మేధావులక్కోపం వచ్చింది | Indian scholars return awards to demand free speech | Sakshi
Sakshi News home page

మేధావులక్కోపం వచ్చింది

Published Thu, Nov 19 2015 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

మేధావులక్కోపం వచ్చింది

మేధావులక్కోపం వచ్చింది

జీవన కాలమ్

ఇది చాలా సబబు. సమాజ చింతనలో జల్లెడ పట్టిన చాలా ఆలోచనలకు ఆయా కళల ద్వారా మన్నికయిన చట్రాన్ని ఏర్పరచగ లిగిన వ్యక్తులు వీరు. ముఖ్యంగా ఆనాటి ప్రభుత్వం గుర్తింపు, బహుమతులూ పొందినవారు. కనుక వీరి ఆలోచనలలాగే, వీరి ఆవేశాలనూ సమాజం గుర్తించవ లసిన అవసరం ఉంది. న్యాయమే.అయితే సమాజంలో గుర్తింపు పొందిన మేధావులు 5 శాతం అనుకొంటే, ప్రభుత్వం గుర్తింపు పొందని వారూ ఇంకా ఎక్కువ మంది ఉండి ఉంటారు. బహుమతులో, గుర్తింపో రానంత మాత్రాన వారి కృషినీ, సమాజ గతి పట్ల వారి స్పందనల్నీ తక్కువ చెయ్యలేం. కాగా, బహుమతులు పుచ్చుకున్న వారు- పురుషులందు పుణ్య పురుషులు.


గత 15 నెలలుగా పదవిలో ఉన్న కొత్త ప్రభుత్వం ధోరణీ, మతానికి సంబంధించిన - వారి దూకుడూ నచ్చని ఈ మేధావులు చరిత్రలో మొదటిసారి నోరు విప్పారు. కనీ వినీ ఎరగని రీతిలో తమ తమ పురస్కా రాలను వాపసు ఇస్తూ - ప్రస్తుత పాలక వ్యవస్థ ధోరణి మీద తమ అసహనాన్ని ప్రకటించారు. ఇది మంచి పరిణామం. మన పెద్దలు- మనం చెప్పినా వినిపిం చని, వినిపించలేని మన ఆలోచనలకు ప్రాతినిధ్యం వహించడం- మనకు ధైర్యాన్నిస్తుంది.  అయితే ఇది అందరి అభిప్రాయ మా? అదే అయితే మరి ఈ పాలక వ్యవస్థ పదవిలోకి రావడమే మెజారిటీ మద్దతుతో కదా? అప్పుడు ఈ మేధావుల ఆలోచన మైనారిటీ కదా? వ్యవస్థ మీద ఎక్కువ మంది నమ్మకాన్ని ప్రక టించారు. అందులో ఈ మేధావులు లేక పోవచ్చు. సబబే.

మరికొన్ని సంవత్సరాలుగా గుర్తిం పుని ఆహ్వానిస్తూ, బహుమతులు గ్రహిస్తున్న వీరు లోగడ జరిగిన- ఇంతకంటే భయంకరమైన దురాగతాలకు ఎం దుకు స్పందించలేదు? కనీసం- ఇంతగా ఎందుకు స్పందిం చలేదు? కనీసం ఇలా ఎందుకు స్పందించలేదు? ఒకరిద్దరు సమాధానాలు చెప్పారు. 'అప్పుడూ మేం స్పందించాం బాబూ. మీరు వినిపించుకోలేదు' - అన్నారు కొందరు. 'అప్పట్లో మాధ్యమాల ముమ్మరం ఇంతగా లేదు కనుక, అప్పటి వారి నిరసనలు ఎక్కువగా వినిపించలేదు'- అన్నారు మహేష్ భట్ సోదరుడు ముఖేష్ భట్. 

'మా అసహనాన్ని ఎలా, ఎప్పుడు ప్రకటించాలో మా ఇష్టం. మాకా స్వేచ్ఛ ఉంది' అన్నారొక మేధావి.అయితే ఇంతకంటే భయంకరమైన పరిస్థితులలో నీర సంగా స్పందించి, అసలు నోరిప్పకుండా, ఇప్పుడు వీధిన పడటంవల్ల ఒకటి అర్థమౌతోందని ఒక చానల్ వాపోయిం ది. 'ఆ ఘటన మీద కాక ఆ వ్యవస్థ మీదే నమ్మకం లేదని'- అంది. 'అవును. మోదీకి మేం వ్యతిరేకం' అని ఒకరిద్దరు మేధావులు బల్లగుద్దేశారు. సజావయిన కారణాలకి లోగడ స్పందించని, స్పందిం చినా మనకు తెలిసేటట్టు స్పందించని, మాధ్యమాల ఫోకస్ లేనంతగా స్పందించిన, మోదీ అంటే స్పష్టంగా ఇష్టం లేని, తమ ఇష్టం వచ్చినట్టు స్పందించిన మేధావుల స్పందన ఆ కారణాలకే బలహీనం అవుతోంది.
 
