దొంగల జోడీ... సంపద దోపిడీ | opinion | Sakshi
Sakshi News home page

దొంగల జోడీ... సంపద దోపిడీ

Published Fri, Aug 19 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

opinion

సమకాలీనం
రాజకీయ అవినీతి, అధికారుల అవినీతి మన వ్యవస్థను పట్టిపీడిస్తున్నాయి. విధాన నిర్ణ యాలు, అమలు, ప్రాజెక్టులు, అభివద్ధి, సంక్షేమం తదితర కార్యక్రమాలకు సంబంధించి అత్యున్నత స్థాయి నుంచే అవినీతి మొదలవుతోంది. అడ్డదారి నేతలు, అంటకాగే అధికా రుల ప్రయోజనాలు కలగలసిపోయి అవినీతి తారస్థాయికి చేరుతోంది. నేతలు ప్రతి ఐదేళ్ల కోసారి ప్రజాతనిఖీకి వెళ్తుంటారు. కానీ, తప్పుచేసిన అధికారులకు.. బదిలీలు, సస్పెన్షన్ల వంటి చిన్న శిక్షలు తప్ప జరిగే నష్టమేమీ లేదని, అదే వారి ధీమా అని విశ్లేషకుల మాట.
ఓ పోలీసు ఉన్నతాధికారిని పట్టపగలు హతమార్చిన హంతకునితో జతకట్టి, అవినీతి పునాదులపై పోలీసులే నేర సామ్రాజ్యాన్ని నిర్మిస్తారు. ఏజెన్సీ ప్రాంతంలో సేవలందిస్తున్న ఓ యువ ఐపీఎస్‌ అధికారి అర్థంకాని ఒత్తిళ్ల మధ్య నలిగి అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకుంటే... రెండు నెలలవుతున్నా కారణాలు తెలియవు. పోలీసు పెద్దల పురమాయింపులు, వసూళ్ల ఒత్తిళ్లు భరించలేక దేశ సైనికుడిగా సేవలందించి వచ్చిన ఓ యువ ఎస్సై సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకు చస్తాడు. ఇవి మన ఆంతరంగిక భద్రతా విభాగంలో వెలుగుజూస్తున్న తాజా పరిణామాలు. కొత్త సినిమా కథలా ఉన్నా ఇవి  కఠోర వాస్తవాలు. ప్రజాస్వామ్యం ముసుగులో సామాన్యునికి తగిలే ఈ దెబ్బల బాధితులే తప్ప బాధ్యులుండరు. నీతికీ, నియమాలకూ నీళ్లొదిలి అడ్డదా రులు తొక్కేవారికి సంపదే తప్ప సమస్యలుండవు. దుర్ఘటనల జనాసక్తికర కథనాలే తప్ప అధికార వ్యవస్థ జవాబుదారీతనంసున్నా! ఎందుకిలా జరుగు తోంది? ఒక్కమాటలో చెప్పలేం. చాలా కాలంగా పోలీసు తదితర కీలక ప్రభుత్వ శాఖల్లో, దారితప్పిన రాజకీయ మంత్రాంగంతో జోడీకట్టే అధికార యంత్రాంగం పుణ్యమానిప్రభుత్వ వ్యవస్థలన్నిటా బలపడుతున్న అవినీతి విశంఖలతకు ఇవి మచ్చుతునకలు. ఇంకా లోతుల్లోకి వెళితే గగుర్పాటు కలిగించే అరాచకాలు, అన్యాయాలు యథేచ్ఛగా సాగుతుంటాయి. ఆశ్చర్యం కలిగించే వింత కథనాలూ ఉంటాయి. పాలనావ్యవస్థల్ని కేన్సర్‌లా కమ్ము కుంటున్న అవినీతి సగటు మనిషి జీవితపు ప్రతి పార్శా్వన్నీ తాకుతోంది. మనిషి నిత్యజీవితంతో విడదీయరాని బంధమున్న పలు కీలక విభాగాల్లో లంచాల ‘సరఫరా గొలుసులు’న్నాయి. అట్టడుగు స్థాయిలో ఎవరో వసూళ్లు చేస్తారు, పై మెట్లలోని అధికారులకి లెక్కల ప్రకారం వాటాలందుతాయి. ఈ శంఖలంలో ఇమిడితే సరేసరి, లేదంటే స్వయంగా తప్పుకోవాలి