మళ్లీ బుసకొడుతున్న నాగాలు! | nagaland issue raises! | Sakshi
Sakshi News home page

మళ్లీ బుసకొడుతున్న నాగాలు!

Published Fri, Dec 13 2013 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM

మళ్లీ బుసకొడుతున్న నాగాలు!

మళ్లీ బుసకొడుతున్న నాగాలు!

ఈశాన్య రాష్ట్రాలలో అశాంతి కొత్త విషయమేమీ కాదు. అందులోనూ మణిపూర్ - నాగాలాండ్‌లలో ఆందోళనలు, బంద్‌లు, ఆర్థిక దిగ్బంధనాలు, బాంబుపేలుళ్లు, రక్తపుటే రులు అత్యంత సహజమైన విషయాలుగా మారిపో యాయి. ఏ రోజైనా అక్కడ ఏమీ జరగకపోతేనే విచిత్రం. ఆందోళనలకు తోడు ఉగ్రవాద పెను ఉత్పాతం నాగా లాం డ్‌ను అత్యంత సమస్యాత్మకంగా మార్చేసింది. గ్రేటర్ నాగాలాండ్ కోసం దశాబ్దాలుగా నాగాలు జరుపుతున్న పోరాటం వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది.
 
 తాజాగా యునెటైడ్ నాగా కౌన్సిల్ (యూఎన్‌సీ) ఇచ్చిన 48 గంటల సార్వత్రిక సమ్మె పిలుపు ఈ రెండు రాష్ట్రాలలోనూ గుబులు రేపుతున్నది. మణిపూర్‌లో నాగా లు నివాసముంటున్న ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనా వ్యవస్థ ఉండాలన్న డిమాండ్‌తో ఈ సమ్మెకు పిలుపుని చ్చారు. నాగాలు నివాసముండే ప్రాంతాలలో మాత్రమే సమ్మె జరుగుతుందని నాయకులు నమ్మబలుకుతున్నా గత అనుభవాలు గుర్తొస్తుండడంతో రెండు రాష్ట్రాలలోనూ సామాన్య ప్రజలు ఆందోళనపడుతున్నారు. చిన్న అగ్గిరవ్వ కార్చిచ్చును రగిల్చినట్లు ఏ చిన్న ఘటనైనా ఉద్రిక్తతలకు ఆజ్యం పోసే ప్రమాదముంది. ఏ పరిణామం ఎటుదారి తీస్తుందోనన్న భయం వారిది.
 
 

మణిపూర్‌లోని తమెంగ్‌లాంగ్, సేనాపతి జిల్లాల గుండానే రెండు ముఖ్యమైన జాతీయ రహదారులు (ఇం ఫాల్-జిర్బం-సిల్చార్, ఇంఫాల్-దిమాపూర్-గువాహతి) వెళుతుండడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నిత్యావస రాల సరఫరాలకు విఘాతం కలగబోతున్నది. అంటే మణి పూర్‌కు ఈ 48 గంటలపాటు నిత్యావసరాలు బంద్ అయిపోతాయన్నమాట. ఏటా డిసెంబర్ 14న జరిగే ‘ఆరెంజ్ పండుగ’ కూడా ఈ సమ్మె ప్రభంజనంలో కొట్టుకు పోనున్నది. ముఖ్యంగా తమెంగ్‌లాంగ్‌లో ఈ పండుగను అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. పండుగ సందర్భంగా పండ్లు బాగా అమ్ముడవుతాయని ఆశలు పెట్టుకున్న రైతులు ఇపుడు ఉసూరుమంటూ నిట్టూరు స్తున్నారు.
 