మరొక కళాకారుడు, రచయిత, దర్శకుడు కమల్ హాసన్ మరొక మాట అన్నారు: బహుమతులు పుచ్చుకున్న వారు తమ తమ నిరసనలనో అసహనాన్నో ప్రకటించడం సబబే. కాని ఒక గుర్తింపు - వారి కృషిని ప్రశంసిస్తూ - ప్రజాభిప్రాయాన్ని సమర్థిస్తూ ఇచ్చిన కితాబుని నిరసించ డం తప్పు. అది ప్రజాభిమానాన్ని అవమానించినట్టు. నా ప్రజల మీద నాకు కోపం వస్తే - నా జీవితంలో సినీమాల ద్వారా సంపాదించుకున్నదంతా వాపసు ఇస్తున్నానా?'


'మేమెప్పుడూ మా అసహనాన్ని ప్రకటిస్తూనే ఉన్నాం. ప్రతీ ప్రభుత్వం అసహనంతోనే ఉంది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, ముస్లింలీగ్ లాగే కాంగ్రెసూ అసహనాన్ని ప్రకటించింది. నా 'విశ్వరూపం'ను ఎవరు వ్యతిరేకించారు? 'హేరామ్'ని ఎవరు విమర్శించారు?'  ఈ దేశంలో మేధావులు రాజకీయ నాయకుల్లాగ వీధిన పడటం కాకుండా ఒక అపూర్వమైన 'నియతి'తో సమాజాన్ని ముందుకు తీసుకుపోయే సూచనలు చేయాలే కానీ ‘‘చేతులు కడుక్కోకూడదు’’ అని ఒక పాఠకుడు ఒక పత్రి కలో ఉత్తరం రాశాడు. ఇలాంటి మాటని కమల్ హాసన్ కూడా అన్నాడు.
 
మరొక సినీనటుడు అనుపమ్ ఖేర్ ఈ అవార్డు- వాప్సీ వ్యతిరేక రాయబా రాన్ని రాష్ట్రపతి భవన్‌కు నిర్వహిం చారు. ఆయన అన్నారు: 'సాహిత్య అకాడమీ అవార్డులు, జాతీయ ఫిలిం అవార్డులు, పద్మ పురస్కారాలను వాపసు ఇవ్వడం - భారతదేశం పరప తిని భ్రష్టుపట్టించడానికి ఉద్దేశిం చినవి'  దేశంలోని ఒక వర్గం మేధావులు పాలక వ్యవస్థ మీద వారి కక్ష తీర్చుకు నేందుకు కత్తి కట్టారని 36 మంది మేధా వులు సర్కారుకి మద్దతు తెలుపుతూ ఒక ప్రకటన చేశారు.
 
ఇందులో సరదా అయిన పిట్టకథ ఒకటుంది. చండీగఢ్‌లో ‘‘నాన్సెన్స్ క్లబ్’’ కళాకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయ్యా, మేం కళాకారులం. 30 సంవత్సరాలుగా కృషి చేస్తున్నాం. మాకు తక్షణమే ప్రభుత్వం ఏవో కొన్ని అవార్డులు ఇవ్వాలి. అప్పుడు మాకూ అవార్డులు తిప్పి ఇచ్చే అవకాశం ఉంటుంది. అందరూ అన్నీ తిరిగి ఇస్తున్నారు. మాకూ ఇవ్వాలని ఉంది. కాని మా దగ్గర ఏమీలేవు’’ ఇదీ వీరి డిమాండ్! చండీగఢ్ 17వ సెక్టార్‌లో వీరు ధర్నా చేశారు.

ఈ రాద్ధాంతం అంతటిలో చాలా సుఖంగా ఉన్న వాడిని నేనేననుకుంటాను. ఎందుకంటే - నేనే అవార్డునీ వాపసు ఇవ్వనక్కరలేదు. నాకేమీ రాలేదు కనుక. ఒక స్పందన వెనుక- ఆ వ్యవస్థ మీద ప్రాథమికమ యిన నిరాదరణో, నిరసనో, ఏహ్యతో ఉన్నప్పుడు - ఆ అభిప్రాయం పలచబడుతుంది. అతనంటే నాకు ఇష్టం లేదు. అతను చేసే ఏ పనీ నాకు నచ్చదు. ఈ తీర్పుకి బలం లేదు. న్యాయపీఠం మీద కూర్చున్న న్యాయమూర్తి ముద్దా యితో ఏ చిన్న ప్రమేయం ఉన్నా అతని తీర్పు చెల్లదు. అతను తప్పుకుంటాడు.Your dislike pre-judges your opinion.  ఏనాడయినా మేధావి అభిప్రాయం బెసుగుతుంది. అతని పెట్టుబడి - ఆలోచన కనుక. అతి సామాన్య వ్యక్తి అభిప్రాయం కుండబద్దలు కొడుతుంది - అతని పెట్టుబడి - విశ్వాసం కనుక. విశ్వాసం విప్లవానికి పుట్టిల్లు.
 
 http://img.sakshi.net/images/cms/2015-03/41426100977_295x200.jpg

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement