తోట రాజేష్
రాష్ట్రంలో నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కో సం తీవ్ర నిరాశతో ఎదు రుచూస్తున్నారు. నిరుద్యో గుల కోసం ఎన్నికల ముందు కె.సి.ఆర్. హామీ ల వర్షం కురిపించాడు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధి కారంలోకి రాగానే కొలు వుల జాతర అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజ లకు హామీల వరాల జల్లులు కురిపించారు. కేసీఆర్ మాటలు నమ్మి నిరుద్యోగులు టీఆర్‌ఎస్ ప్రభుత్వా నికి అధికారం కట్టబెట్టారు. నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969 లోను, నిన్న పోరాడి సాధించుకున్న (2009) తెలంగాణ ఉద్యమం వరకు పోరాడింది తెలంగాణ విద్యార్థి యువకులే. చివరికి వారు ప్రాణాలు కూడా అర్పించారు. ఈ యువత తెలం గాణ ఉద్యమానికి ప్రాణవాయువు అయింది.
తెలంగాణ ఉద్యమానికి భౌతిక పునాది నిరు ద్యోగ సమస్య. మా తెలంగాణ మాకు వస్తే, మా ఉద్యోగాలు మాకు వస్తాయని యువత భావించిం ది. ఉద్యమ సమయంలో రాజకీయ పక్షాలు యువ తకు పూర్తి భరోసా ఇచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలోని వివక్షత, అన్యాయం, ఆకలి, ఆర్తనాదాలు ఇక ఉం డవు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడ తాయని వారు అనడంతో తెలంగాణ విద్యార్థులకు నమ్మకం ఏర్పడింది. కేసీఆర్ ఒక అడుగు ముందుకు వేసి కాంట్రాక్ట్ ఉద్యోగులు రేపటి తెలంగాణలో ఉం డరని మాట ఇచ్చాడు. దీనితో ఏళ్ల తరబడి గొడ్డు చాకిరి చేస్తున్న వయసు మీద పడినవారు కొత్త కలలు కన్నారు. సింగరేణి, మున్సిపాలిటీ ఇంకా ఇతర రంగాలలో ఉన్న వారు కూడా తమ జీవితా లకు కొత్త వెలుగులు వస్తాయని ఆశించారు.
తెలంగాణ రాష్ట్రమంటే ఉద్యోగాల జాతర అన్న కేసీఆర్ నేటికీ వాటి ఊసెత్తడం లేదు. మరో 2 నెల లైతే ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుంది. కాని ఒక్క నోటిఫికేషన్ రాలేదు. పైగా టీపీటీఎస్‌పీ ఏర్పర్చినా ము ఇక నోటిఫికేషన్లే అన్నారు. తరువాత హరగోపా ల్‌తో కమిటీ వేశామన్నారు. హరగోపాల్ నెల రోజు లలోనే ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించి, త్వరగా ఉద్యోగ ప్రకటన ఇవ్వాలని సూచించారు. తరువాత వివిధ రాష్ట్రాల ఉద్యోగ నియామకాల గురించి టీపీఎస్‌సీ అధ్యయనానికి మరికొన్ని రోజులు వాయిదా వేశారు. కొద్ది రోజుల కిందట గవ ర్నర్ ఆవిష్కరించిన ప్రభుత్వ ఉద్యోగ వెబ్‌సైట్‌ని లక్షా యాభై వేల మంది నిరుద్యోగులు వీక్షించారు.
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో ఆశ తో ఉన్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటి వరకు జరిగిన రెండు అసెంబ్లీ సమావేశాల్లో నిండు సభలో కేసీఆర్ లక్షా ఏడు వేల ఉద్యోగాలు ఉన్నా యని చెప్పారు. కానీ ఆచరణలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం కనీస ప్రయత్నం చేయడం లేదు. ఏప్రిల్ 1వ తేదీ నాటికి పూర్తి స్థాయి అమల్లోకి వచ్చిన విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో ఒక్క ఖాళీ పోస్టు కూడా ఉండకూడదు. ఈ చట్టాన్నీ తెలంగాణ ప్రభు త్వం లెక్కించే స్థితిలో లేదు. కాగా హేతుబద్ధీకరణ పేరుతో ప్రాథమిక పాఠశాలలను మూసివేసే ప్రయ త్నం చేస్తున్నారు. పక్క తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లోటు బడ్జెట్‌తోనే 3 నెలల క్రితమే డీఎస్‌సీ నోటిఫికేషన్ ఇస్తే ధనిక రాష్ట్రమైన తెలంగాణ ప్రభు త్వం డీఎస్‌సీ నోటిఫికేషన్‌తో దోబూచులాడుతోంది.
విద్యారంగంలో అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులు 17,000లకు పైనే ఉన్నాయని ప్రభుత్వమే చెబుతోంది. ఇవి కాక గ్రూప్1, గ్రూప్2 ఇంకా ఇతర ప్రభుత్వరంగాలలో కొన్ని వేలలో ఖాళీలు ఉన్నా యని ఆర్థికశాఖ లెక్క తీసింది. 17,000 ఉపాధ్యాయ పోస్టులకుగాను దాదాపుగా 5 లక్షల మంది ఉపాధ్యా య వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసి ఎదురు చూస్తు న్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాజకీయ నిరుద్యోగుల గురించి ఆలోచించడం మానేసి రాష్ట్రంలో ఉన్న నిరు ద్యోగుల గురించి ఆలోచించాలి. తెలంగాణలో నిరు ద్యోగులకు భరోసా లేకపోతే నిన్న జరిగిన పట్టభ ద్రుల ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు పునరావృతం అవు తుంది. ప్రభుత్వంచే ఉద్యోగ నియామకాల ప్రకటన వచ్చేంత వరకు తెలంగాణ నిరుద్యోగులు పోరాటం చేయక తప్పదు.
వ్యాసకర్త ప్రగతిశీల యువజన సంఘం
మొబైల్: 9440195160