 

మణిపూర్‌లో నాగాలు నివాసముంటున్న ప్రాంతా లలో జాతీయ ప్రాజెక్టుల నిర్మాణాలన్నిటిపైనా తక్షణం నిషేధం విధించాలనుకుంటున్నట్లు కూడా యూఎన్‌సీ వర్గాలు చెబుతున్నాయి. యూఎన్‌సీ డిమాండ్లపై గతంలో జరిగిన త్రైపాక్షిక చర్చలు విఫలమయ్యాయి. కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల ప్రతినిధులతో యూఎన్‌సీ ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. నాగాలు నివాసముంటున్న ప్రాంతా లను మణిపూర్ నుంచి విడగొట్టి ప్రత్యేక పాలనా వ్యవ స్థను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ నుంచి యూఎన్‌సీ దిగిరాకపోవడంతో చర్చలు ముందుకు సాగలేదు. ఇపుడు అదే డిమాండ్‌తో యూఎన్‌సీ మరోమారు సమ్మెకు సన్న ద్ధం కావడం ఆందోళన కల్గిస్తోంది.
 
 

మణిపూర్ మాత్రమే కాదు.. అసోం, అరుణాచల్ ప్రదేశ్‌లలోనూ, పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, మయన్మార్‌ల లోనూ నాగాలు నివసిస్తున్న ప్రాంతాలున్నాయి. వాటన్ని టినీ కలిపి గ్రేటర్ నాగాలాండ్ ఏర్పాటు చేయాలన్నది నాగాల ప్రధాన డిమాండ్. నాగాల ఉద్యమానికి నాయ కత్వం వహిస్తున్న నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగా లాండ్ (ఎన్‌ఎస్‌సీఎన్-ఐఎం) సహా అనేక సంస్థలు దీని కోసం పోరాడుతున్నాయి. అస్తిత్వం కోసం సాయుధ పోరాటమే శరణ్యమంటూ యువత ఉగ్రవాద బాట పడుతున్నది. సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం జరిపిన ప్రయత్నాలేవీ ఇప్పటివరకూ ఫలితాలివ్వలేదు. గ్రేటర్ నాగాలాండ్ ఆచరణసాధ్యం కాదని గతంలో జరి గిన అనేక ప్రయత్నాలు రుజువుచేశాయి. అడపాదడపా కాల్పుల విరమణ ఒప్పందాలు మినహా పదేళ్లుగా కేంద్రం లోని యూపీఏ ప్రభుత్వం కూడా సాధించిందేమీ లేదు. దాంతో ఆందోళనకారులు, ఉగ్రవాదులు ఈశాన్య రాష్ట్రా లలో హింస సృష్టిస్తూనే ఉన్నారు. 2010లో మూడు నెలల పాటు సాగిన మణిపూర్ ఆర్ధిక దిగ్బంధం ఆ రాష్ర్ట ప్రజ లను అష్టకష్టాల పాల్జేసింది. అసోం, అరుణాచల్‌ప్రదే శ్‌లకు పొరుగున ఉన్న ఇతర రాష్ట్రాలతో రహదారి మార్గా లున్నాయి.
 
 

కానీ మణిపూర్‌కు మాత్రం అలా ప్రత్యామ్నా యాలు లేవు. ఒకవైపు నాగాలాండ్, మరోవైపు అసోంలో నాగాలు నివసించే ప్రాంతాలు.. మణిపూర్‌ను దిగ్బంధిస్తు న్నాయి. దాంతో మిజోరం మినహా మరో వైపు వెళ్లడానికి దానికి మార్గం లేదు. అందువల్ల నాగాల ఆందోళనలకు మణిపూర్ ఎక్కువగా నష్టపోతున్నది. ఆర్థిక దిగ్బంధన సమయంలో కూరగాయలు, కోడిగుడ్లకు కూడా కటకటలా డాల్సిన పరిస్థితి తలెత్తింది. అన్ని నిత్యావసరాల ధరలు 300 శాతం పెరిగిపోయాయి. లీటర్ పెట్రోలు రు.170, వంటగ్యాస్ సిలెండర్ రు.2,000 పలికాయి. అందుకే ఈశా న్యాన ఎలాంటి ఆందోళన జరిగినా మణిపూర్ చిగురు టాకులా వణికిపోతుంటుంది.ఆందోళనకారులు బంద్ చేసినా, ఉగ్రవాదులు బాంబు పేల్చినా కేంద్రంలోగానీ, రాష్ర్టంలోగానీ ఎలాంటి చలనమూ ఉండదు. ...అందుకే ఈశాన్యం కాదది అంతులేని శూన్యం.
 

-పోతుకూరు శ్రీనివాసరావు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement