potukuru srinivasa rao
-
కాశ్మీర విలయం మానవ తప్పిదమే..
కాశ్మీర్లో అపారమైన ప్రాణనష్టం, అంతులేని ఆస్తినష్టానికి దారితీసిన ఈ విలయానికి కారణం సరస్సుల కబ్జాలేనంటే ఆశ్చర్యం కలుగక మానదు. 9వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న చిన్నచిన్న సరసులనేకం అగుపించకుండాపోయాయి. కాశ్మీర్ అనగానే జివ్వుమనిపించే హిమ పాతాలు, దాల్ సరస్సు అందాలు స్ఫురణకు రావడం సహజం. అందులోనూ శ్రీనగర్ అంటే సుంద రమైన వనాలకు, పూలతోటలకు ప్రసిద్ధి. అయితే అదంతా గతం. ఇపుడు శ్రీనగర్ వరదనీటిలో మునకలేస్తున్నది. నయనమనోహరమైన పూదోట లన్నీ నడుం లోతులో మునిగి ఉన్నాయి. వీధు లను వరద ముంచెత్తింది. వందేళ్లలో కనీవిని ఎరుగని జలవిపత్తు కాశ్మీర్‌ను కకావికలం చేసింది. వందల సంఖ్యలో మరణించగా లక్షల సంఖ్యలో నిర్వాసితుల య్యారు. ఎన్నడూ లేనిది ఈ జల విలయా నికి కారణమేమిటి? ప్రశాంత కాశ్మీరంలో ప్రకృతి ప్రకోపానికి ఎవరు బాధ్యులు? జమ్మూ కాశ్మీర్లో వరదలు ప్రకృతి వైపరీ త్యమేనా... అంటే.. కానేకాదు ఇది మానవ తప్పిద ఫలితమేనంటున్నారు పర్యావరణ వేత్తలు. అపారమైన ప్రాణనష్టం, అంతులేని ఆస్తినష్టానికి దారితీసిన ఈ విలయానికి కార ణం సరస్సుల కబ్జాలేనంటే ఆశ్చర్యం కలుగక మానదు. 9వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న చిన్నచిన్న సరసులనేకం అగుపించకుండా పోయాయి. శ్రీనగర్‌లో ఒకప్పుడు 2400 హెక్టార్లలో విస్తరించి ఉన్న దాల్ సరస్సు ఇపుడు 1200 హెక్టార్లకు పరిమితమైపో యింది. శ్రీనగర్‌కు ఎగువన 20,200 హెక్టా ర్లలో విస్తరించి ఉండే ఉలార్ సరస్సు 2,400 హెక్టార్లకు కుంచించుకుపోయింది. కాశ్మీర్‌లోయలో జీలం నది ఉరవడిని తట్టుకోవడానికి సరస్సుల దాపులనుండే చిత్తడినేలలు ఎంతగానో ఉపకరి స్తాయి. అయితే కాశ్మీర్లో గత 30 ఏళ్లలో 50 శాతం చిత్తడి నేలలు అంతరించిపోయాయి. సరస్సుల సమీపంలో ఉండే విశాలమైన చిత్తడినేలలన్నీ కుంచించుకుపోయాయి. ఉలార్ సరస్సునే తీసుకుంటే.. ఈ సరస్సు సమీపంలోని నేలలను కాశ్మీరీ మహరాజాలు, చివరకు బ్రిటిష్‌వారు సైతం ఎంతో జాగ్రత్తగా పరిరక్షిస్తూ వచ్చారు. ఎందుకంటే ఇవి వరద నీటిని స్పాంజిలాగా పీల్చుకుంటాయి. అయితే అనేక సంవత్సరాలుగా ఇవి ఆక్రమణలకు గురయ్యాయి. వాణిజ్య కార్యకలాపాలకు ఆలవాలంగా మారిపోయాయి. జీలం నది పొడవునా అనేకచోట్ల ఆక్రమణలు జరిగాయి. వెడల్పు తగ్గడంతో నది ఉరవడి పెరిగింది. దీంతో పాటు శ్రీనగర్‌లోని దిగువ ప్రాంతాలు కూడా ఆక్రమణలకు గురయ్యాయి. వరదనీటి విడుదలకు ఉపకరించే చిన్నచిన్న కాల్వలు చాలావరకు పూడిపోయాయి. జీలం వరదల నుంచి శ్రీనగర్‌ను రక్షించేందుకు గాను శతాబ్దం కిందట దోగ్రా పాలకుడు ప్రతాప్ సింగ్ నిర్మించిన జీలంబండ్ కూడా ఆక్రమణలపాలయ్యింది.వాస్తవానికి జీలం పరివాహకప్రాంతాలకు ముఖ్యంగా శ్రీనగర్‌కు వరద ప్రమాదం పొంచి ఉందని అనేకమార్లు వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం ఆ హెచ్చరికలను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించదు. అసలు జమ్ము కాశ్మీర్‌కు వరదల గురించి హెచ్చరించే వ్యవస్థ ఏదీలేదు. జీలం నది శ్రీన గర్‌ను చేరుకోవడానికి ముందు దక్షిణ కాశ్మీర్లో ఆరు రోజుల పాటు ప్రవహిస్తుంది. అనంతనాగ్ సమీపంలో సంగం వద్ద నీటిమట్టం పెరగడం కూడా స్పష్టమైన సూచికలా పనిచేస్తుంది. ఎగువ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురు స్తున్నా, దక్షిణ కాశ్మీర్లో జీలం నది ఉరవడి పెరు గుతున్నా అధికార యంత్రాంగం, ఒమర్ ప్రభు త్వం అప్రమత్తం కాలేదు. వారి మొద్దు నిద్ర శ్రీన గర్‌కు ప్రాణాంతకంగా పరిణమించింది. జమ్ము కాశ్మీర్‌కు తీవ్ర వరద ముప్పు పొంచి ఉన్నదని 2010లో వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చ రించారు. తగిన మౌలిక సదుపాయాల కల్పనకు, వరద నివారణ చర్యలకుగాను 22,000 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టుకు అప్పటి రాష్ర్ట ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే ఆ తర్వా త వచ్చిన ప్రభుత్వాలు దీనిని అటకెక్కించేశాయి. దీంతో పాటు అభివృద్ధి పేరుతో జరిగిన అనేక కార్యక్రమాలు కాశ్మీర్ నీటిపారుదల వ్యవస్థకు చేటు తెచ్చిపెట్టాయి. కాశ్మీర్ లోయలో నిర్మించిన కొత్త రైల్వే లైన్లు, హైవేలు నగరాన్ని లోతట్టు ప్రాంతంగా మార్చివేశాయి. కొత్తగా ఏర్పాటయిన నాలుగులైన్ల హైవే ప్రాజెక్టు శ్రీనగర్ మురుగునీటిపారుదల వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ఇవన్నీ జలవిలయాన్ని సృష్టించాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు మేల్కో వాలని, కాశ్మీర్లో చిత్తడినేలల పరిరక్షణకూ అడవుల పరిరక్షణ చట్టం -1980 వంటి పటిష్టమైన చట్టం ఉండాలని పర్యావరణ వేత్తలంటున్నారు. అయితే చట్టాలు చేయడం తోనే సరిపోదు. ప్రకృతిని కాపాడుకోవాలన్న కృతనిశ్చయం కూడా అవసరమే. అది లేనపుడు మనకు వైపరీత్యాల నుంచి రక్షణ లేనట్లే. అందుకు కాశ్మీర్ జలవిలయమే ప్రత్యక్ష ఉదాహరణ. పోతుకూరు శ్రీనివాసరావు -
ఉద్యోగాల కోతే బాబు విజన్
‘ఇంటికో ఉద్యోగం’... ‘నిరుద్యోగులకు నెలకు 2వేల భృతి’... ‘జాబు కావాలంటే బాబు రావాలి’... మొదటి మంత్రివర్గ సమావేశంలోనే 35 వేల ఉద్యోగాలు పీకేసే నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నారు. 20 వేల మంది ఆదర్శరైతులు, 15 వేల మంది ఉపాధి హామీ క్షేత్రస్థాయి సహాయకులను ఇంటికి సాగనంపుతూ జీవో కూడా ఇచ్చేశారు. వెయ్యి రూపాయల గౌరవవేతనంతో పనిచేస్తున్న దిగువసామాజికవర్గాలకు చెందినవారిని ఒక్క కలం పోటుతో అలా తొలగించేయడం బాబుకే చెల్లింది. ఆర్థిక సంస్కరణలలో భాగంగా ఏటా 1.9 శాతం మేర ఉద్యోగులను తొలగిస్తానంటూ ప్రపంచ బ్యాంకుతో గతంలో చంద్రబాబు ఏకంగా ఓ ఒప్పందమే కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ పథకం (ఏపీఈఆర్పీ) ప్రారంభించారు. ఉద్యోగుల తొలగింపు, ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నినాదాలు ఇవి. యువతను ప్రలోభపెట్టడానికి చంద్రబాబు చేయని ప్రచారం లేదు. ఇవ్వని వాగ్దానం లేదు. అయితే ఫలితాలు వచ్చి నెల గడవక ముందే బాబుగారి అసలు స్వరూపం బట్టబయల య్యింది. కొత్తగా ఉద్యోగాలివ్వడం మాట అటుంచి ఉన్న ఉద్యోగాలకే ఆయన ఎసరు పెట్టారు. వివిధ సంస్థలలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తీసే స్తున్నారు. ఉద్యోగాలు తీసేయడం, పనిచేసే సంస్థలను మూసేయడంలో బాబుగారు బహునేర్పరి. ఆయనగారి గత చరిత్రంతా ఈ తీసివేతలు... మూసివేతలే... గతంలో అధికారంలో ఉండగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసిన చంద్రబాబు వాటిలోని వేలాదిమంది ఉద్యోగుల ఉపాధికి దెబ్బకొట్టారు. అంతేకాదు ప్రపంచ బ్యాంకుతో ఓ ఒప్పందం కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ పథకం ప్రారంభించారు. దశలవారీగా ప్రభుత్వరంగ సంస్థలను మూసేయడం, ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడం ఆ పథకం ఉద్దేశం. అందుకోసం జీవో నంబర్ 58ని కూడా ఆయన జారీ చేశారు. ఆయన విజన్ ఉద్యోగుల తొలగింపే. 2020 నాటికి లక్ష మంది ఉద్యోగులను తొలగిస్తానని ప్రపంచబ్యాంకుకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మన బాబుగారు. ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు అనేక వాగ్దానాలు చేశారు. అందులో అత్యంత కీలకమైనది ‘ఇంటికో ఉద్యోగం’. రాష్ట్రంలో 3.5 కోట్ల ఇళ్లున్నాయి. ఇంటికో ఉద్యోగమంటే మాటలా.. అన్ని ఉద్యోగాలు ఇస్తున్నారా...? బాధ్యతగలిగిన నాయకులు ఏదైనా మాట్లాడుతున్నారంటే చిత్తశుద్ధి ఉండనక్కరలేదా? సాధ్యాసాధ్యాలను చూడనక్కరలేదా? బాబుగారు అన్నీ చూసుకునే ప్రజల కోసం ఆ హామీలిచ్చారని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. అయితే మరి ఇప్పుడు నెల గడచిపోయినా బాబుగారు తన హామీలపై నోరు ఎందుకు మెదపడం లేదు? ఏ హామీపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఎందుకు చెప్పడం లేదు? వ్యవసాయ రుణాల మాఫీపై ఓ కమిటీ వేసి చేతులు దులుపుకున్న చందానే మిగిలిన హామీలనూ అటకెక్కించేస్తారా? నిరుద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న సందేహాలివి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగానూ చంద్రబాబు మాటలు సమస్యను పక్కదోవ పట్టించేలానే ఉన్నాయి. ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలే కానక్కరలేదని, ప్రైవేటు ఉద్యోగాలు కూడానని ఆయన అంటున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ తదితరాలన్నింటినీ కలిపినా కూడా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వోద్యోగాలు 13 లక్షలు. భారీ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు, ఐటీ, సేవారంగం తదితరాల్లోని మొత్తం ప్రైవేట్ ఉద్యోగుల సంఖ్య 35 లక్షలు దాటదు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల సంఖ్య 50 లక్షల లోపే. అలాంటిది మరో 3 కోట్ల ఉద్యోగాలను ఎలా సృష్టిస్తారు? దానికేమైనా ప్రణాళిక బాబు వద్ద సిద్ధంగా ఉందా? అందుకోసం ఆయన ఏం చేయబోతున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఉద్యోగాలపై స్పష్టత ఏది? గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ‘ఇంటికో ఉద్యోగం’ హామీపై ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. దానిపై స్పష్టత ఏదని ప్రశ్నించారు. జాబు కావాలంటే బాబురావాలంటూ ఎన్నికలకుముందు టీవీల్లో పదేపదే ప్రకటనలు గుప్పించిన చంద్రబాబు ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగారు. అసలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారా లేదా.. అందుకోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు... అని ప్రశ్నించారు. వీటికి అధికారపక్షం నుంచి అసలు సమాధానమే లేదు. అత్యంత కీలకమైన ఈ అంశంపై శాసన సభలో జరిగిన చర్చ ఎందుకనో మీడియాలో ఎక్కడా పెద్దగా కనిపించలేదు. కోటి ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులు కొత్త ప్రభుత్వం తీరు చూసి నిట్టూరుస్తున్నారు. అసలు ఉద్యోగం వస్తుందా...? వచ్చే వరకూ నిరుద్యోగ భృతి ఇస్తారా..? ఇవి జవాబు దొరకని మిలియన్ డాలర్ల ప్రశ్నలే. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీలను చూసి యువత ఎంతో కొంత ఆశపడబట్టే ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు. పదవినధిష్టించిన తర్వాత మరి ఆ యువతకు ఆయనిచ్చే భరోసా ఏమిటి? ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతిపై ఇప్పటికీ ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు? 3.5 కోట్ల మందికి ఉద్యోగాలెప్పుడు ఇస్తారు... ఈ లోగా ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇవ్వనున్నారు..? వంటి విషయాలపై చంద్రబాబుకు ఎలాంటి క్లారిటీ లేదు. కొత్త ప్రభుత్వ ప్రాథమ్యాలను వెల్లడించే గవర్నర్ ప్రసంగంలోనూ నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి ప్రణాళికా లేదు. నిరుద్యోగ సమస్యకు బాబు ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యతా ఇవ్వడం లేదని దీన్ని బట్టి అర్థమౌతుంది. ఇవ్వడం అటుంచి.. ఉన్నవి హుష్‌కాకి.. వర్తమానానికి వస్తే... ఇంటికో ఉద్యోగం మాట దేవుడెరుగు... ఉన్న ఉద్యోగాలు పీకేసే పని బాబుగారు మొదలుపెట్టారు. మొదటి మంత్రివర్గ సమావేశంలోనే 35 వేల ఉద్యోగాలు పీకేసే నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నారు. 20 వేల మంది ఆదర్శరైతులు, 15 వేల మంది ఉపాధి హామీ క్షేత్రస్థాయి సహాయకులను ఇంటికి సాగనంపుతూ జీవో కూడా ఇచ్చేశారు. పదేళ్ల నుంచి వెయ్యి రూపాయల గౌరవవేతనంతో పనిచేస్తున్న దిగువ సామాజికవర్గాలకు చెందినవారిని ఒక్క కలం పోటుతో అలా తొలగించేయడం చంద్రబాబుకే చెల్లింది. వీరే కాదు గృహ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న 3,600 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా బాబు ఉద్వాసన పలికారు. 15 వేల రూపాయలలోపు గౌరవవేతనంతో పనిచేస్తున్న ఈ ఉద్యోగుల కుటుంబాలన్నీ ఇప్పుడు వీధిన పడ్డాయి. ఇంకా వైద్య ఆరోగ్య శాఖలో 4 వేల మంది, జలయజ్ఞం భూసేకరణలో 7 వేల మంది ఉద్యోగులను త్వరలోనే ఇంటికి పంపించనున్నారు. కొత్త ప్రభుత్వం వస్తే తమ ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని భావించామని, ఇలా తమ పొట్టకొడతారని ఊహించలేదని ఆ ఉద్యోగులు వాపోతున్నారు. ఒక్క గృహనిర్మాణ సంస్థే కాదు.... అన్ని సంస్థలలోని తాత్కాలిక, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కొత్త ప్రభుత్వం తొలగిస్తోంది. బాబు రాకతో జాబు పోక అన్నట్లయిందని ఉద్యోగులు బాధపడుతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయ పదవుల్లోని వారు రాజీనామాలు చేయడం మామూలే. కానీ పొట్టచేతబట్టుకుని ఉద్యోగాలు చేసుకుంటున్న చిరు వేతన జీవులను రాజకీయ కోణంలో చూడడం, వారి ఉపాధిని దెబ్బకొట్టడం సబబేనా? గత ప్రభుత్వంలో ఉద్యోగాలలో చేరిన వారిని ఇపుడు తొలగించేయడం ఏ తరహా రాజకీయం? తొలగింపులు, మూసివేతలే బాబుగారి ట్రాక్ రికార్డు ఉద్యోగులను తొలగించడం, ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయడంలో బాబుగారిది అందెవేసిన చేయి. గతంలో ఆయన పాలనలో అమలైన ప్రపంచబ్యాంకు ఆర్థిక సంస్కరణలకు బలైంది ఉద్యోగులే. ఆయన తొమ్మిదేళ్ల పాలనంతా ఉద్యోగుల ఉసురుపోసుకుంటూనే సాగింది. ఉన్న ఉద్యోగాలను తొలగించడమే పనిగా పెట్టుకునే చంద్రబాబు కొత్త ఉద్యోగాలిస్తానంటే నమ్మొ చ్చా...? ఆర్థిక సంస్కరణలలో భాగంగా ఏటా 1.9శాతం మేర ఉద్యోగులను తొలగిస్తానంటూ ప్రపంచబ్యాంకుతో చంద్రబాబు ఏకంగా ఓ ఒప్పందమే కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ పథకం (ఏపీఈఆర్పీ) ప్రారంభించారు. ఉద్యోగుల తొలగింపు, ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఆ తర్వాత ఉద్యోగుల కుదింపునకు సంబంధించి ఉత్తర్వులు (జీవో 58) కూడా చంద్రబాబు జారీ చేశారు. దాని ప్రకారం 1998లో 747, 1999లో 1,683, 2000లో 3,439, 2001లో 1,382 మందిని తొలగించారని గణాంకాలు చెబుతున్నాయి. అలా లక్షమంది ఉద్యోగులను తొలగిస్తానని ప్రపంచబ్యాంకు ముందు చంద్రబాబు తన విజన్ 2020 ని ఆవిష్కరించారు. బాబు అనేక ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను కారుచౌకగా అమ్మేశారు. పలు సంస్థలను మూసేశారు. రాష్ట్రంలో 127 ప్రభుత్వ, సహకార రంగ సంస్థలు ఉన్నాయి. వాటిలో చంద్రబాబు 14 మూసేశారు. 11 సంస్థలను అమ్మేశారు. మరో పదిసంస్థలను అమ్మడానికి రంగం సిద్ధం చేశారు. ఈ సంస్థలలోని 21 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. ఏపీఈఆర్పీ కింద తొలిదశలో నంద్యాల, రాజమండ్రి, నెల్లూరు, ఆదిలాబాద్ స్పిన్నింగ్ మిల్లులతో పాటు నిజాం షుగర్స్, ఆల్విన్ వాచ్ కంపెనీలను మూసేశారు. రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీ, మధునగర్ షుగర్ మిల్లు, లచ్చయ్యపేట షుగర్ మిల్లు, మెంబోజిపల్లి డిస్టిలరీ, చాగల్లు డిస్టిలరీ ఆస్తులను కారుచౌకగా అమ్మేశారు. రెండో దశలో ఆర్టీసీ, సింగరేణి కాలరీస్‌తో పాటు బెవరేజ్, టెక్స్టైల్స్, కోళ్లు -మాంసం అభివృద్ధి కార్పొరేషన్లు, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ, వికలాంగుల సంస్థల్లోని ఉద్యోగులనూ తొలగించాలనుకున్నారు. 2004 ఎన్నికల్లో బాబు ఓటమితో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎకనమిక్ సర్వే చెబుతున్న నిజాలు... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సోషియో ఎకనమిక్స్ సర్వే 2012-2013 ప్రకారం... - 2000 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్‌లో రెండు రంగాల్లో.. అంటే పబ్లిక్ , ప్రైవేట్ రంగాలు రెండింటిలో కలిపి ఉద్యోగుల సంఖ్య 20,71,642. 2004 మార్చి నాటికి మొత్తంగా ఉద్యోగులు లేదా ఉద్యోగాల సంఖ్య 20,11,645. అంటే కేవలం నాలుగేళ్లలోనే చంద్రబాబు హయాంలో తగ్గిన ఉద్యోగాలు దాదాపు 60,000. - వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన చివరి సంవత్సరం 2009 మార్చి నాటికి ఈ సంఖ్య 20,82,800. అంటే వైఎస్ పాలనలో 71,155 ఉద్యోగాలు పెరిగాయి. - ప్రైవేటు రంగాన్ని తీసుకున్నా 2000 మార్చి నాటికి 5,68,362 ఉద్యోగాలు ఉం టే అది 2004 మార్చి నాటికి 5,67,666. అంటే బాబు పాలన చివరి నాలుగేళ్లు తీసుకున్నా ప్రైవేటు ఉద్యోగాలు పెరగకపోగా 696 తగ్గాయి. 