతఘడియలు ఉ.10.25 నుంచి 11.58 వరకు
భవిష్యం
మేషం: పనుల్లో ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. వృథా ఖర్చులు. దూర ప్రయాణాలు చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
వృషభం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తిలాభం. ఉద్యోగ యత్నాలు కలసివస్తాయి. విందు వినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
మిథునం: పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయా ణాలు. రుణాలు చేస్తారు. అనారో గ్యం. కుటుంబస భ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కర్కాటకం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
సింహం: కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా సాగుతాయి. మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు హోదాలు.
కన్య: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
తుల: కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృశ్చికం: ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. భూవివాదాల పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
ధనుస్సు: రుణబాధలు తొలగుతాయి. ఆస్తిలాభం. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
మకరం: శ్రమ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
కుంభం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరి స్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
మీనం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
- సింహంభట్ల సుబ్బారావు