ఒమర్ షరీఫ్
బెల్లించే నవ్వు, నిలదీసే ఉడుకుమోత్తనం, సహజమయిన పెంకెతనం, ఆకర్షణీయంగా కనిపించే దురాశ - ఇవన్నీ పలకాలంటే అక్కడ ఒమర్ షరీఫ్ నిలుచుంటే చాలు. ‘మెకన్నాస్ గోల్డ్’లో ఆయన పాత్ర ఒక బంగారు గని అంటాను నేను.
నా నట జీవితంలో నాకు బాగా కలసివచ్చింది నా ముఖం. ఇది నాకు ముందుగా తెలియదు. సహజంగా చిన్న చిలిపితనం, పెంకెతనం కలసి వచ్చే ముఖం. అందుకనే ఈ ముఖానికి ‘దుర్మార్గపు’ ఛాయ ల్ని మప్పితే ఒక కొత్త రసా యనం తయారయింది. అది నా నటజీవితానికంతటికీ పెట్టుబడి. నా ‘ఇంట్లో రామ య్య-వీధిలో కృష్ణయ్య’ కన్నడంలో ఫెయిలయినప్పుడు ‘మీ లాంటి నటులు మా భాషలో లేరన్నాడు’ ప్రముఖ కన్నడ హాస్యనటుడు ద్వారకేష్. ఆయన ఉద్దేశం- దుర్మార్గానికి హాస్యాన్ని జతచేసే నటుడు లేడని. కాని ప్రపంచ సినీరంగంలోనే అలాంటి గొప్ప నటుడు ఒకా యన ఉన్నాడు. ఆయన ఈ మధ్యనే తన 83వ యేట కన్నుమూశారు. ఆయన పేరు ఒమర్ షరీఫ్. అతి సహజమయిన పెంకెతనం అతని ముఖంలో పలికినట్టు నాకు మరే నటుడిలోనూ కనిపించదు. అలాంటి మరో గొప్ప నటుడు పీటర్ ఓ టూల్. విశేషమే మిటంటే వీరిద్దరూ మంచి మిత్రులు. ఇద్దరూ కలిసి డేవిడ్ లీన్ గొప్ప చిత్రం ‘లారెన్స్ ఆఫ్ అరేబియా’లో పనిచేశారు.
మిత్రుడు గిరిబాబు ‘ది గుడ్ బాడ్ అండ్ అగ్లీ’ తెలుగు అనుసరణని (మెరుపుదాడి) తీస్తున్నప్పుడు ‘అగ్లీ’ పాత్రకి ఎంపిక చేశాడు. ఆ రోజుల్లో పాత్రీకరణ లకు ముందుగా మేకప్‌లు చేయించి పాత్రలను గుర్తు పట్టే పని దర్శకుడు గిరిబాబు చేశాడు. ఇంగ్లిష్ సిని మాలో మరో గొప్ప నటుడు ఎలీ వాలాక్ ఆ వేషాన్ని చేశాడు. ఎలీ వాలాక్ బాగా నటించాడు. కాని - నటిం చాడు. అక్కడ ఒమర్ షరీఫ్ ఉంటే పాత్రలో కూర్చుం టాడు. నేను ఆ చిత్రమంతా ఒమర్ షరీఫ్‌నే మనస్సులో నిలుపుకున్నాను.
బెల్లించే నవ్వు, నిలదీసే ఉడుకుమోత్తనం, సహజ మయిన పెంకెతనం, ఆకర్షణీయంగా కనిపించే దురాశ - ఇవన్నీ పలకాలంటే అక్కడ ఒమర్ షరీఫ్ నిలుచుంటే చాలు. ఆయన గ్రీస్ దేశస్థుడు. అతనికి చాలా భాషలు వచ్చును. ఇంగ్లిష్ అంతంత మాత్రంగానే వచ్చును. అందులో పరాయి యాస ఉంటుంది. స్వభావంలో మనం అంగీకరించలేని లక్షణాన్ని మన భాష కాని ఒక ్ఛ్టజిజీఛి నటుడు మాట్లాడితే? ఆ పాత్రకి కొత్త రుచి వస్తుంది. ఇంగ్లిష్‌ని పరాయి భాషలాగ, పరాయి భాష అని గుర్తు చేస్తూనే మాట్లాడుతూ ౌఠ్టటజీఛ్ఛీటగా కనిపిం చే ఒమర్ షరీఫ్ తెరమీద కనిపిస్తే చాలు ప్రయత్నం లేకుండా పాత్రని పలికించేవాడు. ‘మెకన్నాస్ గోల్డ్’లో ఆయన పాత్ర ఒక బంగారు గని అంటాను నేను.