2009 మార్చి నాటికి ప్రైవేటు ఉద్యోగాలు 7,24,916. అంటే 1,59,250 ఉద్యోగాలు పెరిగాయి. బాబు జమానాలో తగ్గిన ఉద్యోగాలు చంద్రబాబు అమ్మేసిన ప్రభుత్వరంగ, సహకార సంస్థలివే.. * ఆల్విన్ సనత్‌నగర్ భూములు * రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీ * నిజాం షుగర్స్ (నాలుగు యూనిట్లు) * మధునగర్ షుగర్ మిల్లు * లచ్చయ్యపేట షుగర్ మిల్లు * మొంబోజిపల్లి డిస్టిలరీ * చాగల్లు డిస్టిలరీ * హనుమాన్ జంక్షన్ షుగర్స్ * నంద్యాల షుగర్స్ * పాలకొల్లు షుగర్స్ * గురజాల షుగర్స్ * ఇంకొల్లు నూలు మిల్లు * ఆదిలాబాద్ నూలు మిల్లు * నెల్లూరు నూలు మిల్లు * యడ్లపాడు నూలు మిల్లు మభ్యపెట్టడం వెన్నతోపెట్టిన విద్య ఏరుదాటేందుకు ఎన్నో చెబుతాం అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఎట్టా అని వెనకటికెవడో అన్నాట్ట. బాబుగారిది అచ్చు ఇలాంటి పాలసీనే. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీనీ ఆయన అంతగా గుర్తుపెట్టుకోరు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అమలు చేయాల్సి వచ్చినా వాటికి ఎలాగోలా తూట్లు పొడిచేస్తారు. అదీ ఆయన ట్రాక్ రికార్డు. మద్యనిషేధం ఎత్తివేత, కిలో 2 రూపాయల బియ్యం ధర రూ.5.25కు పెంపు వంటివి ఇందుకు నిదర్శనం. ఇప్పుడు కూడా రైతు రుణాల మాఫీ గురించి అన్నివైపులా ఒత్తిడి పెరగడంతో ఓ కమిటీ వేసేశారు. నిజానికి రుణమాఫీ ఆచరణ సాధ్యమేనా అని ఎన్నికల సంఘం చంద్రబాబును వివరణ అడిగితేనే నిక్కినీలిగీ చివరికి ఏదో సమాధానమిచ్చారు. అందులో చెప్పిన విధంగానే రుణమాఫీని అమలుచేసేయొచ్చు కదా? మరలా అధ్య యనానికి ఓ కమిటీ ఎందుకు? అంటే అసలు ఏమీ అధ్యయనం చేయకుండానే వెనకా ముందూ చూసుకోకుండానే హామీ ఇచ్చేశారు? మేనిఫెస్టోలో పెడుతున్నామంటే దాని సాధ్యాసాధ్యాలను ముందుగా బేరీజు వేసుకోనక్కరలేదా? ఇప్పుడు కొత్తగా కమిటీ ఏమిటి? ఇది కాలయాపన కోసం కాదా? ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో పాత రుణాలు కడితే గానీ కొత్తగా రుణాలిచ్చేది లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. పైగా పాతరుణాలు కట్టాలని నోటీ సులు కూడా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను గందరగోళంలో ముంచి కమిటీలతో కాలయాపన చేయడం సబబేనా? ఇంటికో ఉద్యోగం విషయంలోనూ బాబు ఇలాంటి గందరగోళాన్నే సృష్టించాలని చూస్తున్నారు. ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యో గమే కానక్కరలేదు ప్రైవేటు ఉద్యోగమైనా ఉద్యోగమేనని ఆయన అంటున్నారు. అలాగే ఉద్యోగమంటే ఉద్యోగమే మేమే ఇవ్వనక్కరలేదు.. ఎవరిచ్చినామేమిచ్చినట్టేనంటూ రాష్ట్రంలో ఎక్కడ ఏ కొట్టులో ఎవరికి ఏ గుమస్తా ఉద్యోగమొచ్చినా ఆయన ఖాతాలోనే వేసుకుంటారేమో..! - పోతుకూరు శ్రీనివాసరావు -
ఉద్యోగాల కోతే బాబు విజన్
‘ఇంటికో ఉద్యోగం’... ‘నిరుద్యోగులకు నెలకు 2వేల భృతి’... ‘జాబు కావాలంటే బాబు రావాలి’... మొదటి మంత్రివర్గ సమావేశంలోనే 35 వేల ఉద్యోగాలు పీకేసే నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నారు. 20 వేల మంది ఆదర్శరైతులు, 15 వేల మంది ఉపాధి హామీ క్షేత్రస్థాయి సహాయకులను ఇంటికి సాగనంపుతూ జీవో కూడా ఇచ్చేశారు. వెయ్యి రూపాయల గౌరవవేతనంతో పనిచేస్తున్న దిగువసామాజికవర్గాలకు చెందినవారిని ఒక్క కలం పోటుతో అలా తొలగించేయడం బాబుకే చెల్లింది. ఆర్థిక సంస్కరణలలో భాగంగా ఏటా 1.9 శాతం మేర ఉద్యోగులను తొలగిస్తానంటూ ప్రపంచ బ్యాంకుతో గతంలో చంద్రబాబు ఏకంగా ఓ ఒప్పందమే కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ పథకం (ఏపీఈఆర్పీ) ప్రారంభించారు. ఉద్యోగుల తొలగింపు, ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నినాదాలు ఇవి. యువతను ప్రలోభపెట్టడానికి చంద్రబాబు చేయని ప్రచారం లేదు. ఇవ్వని వాగ్దానం లేదు. అయితే ఫలితాలు వచ్చి నెల గడవక ముందే బాబుగారి అసలు స్వరూపం బట్టబయల య్యింది. కొత్తగా ఉద్యోగాలివ్వడం మాట అటుంచి ఉన్న ఉద్యోగాలకే ఆయన ఎసరు పెట్టారు. వివిధ సంస్థలలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తీసే స్తున్నారు. ఉద్యోగాలు తీసేయడం, పనిచేసే సంస్థలను మూసేయడంలో బాబుగారు బహునేర్పరి. ఆయనగారి గత చరిత్రంతా ఈ తీసివేతలు... మూసివేతలే... గతంలో అధికారంలో ఉండగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసిన చంద్రబాబు వాటిలోని వేలాదిమంది ఉద్యోగుల ఉపాధికి దెబ్బకొట్టారు. అంతేకాదు ప్రపంచ బ్యాంకుతో ఓ ఒప్పందం కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ పథకం ప్రారంభించారు. దశలవారీగా ప్రభుత్వరంగ సంస్థలను మూసేయడం, ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడం ఆ పథకం ఉద్దేశం. అందుకోసం జీవో నంబర్ 58ని కూడా ఆయన జారీ చేశారు. ఆయన విజన్ ఉద్యోగుల తొలగింపే. 2020 నాటికి లక్ష మంది ఉద్యోగులను తొలగిస్తానని ప్రపంచబ్యాంకుకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మన బాబుగారు. ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు అనేక వాగ్దానాలు చేశారు. అందులో అత్యంత కీలకమైనది ‘ఇంటికో ఉద్యోగం’. రాష్ట్రంలో 3.5 కోట్ల ఇళ్లున్నాయి. ఇంటికో ఉద్యోగమంటే మాటలా.. అన్ని ఉద్యోగాలు ఇస్తున్నారా...? బాధ్యతగలిగిన నాయకులు ఏదైనా మాట్లాడుతున్నారంటే చిత్తశుద్ధి ఉండనక్కరలేదా? సాధ్యాసాధ్యాలను చూడనక్కరలేదా? బాబుగారు అన్నీ చూసుకునే ప్రజల కోసం ఆ హామీలిచ్చారని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. అయితే మరి ఇప్పుడు నెల గడచిపోయినా బాబుగారు తన హామీలపై నోరు ఎందుకు మెదపడం లేదు? ఏ హామీపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఎందుకు చెప్పడం లేదు? వ్యవసాయ రుణాల మాఫీపై ఓ కమిటీ వేసి చేతులు దులుపుకున్న చందానే మిగిలిన హామీలనూ అటకెక్కించేస్తారా? నిరుద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న సందేహాలివి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగానూ చంద్రబాబు మాటలు సమస్యను పక్కదోవ పట్టించేలానే ఉన్నాయి. ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలే కానక్కరలేదని, ప్రైవేటు ఉద్యోగాలు కూడానని ఆయన అంటున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ తదితరాలన్నింటినీ కలిపినా కూడా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వోద్యోగాలు 13 లక్షలు. భారీ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు, ఐటీ, సేవారంగం తదితరాల్లోని మొత్తం ప్రైవేట్ ఉద్యోగుల సంఖ్య 35 లక్షలు దాటదు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల సంఖ్య 50 లక్షల లోపే. అలాంటిది మరో 3 కోట్ల ఉద్యోగాలను ఎలా సృష్టిస్తారు? దానికేమైనా ప్రణాళిక బాబు వద్ద సిద్ధంగా ఉందా? అందుకోసం ఆయన ఏం చేయబోతున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఉద్యోగాలపై స్పష్టత ఏది? గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ‘ఇంటికో ఉద్యోగం’ హామీపై ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. దానిపై స్పష్టత ఏదని ప్రశ్నించారు. జాబు కావాలంటే బాబురావాలంటూ ఎన్నికలకుముందు టీవీల్లో పదేపదే ప్రకటనలు గుప్పించిన చంద్రబాబు ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగారు. అసలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారా లేదా.. అందుకోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు... అని ప్రశ్నించారు. వీటికి అధికారపక్షం నుంచి అసలు సమాధానమే లేదు. అత్యంత కీలకమైన ఈ అంశంపై శాసన సభలో జరిగిన చర్చ ఎందుకనో మీడియాలో ఎక్కడా పెద్దగా కనిపించలేదు. కోటి ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులు కొత్త ప్రభుత్వం తీరు చూసి నిట్టూరుస్తున్నారు. అసలు ఉద్యోగం వస్తుందా...? వచ్చే వరకూ నిరుద్యోగ భృతి ఇస్తారా..? ఇవి జవాబు దొరకని మిలియన్ డాలర్ల ప్రశ్నలే. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీలను చూసి యువత ఎంతో కొంత ఆశపడబట్టే ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు. పదవినధిష్టించిన తర్వాత మరి ఆ యువతకు ఆయనిచ్చే భరోసా ఏమిటి? ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతిపై ఇప్పటికీ ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు? 3.5 కోట్ల మందికి ఉద్యోగాలెప్పుడు ఇస్తారు... ఈ లోగా ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇవ్వనున్నారు..? వంటి విషయాలపై చంద్రబాబుకు ఎలాంటి క్లారిటీ లేదు. కొత్త ప్రభుత్వ ప్రాథమ్యాలను వెల్లడించే గవర్నర్ ప్రసంగంలోనూ నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి ప్రణాళికా లేదు. నిరుద్యోగ సమస్యకు బాబు ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యతా ఇవ్వడం లేదని దీన్ని బట్టి అర్థమౌతుంది. ఇవ్వడం అటుంచి.. ఉన్నవి హుష్‌కాకి.. వర్తమానానికి వస్తే... ఇంటికో ఉద్యోగం మాట దేవుడెరుగు... ఉన్న ఉద్యోగాలు పీకేసే పని బాబుగారు మొదలుపెట్టారు. మొదటి మంత్రివర్గ సమావేశంలోనే 35 వేల ఉద్యోగాలు పీకేసే నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నారు. 20 వేల మంది ఆదర్శరైతులు, 15 వేల మంది ఉపాధి హామీ క్షేత్రస్థాయి సహాయకులను ఇంటికి సాగనంపుతూ జీవో కూడా ఇచ్చేశారు. పదేళ్ల నుంచి వెయ్యి రూపాయల గౌరవవేతనంతో పనిచేస్తున్న దిగువ సామాజికవర్గాలకు చెందినవారిని ఒక్క కలం పోటుతో అలా తొలగించేయడం చంద్రబాబుకే చెల్లింది. వీరే కాదు గృహ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న 3,600 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా బాబు ఉద్వాసన పలికారు. 15 వేల రూపాయలలోపు గౌరవవేతనంతో పనిచేస్తున్న ఈ ఉద్యోగుల కుటుంబాలన్నీ ఇప్పుడు వీధిన పడ్డాయి. ఇంకా వైద్య ఆరోగ్య శాఖలో 4 వేల మంది, జలయజ్ఞం భూసేకరణలో 7 వేల మంది ఉద్యోగులను త్వరలోనే ఇంటికి పంపించనున్నారు. కొత్త ప్రభుత్వం వస్తే తమ ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని భావించామని, ఇలా తమ పొట్టకొడతారని ఊహించలేదని ఆ ఉద్యోగులు వాపోతున్నారు. ఒక్క గృహనిర్మాణ సంస్థే కాదు.... అన్ని సంస్థలలోని తాత్కాలిక, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కొత్త ప్రభుత్వం తొలగిస్తోంది. బాబు రాకతో జాబు పోక అన్నట్లయిందని ఉద్యోగులు బాధపడుతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయ పదవుల్లోని వారు రాజీనామాలు చేయడం మామూలే. కానీ పొట్టచేతబట్టుకుని ఉద్యోగాలు చేసుకుంటున్న చిరు వేతన జీవులను రాజకీయ కోణంలో చూడడం, వారి ఉపాధిని దెబ్బకొట్టడం సబబేనా? గత ప్రభుత్వంలో ఉద్యోగాలలో చేరిన వారిని ఇపుడు తొలగించేయడం ఏ తరహా రాజకీయం? తొలగింపులు, మూసివేతలే బాబుగారి ట్రాక్ రికార్డు ఉద్యోగులను తొలగించడం, ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయడంలో బాబుగారిది అందెవేసిన చేయి. గతంలో ఆయన పాలనలో అమలైన ప్రపంచబ్యాంకు ఆర్థిక సంస్కరణలకు బలైంది ఉద్యోగులే. ఆయన తొమ్మిదేళ్ల పాలనంతా ఉద్యోగుల ఉసురుపోసుకుంటూనే సాగింది. ఉన్న ఉద్యోగాలను తొలగించడమే పనిగా పెట్టుకునే చంద్రబాబు కొత్త ఉద్యోగాలిస్తానంటే నమ్మొ చ్చా...? ఆర్థిక సంస్కరణలలో భాగంగా ఏటా 1.9శాతం మేర ఉద్యోగులను తొలగిస్తానంటూ ప్రపంచబ్యాంకుతో చంద్రబాబు ఏకంగా ఓ ఒప్పందమే కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ పథకం (ఏపీఈఆర్పీ) ప్రారంభించారు. ఉద్యోగుల తొలగింపు, ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఆ తర్వాత ఉద్యోగుల కుదింపునకు సంబంధించి ఉత్తర్వులు (జీవో 58) కూడా చంద్రబాబు జారీ చేశారు. దాని ప్రకారం 1998లో 747, 1999లో 1,683, 2000లో 3,439, 2001లో 1,382 మందిని తొలగించారని గణాంకాలు చెబుతున్నాయి. అలా లక్షమంది ఉద్యోగులను తొలగిస్తానని ప్రపంచబ్యాంకు ముందు చంద్రబాబు తన విజన్ 2020 ని ఆవిష్కరించారు. బాబు అనేక ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను కారుచౌకగా అమ్మేశారు. పలు సంస్థలను మూసేశారు. రాష్ట్రంలో 127 ప్రభుత్వ, సహకార రంగ సంస్థలు ఉన్నాయి. వాటిలో చంద్రబాబు 14 మూసేశారు. 11 సంస్థలను అమ్మేశారు. మరో పదిసంస్థలను అమ్మడానికి రంగం సిద్ధం చేశారు. ఈ సంస్థలలోని 21 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. ఏపీఈఆర్పీ కింద తొలిదశలో నంద్యాల, రాజమండ్రి, నెల్లూరు, ఆదిలాబాద్ స్పిన్నింగ్ మిల్లులతో పాటు నిజాం షుగర్స్, ఆల్విన్ వాచ్ కంపెనీలను మూసేశారు. రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీ, మధునగర్ షుగర్ మిల్లు, లచ్చయ్యపేట షుగర్ మిల్లు, మెంబోజిపల్లి డిస్టిలరీ, చాగల్లు డిస్టిలరీ ఆస్తులను కారుచౌకగా అమ్మేశారు. రెండో దశలో ఆర్టీసీ, సింగరేణి కాలరీస్‌తో పాటు బెవరేజ్, టెక్స్టైల్స్, కోళ్లు -మాంసం అభివృద్ధి కార్పొరేషన్లు, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ, వికలాంగుల సంస్థల్లోని ఉద్యోగులనూ తొలగించాలనుకున్నారు. 2004 ఎన్నికల్లో బాబు ఓటమితో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎకనమిక్ సర్వే చెబుతున్న నిజాలు... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సోషియో ఎకనమిక్స్ సర్వే 2012-2013 ప్రకారం...2000 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్‌లో రెండు రంగాల్లో.. అంటే పబ్లిక్ , ప్రైవేట్ రంగాలు రెండింటిలో కలిపి ఉద్యోగుల సంఖ్య 20,71,642. 2004 మార్చి నాటికి మొత్తంగా ఉద్యోగులు లేదా ఉద్యోగాల సంఖ్య 20,11,645. అంటే కేవలం నాలుగేళ్లలోనే చంద్రబాబు హయాంలో తగ్గిన ఉద్యోగాలు దాదాపు 60,000.వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన చివరి సంవత్సరం 2009 మార్చి నాటికి ఈ సంఖ్య 20,82,800. అంటే వైఎస్ పాలనలో 71,155 ఉద్యోగాలు పెరిగాయి.{పైవేటు రంగాన్ని తీసుకున్నా 2000 మార్చి నాటికి 5,68,362 ఉద్యోగాలు ఉం టే అది 2004 మార్చి నాటికి 5,67,666. అంటే బాబు పాలన చివరి నాలుగేళ్లు తీసుకున్నా ప్రైవేటు ఉద్యోగాలు పెరగకపోగా 696 తగ్గాయి.2009 మార్చి నాటికి ప్రైవేటు ఉద్యోగాలు 7,24,916. అంటే 1,59,250 ఉద్యోగాలు పెరిగాయి. మభ్యపెట్టడం వెన్నతోపెట్టిన విద్య ఏరుదాటేందుకు ఎన్నో చెబుతాం అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఎట్టా అని వెనకటికెవడో అన్నాట్ట. బాబుగారిది అచ్చు ఇలాంటి పాలసీనే. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీనీ ఆయన అంతగా గుర్తుపెట్టుకోరు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అమలు చేయాల్సి వచ్చినా వాటికి ఎలాగోలా తూట్లు పొడిచేస్తారు. అదీ ఆయన ట్రాక్ రికార్డు. మద్యనిషేధం ఎత్తివేత, కిలో 2 రూపాయల బియ్యం ధర రూ.5.25కు పెంపు వంటివి ఇందుకు నిదర్శనం. ఇప్పుడు కూడా రైతు రుణాల మాఫీ గురించి అన్నివైపులా ఒత్తిడి పెరగడంతో ఓ కమిటీ వేసేశారు. నిజానికి రుణమాఫీ ఆచరణ సాధ్యమేనా అని ఎన్నికల సంఘం చంద్రబాబును వివరణ అడిగితేనే నిక్కినీలిగీ చివరికి ఏదో సమాధానమిచ్చారు. అందులో చెప్పిన విధంగానే రుణమాఫీని అమలుచేసేయొచ్చు కదా? మరలా అధ్య యనానికి ఓ కమిటీ ఎందుకు? అంటే అసలు ఏమీ అధ్యయనం చేయకుండానే వెనకా ముందూ చూసుకోకుండానే హామీ ఇచ్చేశారు? మేనిఫెస్టోలో పెడుతున్నామంటే దాని సాధ్యాసాధ్యాలను ముందుగా బేరీజు వేసుకోనక్కరలేదా? ఇప్పుడు కొత్తగా కమిటీ ఏమిటి? ఇది కాలయాపన కోసం కాదా? ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో పాత రుణాలు కడితే గానీ కొత్తగా రుణాలిచ్చేది లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. పైగా పాతరుణాలు కట్టాలని నోటీ సులు కూడా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను గందరగోళంలో ముంచి కమిటీలతో కాలయాపన చేయడం సబబేనా? ఇంటికో ఉద్యోగం విషయంలోనూ బాబు ఇలాంటి గందరగోళాన్నే సృష్టించాలని చూస్తున్నారు. ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యో గమే కానక్కరలేదు ప్రైవేటు ఉద్యోగమైనా ఉద్యోగమేనని ఆయన అంటున్నారు. అలాగే ఉద్యోగమంటే ఉద్యోగమే మేమే ఇవ్వనక్కరలేదు.. ఎవరిచ్చినామేమిచ్చినట్టేనంటూ రాష్ట్రంలో ఎక్కడ ఏ కొట్టులో ఎవరికి ఏ గుమస్తా ఉద్యోగమొచ్చినా ఆయన ఖాతాలోనే వేసుకుంటారేమో..! చంద్రబాబు అమ్మేసిన ప్రభుత్వరంగ, సహకార సంస్థలివే.. ► ఆల్విన్ సనత్‌నగర్ భూములు ► రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీ ► నిజాం షుగర్స్ (నాలుగు యూనిట్లు) ► మధునగర్ షుగర్ మిల్లు ► లచ్చయ్యపేట షుగర్ మిల్లు ► మొంబోజిపల్లి డిస్టిలరీ ► చాగల్లు డిస్టిలరీ ► హనుమాన్ జంక్షన్ షుగర్స్ ► నంద్యాల షుగర్స్ ► పాలకొల్లు షుగర్స్ ► గురజాల షుగర్స్ ► ఇంకొల్లు నూలు మిల్లు ► ఆదిలాబాద్ నూలు మిల్లు ► నెల్లూరు నూలు మిల్లు ► యడ్లపాడు నూలు మిల్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సోషియో ఎకనమిక్ సర్వే 2012-13 గణాంకాలివి... 2000- 2004 మధ్య చంద్రబాబు పాలనలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోని ఉద్యోగాలు తగ్గిన విషయాన్ని ఇవి వెల్లడిస్తున్నాయి. 2009 నాటికి వైఎస్ పాలనలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలు పెరిగిన విషయం కూడా ఈ గణాంకాల ద్వారా తెలుసుకోవచ్చు. - పోతుకూరు శ్రీనివాసరావు -
కాష్టంలో బొగ్గుల కోసం కాట్లాట
ఓట్ల కోసం.. సీట్ల కోసం వెంపర్లాడడం రాజకీయ పార్టీలకు మామూలే. ఎన్నిక లొస్తున్నాయంటే ఈ యావ మరీ ఎక్కువవుతుంటుంది. రాజకీయ లబ్ధికి పనికివచ్చే ఏ విషయాన్నీ అవి చూస్తూ వదిలిపెట్టవు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఇదే వెంపర్లాటలో ఉన్నాయి. యూపీలోని ముజఫర్‌నగర్ అల్లర్లు... అనంతర పరిణామాలలో అది స్పష్టంగా కనిపిస్తుంది. నాలుగు నెలలుగా దక్షిణ యూపీ మతపరమైన అల్లర్లతో అట్టుడుకుతున్నది. ముఖ్యంగా ముజఫర్‌నగర్ జిల్లా మత హింసతో అల్లాడుతున్నది. ఇప్పటి వరకూ 62 మంది మరణించారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. దాదాపు 60 వేల మంది ఇల్లూవాకిలి వదిలి తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. సాధారణ పరిస్థితులు నెలకొని తిరిగి ఇళ్లకు వెళ్లేంత వరకు వారికి కనీస వసతులు కల్పించాల్సిన రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు ఆ బాధ్యతను విస్మరించి పరస్పర దూషణలపై దృష్టిపెట్టాయి. డిసెంబర్ చలి తీవ్రతకు శిబిరాల్లోని పసివాళ్లు 40 మంది వరకూ మరణించినా వారికి చీమ కుట్టినట్టు లేదు.. హింసాకాండ, శిబిరాలలో సౌకర్యాల లేమి సమస్యలపై రెండు పార్టీల నేతలు తిట్లపురాణంలో తలమునకలుగా ఉంటున్నారు. సాధారణంగా ఏ సమస్యపైనా స్పందించని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ విషయంలో భిన్నంగా వ్యవహరించడంలోని అసలు ఉద్దేశాలను సుస్పష్టమే. ఊహించని విధంగా ఆయన రెండుసార్లు ముజఫర్‌నగర్ సందర్శించారు. సరదాగా సెలవులకు వెళ్లినట్లు ముజఫర్‌నగర్ శిబిరాలకు వెళ్లి బాధితుల వైపు చేతులూపి, అక్కడి నాయకులతో బాతాఖానీలో మునిగితేలడం రాహుల్ ‘పరిణతి’కి అద్దం పడుతుంది. బాధితులపై దృష్టి పెట్టండంటూ అఖిలేష్‌కి ఉచిత సలహాలివ్వడం రాహుల్ మార్కు పరిష్కారం కాబోలు. కేంద్రంలో అధికారంలో ఉన్నది తామేనని, బాధితులకు తామూ సహాయం చేయవచ్చన్న విషయమే ఆయన మరచిపోయారు. అందుకే బాధితులు ఆయనకు నల్లజెండాలతో నిరసన తెలపాల్సి వచ్చింది. అయినా కేంద్రం ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడమే రాహుల్ పర్యటనల ఆంతర్యాన్ని స్పష్టం చేస్తోంది. ముజఫర్‌నగర్‌లో పర్యటిస్తూ అక్కడి ముస్లిం నేతలతో రాహుల్ సమాలోచనలు, సంప్రదింపులు జరుపుతున్న సమయంలోనే యూపీయే చైర్పర్సన్ సోనియాగాంధీ ఢిల్లీలో యూపీ జాట్ నాయకులతో భేటీ అయ్యారు. రిజర్వేషన్ విషయంలో యూపీఏ సానుకూలంగా ఉండడంపై కృతజ్ఞతలు తెలుపుకునేందుకే వారు సోనియాను కలిసినట్లు పైకి ప్రచారం జరుగుతున్నా నిజానికి జరుగుతున్నది వేరే. యూపీ అల్లర్లలో భాగంగా ఉన్న ఈ రెండు వైరి వర్గాలను తమ దారికి తెచ్చుకునేందుకు రాహుల్, సోనియా ఎంత ‘ప్రణాళికా’బద్ధంగా వ్యవహరిస్తున్నారో దీనిని బట్టి తెలుసుకోవచ్చు. ఇక ముజఫర్‌నగర్ బాధితుల విషయంలో అఖిలేష్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు మరీ ఆశ్చర్యకరంగా ఉంది. శిబిరాలలో 34 మంది చిన్నారులు మరణించారని ఒప్పుకుంటూనే చలి కారణంగా ఎవరూ మరణించలేదని యూపీ హోంశాఖ ఇంకో వితండ వాదనను మొదలుపెట్టింది. ఆ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఏకే గుప్తా అయితే మరో వింత వాదాన్ని తీసుకొచ్చారు. ‘చలికి ఎవరూ చనిపోలేదు. చనిపోరు కూడా. సైబీరియాలో మనుషులు బతకడం లేదా...’ అంటూ తర్కానికి దిగారు. ఈ మాట అఖిలేష్‌కు కూడా కోపం తెప్పించింది. రాష్ర్ట పోలీసులు తామేమీ తక్కువ తినలేదని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. శిబిరాలను ఖాళీ చేసి బాధితులు వెంటనే సొంత ఇళ్లకు తిరిగి వెళ్లాలని బెదిరిస్తున్నారు, వత్తిడి చేస్తున్నారు. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెల కొనకముందే ఎలా వెళ్లిపోవాలనే వారి ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. అదేమని నిలదీస్తే మత హింసను అడ్డుపెట్టుకుని దాదాపు 30 కుటుంబాలు అక్రమంగా శిబిరాల్లో ఉంటున్నాయని, వారిని మాత్రమే వెళ్లిపోమంటున్నామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. నాలుగు నెలలుగా అక్కడ అరాచకం రాజ్యమేలుతున్నా అల్లర్లకు కారణమైన వారు ఎవరికీ అరదండాలు పడనేలేదు. బలాత్కారాలకు తెగబడుతున్న కీచకులను ఊచల వెనక్కు పంపనేలేదు. బాధితులు అరకొర సౌకర్యాలున్న శిబిరాల్లో అష్టకష్టాలూ పడుతుంటే, భయం భయంగా బతుకుతుంటే... అత్యాచారాలు చేసినవారు, హత్యలకు ఒడిగట్టినవారు బాహాటంగా తిరుగుతున్నారు. ఇప్పటికైతే రాజకీయ నాయకుల ‘ఉచిత’ పరామర్శలు... రక్షక భటుల ఇనుపబూట్ల చప్పుళ్లే ముజఫర్‌నగర్ బాధితులకు అందుతున్న ‘సాంత్వన’... అంతకుమించి ఆశించకూడదని వారికీ అర్ధమైపోయింది. -పోతుకూరు శ్రీనివాసరావు -
మళ్లీ బుసకొడుతున్న నాగాలు!
