
ఇందిరమ్మ ఇళ్లకు మోక్షమేదీ?
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మార్చి నెలలో ఎన్నికల కోడ్ కారణంతో బిల్లులను నిలిపివేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావటంతో బిల్లులు మంజూరవుతా యని అందరూ భావించారు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం గృహ నిర్మాణశాఖలో లోటుపాట్లు సవరించిన తర్వాతనే మంజూరు చేయాలని నిర్ణయించింది. అప్పు చేసి మరీ ఇందిరమ్మ ఇళ్లను ప్రజలు పూర్తి చేసుకున్నారు. చేసిన పనులకు అధికారులు రికా ర్డుల పూర్వకంగా నమోదు చేసినప్పటికీ బిల్లులు మాత్రం మం జూరు కాలేదు. చేసిన అప్పుకు వడ్డీ పెరుగుతోంది. గత అక్టోబర్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని పథకాలను పునఃప్రారంభిం చారు.
తమకు కూడా మోక్షం కలుగుతుందని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. బిల్లులు మంజూరు కాక పోతే చేసిన అప్పులను వడ్డీతో సహా తీర్చడానికి ఇందిరమ్మ ఇళ్లనే అమ్ముకునే దుస్థితి దాపురించే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణ పరిస్థితి ఎలా ఉంది? అర్హులే ఇళ్లు నిర్మించుకున్నారా అన్న విషయంపై పరిశీలన చేయించండి. కానీ, దివంగత సీఎం వైఎస్‌లా త్వరితగతిన బిల్లులు చెల్లించడా నికి కేసీఆర్ చొరవ చూపాలి.
మనిమద్దె రామకృష్ణ, మేళ్ల దుప్పలపల్లి, నల్లగొండ