తను ప్రేమించిన అమ్మాయి - ఈజిప్ట్ నటీమణి ఫతే హమామా కోసం మతం మార్చుకుని ఇస్లాం మతా న్ని పుచ్చుకున్నాడు. పేరూ మార్చుకున్నాడు. ఆనాటి ఈజిప్ట్ నాయకులు నాసర్ విధించిన ప్రయాణపు ఆం క్షల వల్ల తన దేశానికి దూరంగా ఉన్నాడు. ఒక కొడుకు పుట్టాక తన జీవనం కారణంగా వివాహం దెబ్బతింది. దాదాపు ఎక్కువ భాగం విదేశాలలో హోటళ్లలో గడి పాడు. హాలీవుడ్‌లో ఆయన విజయాల గురించి ప్రశ్నిం చినపుడు ‘అది సంతోషమే. అయినా నేను నా దేశాన్ని, నా ప్రజలను నష్టపోయాను. నన్ను జీవితంలో బాధిం చిన ఒకే ఒక్క పెద్ద శాపం - ఒంటరితనం’ అన్నాడు. అయితే హమామా, షరీఫ్ జీవితమంతా స్నేహితులు గానే ఉన్నారు.
రష్యా విప్లవం నేపథ్యంగా, నోబెల్ బహుమతిని పుచ్చుకున్న బోరిస్ పాస్టర్ నాక్ ‘డాక్టర్ ఝివాగో’ని ఎవరు మరచిపోగలరు? ఆనాటి ప్రముఖ గాయకురాలు బార్బరా స్ట్రీసాండ్ మొదటిసారిగా నటించిన ‘ఫన్నీ గర్ల్’లో నటించి ఈజిప్టు ప్రభుత్వం కోపాన్ని కొని తెచ్చు కున్నాడు. తర్వాత ఆమె ప్రేమలో పడ్డాడు. పడ్డానని తనే చెప్పుకున్నాడు. ఒమర్ షరీఫ్ ప్రపంచంలో 50 మంది గొప్ప బ్రిడ్జి ఆటగాళ్లలో ఒకరు. ఫ్రాన్స్‌లో కేసీనోలలో పేకాట టేబిళ్ల దగ్గర తరుచుగా దర్శనమిచ్చే వ్యక్తులలో ఒమర్ ఒకరు. ఆయన్ని రెండు రకాల అభిమానులు దర్శించేవారట. నటుడిని, అంతకన్నా ఎక్కువగా పేకాట (బ్రిడ్జ్) నిపుణుడిని.
చివరి రోజుల్లో ఒమర్ షరీఫ్ కెయిరోలో ఒక్కగా నొక్క కొడుకు దగ్గర గడిపారు. (ఆయన కొడుకు తారీఖ్ ఎల్ షరీఫ్ ‘డాక్టర్ ఝివాగో’లో ఎనిమిదేళ్ల చిన్న హీరోగా నటించాడు.) ఆయనకి ఇద్దరు మనుమలు - ఒమర్, కరీమ్. ఒమర్ జూనియర్‌కి ఇప్పుడు 32. అత నూ తాత అంత అందమయిన నటుడు. ఈ సంవత్సరం తొలి రోజుల్లోనే భార్య హమామా కన్నుమూసింది. చివరి రోజుల్లో ఒమర్‌కి అల్జీమర్స్ (వణుకు) వ్యాధి వచ్చింది. గతాన్ని మరిచిపోయేవాడు. మొన్న 12న తన 83వ యేట ఒమర్ షరీఫ్ కన్నుమూశాడు. మా యిద్దరికీ మరో సామ్యం - మేమిద్దరం లెక్క లు, భౌతిక శాస్త్రంలో పట్టభద్రులం. అయితే నేను కేవ లం లెక్కల మనిషిని. ఆయన లెక్కల్లో మనిషి.
- గొల్లపూడి మారుతీరావు