ఈశాన్య రాష్ట్రాలలో అశాంతి కొత్త విషయమేమీ కాదు. అందులోనూ మణిపూర్ - నాగాలాండ్‌లలో ఆందోళనలు, బంద్‌లు, ఆర్థిక దిగ్బంధనాలు, బాంబుపేలుళ్లు, రక్తపుటే రులు అత్యంత సహజమైన విషయాలుగా మారిపో యాయి. ఏ రోజైనా అక్కడ ఏమీ జరగకపోతేనే విచిత్రం. ఆందోళనలకు తోడు ఉగ్రవాద పెను ఉత్పాతం నాగా లాం డ్‌ను అత్యంత సమస్యాత్మకంగా మార్చేసింది. గ్రేటర్ నాగాలాండ్ కోసం దశాబ్దాలుగా నాగాలు జరుపుతున్న పోరాటం వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది. తాజాగా యునెటైడ్ నాగా కౌన్సిల్ (యూఎన్సీ) ఇచ్చిన 48 గంటల సార్వత్రిక సమ్మె పిలుపు ఈ రెండు రాష్ట్రాలలోనూ గుబులు రేపుతున్నది. మణిపూర్‌లో నాగా లు నివాసముంటున్న ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనా వ్యవస్థ ఉండాలన్న డిమాండ్‌తో ఈ సమ్మెకు పిలుపుని చ్చారు. నాగాలు నివాసముండే ప్రాంతాలలో మాత్రమే సమ్మె జరుగుతుందని నాయకులు నమ్మబలుకుతున్నా గత అనుభవాలు గుర్తొస్తుండడంతో రెండు రాష్ట్రాలలోనూ సామాన్య ప్రజలు ఆందోళనపడుతున్నారు. చిన్న అగ్గిరవ్వ కార్చిచ్చును రగిల్చినట్లు ఏ చిన్న ఘటనైనా ఉద్రిక్తతలకు ఆజ్యం పోసే ప్రమాదముంది. ఏ పరిణామం ఎటుదారి తీస్తుందోనన్న భయం వారిది. మణిపూర్‌లోని తమెంగ్లాంగ్, సేనాపతి జిల్లాల గుండానే రెండు ముఖ్యమైన జాతీయ రహదారులు (ఇం ఫాల్-జిర్బం-సిల్చార్, ఇంఫాల్-దిమాపూర్-గువాహతి) వెళుతుండడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నిత్యావస రాల సరఫరాలకు విఘాతం కలగబోతున్నది. అంటే మణి పూర్‌కు ఈ 48 గంటలపాటు నిత్యావసరాలు బంద్ అయిపోతాయన్నమాట. ఏటా డిసెంబర్ 14న జరిగే ‘ఆరెంజ్ పండుగ’ కూడా ఈ సమ్మె ప్రభంజనంలో కొట్టుకు పోనున్నది. ముఖ్యంగా తమెంగ్‌లాంగ్‌లో ఈ పండుగను అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. పండుగ సందర్భంగా పండ్లు బాగా అమ్ముడవుతాయని ఆశలు పెట్టుకున్న రైతులు ఇపుడు ఉసూరుమంటూ నిట్టూరు స్తున్నారు. మణిపూర్‌లో నాగాలు నివాసముంటున్న ప్రాంతా లలో జాతీయ ప్రాజెక్టుల నిర్మాణాలన్నిటిపైనా తక్షణం నిషేధం విధించాలనుకుంటున్నట్లు కూడా యూఎన్సీ వర్గాలు చెబుతున్నాయి. యూఎన్సీ డిమాండ్లపై గతంలో జరిగిన త్రైపాక్షిక చర్చలు విఫలమయ్యాయి. కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల ప్రతినిధులతో యూఎన్సీ ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. నాగాలు నివాసముంటున్న ప్రాంతా లను మణిపూర్ నుంచి విడగొట్టి ప్రత్యేక పాలనా వ్యవ స్థను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ నుంచి యూఎన్సీ దిగిరాకపోవడంతో చర్చలు ముందుకు సాగలేదు. ఇపుడు అదే డిమాండ్‌తో యూఎన్సీ మరోమారు సమ్మెకు సన్న ద్ధం కావడం ఆందోళన కల్గిస్తోంది. మణిపూర్ మాత్రమే కాదు.. అసోం, అరుణాచల్ ప్రదేశ్‌లలోనూ, పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, మయన్మార్ల లోనూ నాగాలు నివసిస్తున్న ప్రాంతాలున్నాయి. వాటన్ని టినీ కలిపి గ్రేటర్ నాగాలాండ్ ఏర్పాటు చేయాలన్నది నాగాల ప్రధాన డిమాండ్. నాగాల ఉద్యమానికి నాయ కత్వం వహిస్తున్న నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగా లాండ్ (ఎన్ఎస్సీఎన్-ఐఎం) సహా అనేక సంస్థలు దీని కోసం పోరాడుతున్నాయి. అస్తిత్వం కోసం సాయుధ పోరాటమే శరణ్యమంటూ యువత ఉగ్రవాద బాట పడుతున్నది. సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం జరిపిన ప్రయత్నాలేవీ ఇప్పటివరకూ ఫలితాలివ్వలేదు. గ్రేటర్ నాగాలాండ్ ఆచరణసాధ్యం కాదని గతంలో జరి గిన అనేక ప్రయత్నాలు రుజువుచేశాయి. అడపాదడపా కాల్పుల విరమణ ఒప్పందాలు మినహా పదేళ్లుగా కేంద్రం లోని యూపీఏ ప్రభుత్వం కూడా సాధించిందేమీ లేదు. దాంతో ఆందోళనకారులు, ఉగ్రవాదులు ఈశాన్య రాష్ట్రా లలో హింస సృష్టిస్తూనే ఉన్నారు. 2010లో మూడు నెలల పాటు సాగిన మణిపూర్ ఆర్ధిక దిగ్బంధం ఆ రాష్ర్ట ప్రజ లను అష్టకష్టాల పాల్జేసింది. అసోం, అరుణాచల్ప్రదే శ్లకు పొరుగున ఉన్న ఇతర రాష్ట్రాలతో రహదారి మార్గా లున్నాయి. కానీ మణిపూర్‌కు మాత్రం అలా ప్రత్యామ్నా యాలు లేవు. ఒకవైపు నాగాలాండ్, మరోవైపు అసోంలో నాగాలు నివసించే ప్రాంతాలు.. మణిపూర్‌ను దిగ్బంధిస్తు న్నాయి. దాంతో మిజోరం మినహా మరో వైపు వెళ్లడానికి దానికి మార్గం లేదు. అందువల్ల నాగాల ఆందోళనలకు మణిపూర్ ఎక్కువగా నష్టపోతున్నది. ఆర్థిక దిగ్బంధన సమయంలో కూరగాయలు, కోడిగుడ్లకు కూడా కటకటలా డాల్సిన పరిస్థితి తలెత్తింది. అన్ని నిత్యావసరాల ధరలు 300 శాతం పెరిగిపోయాయి. లీటర్ పెట్రోలు రు.170, వంటగ్యాస్ సిలెండర్ రు.2,000 పలికాయి. అందుకే ఈశా న్యాన ఎలాంటి ఆందోళన జరిగినా మణిపూర్ చిగురు టాకులా వణికిపోతుంటుంది.ఆందోళనకారులు బంద్ చేసినా, ఉగ్రవాదులు బాంబు పేల్చినా కేంద్రంలోగానీ, రాష్ర్టంలోగానీ ఎలాంటి చలనమూ ఉండదు. ...అందుకే ఈశాన్యం కాదది అంతులేని శూన్యం. -పోతుకూరు శ్రీనివాసరావు