లేదా తప్పి స్తారు. రెండూ జరక్కపోతే ఓ శశికుమార్‌లాగో, ఓ ఆర్కేరెడ్డిలాగో హతమై పోయే పరిస్థితులు కల్పిస్తారు. చిన్నప్పట్నుంచి ఎంతో శ్రమించి, ఎన్నో ఆశయాలతో వచ్చిన వారు కూడా వ్యవస్థీకతమైన ‘అవినీతి’ చేతిలో ఓడిపో తున్నారు. అర్థంతరంగా  బతుకు చాలిస్తున్నారు. వారిని కాపాడుకోవాల్సిన అవసరముంది, దీనిపై విస్తత స్థాయిలో చర్చ జరగాలి. పౌర సమాజంలో ఇంకా చలనం రావట్లేదు. ఆసక్తికర కథనాల్ని వింటూ, నెమరేస్తారు, ముచ్చటి స్తారు... ఒకటి రెండు రోజులాగి మరో కథ!
ఎందుకీ దురాగతాలు?
మెదక్‌ జిల్లా కుకునూర్‌పల్లి ఎస్సై రామకష్ణారెడ్డి సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చు కొని చనిపోవడానికి ముందు... పై అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేకపోతు న్నాను, వారు నిర్దేశించిన ‘వసూళ్లు’ తన వల్ల కావట్లేదు, అందుకే చని పోతున్నానని రాసి పెట్టి మరీ పోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే కేసు నమోదు చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దర్యాప్తు చేస్తున్నాం, ఆధారాలుంటే కేసు నమోదు చేస్తామని పోలీసు లంటున్నారు. ఒక ఎస్సై లంచాల వసూళ్ల గొలుసులో ఇమడలేక బలైపోవడం వల్ల బయటపడ్డ వ్యవహారం ఇది. అంతర్గతంగా ఇలాంటి ‘వసూళ్లు–ఒత్తిళు’్ల చాలా చోట్ల జరుగుతున్నవే! పోలీసుతోపాటు రెవెన్యూ, ఎక్సైజ్, పౌర సరఫరాలు, స్టాంపులు – రిజిస్ట్రేషన్లు, మున్సిపల్, వాణిజ్యపన్నులు... ఇలా చాలా విభాగాల్లో లంచాల వ్యవహారం బహిరంగ రహస్యమే. ‘ఈ దందాకు ఇంత’ అని జులుం చేసి మరీ లంచాలు గుంజుతారు. అధికారి స్థాయినిబట్టి ఎవరి వాటాలు వారికందుతాయనీ చెబుతారు. ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు– చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న యువ ఐపీఎస్‌ అధికారి కె. శశికుమార్‌ (30) ఇలాగే సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకు చనిపోయి దాదాపు రెండు నెలలు కావస్తోంది. అనుమానాస్పద మతి అని కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. మరణం ముందు వారం రోజులుగా ఒత్తిడికి గురవుతున్నట్టు, విధులకు న్యాయం చేయలేకపోతున్నట్టు సన్నిహితులతో ఆయనన్నట్టు ఓ కారణాన్ని ప్రచారంలోకి తెచ్చారు. ఇక్కడి అధికారులెంత భయపెట్టారో, ఏమో... తమ కుమారుడు అంతటి దుర్బలుడు కాదని ఆయన తల్లిదండ్రులు తమిళనాడుకు వెళ్లిన తర్వాత విలేకరులతో చెప్పారు. విశాఖ ఏజెన్సీపై పట్టున్న గంజాయి లాబీ నుంచి వచ్చిన ఒత్తిళ్లే ఆయన మతికి కారణమై ఉంటాయనే అభి ప్రాయం బలంగానే వినవస్తోంది. తప్పుడు రాజకీయ నాయకులు, దారి తప్పిన అధికారులు చేతులు కలిపిన చోట అన్ని స్థాయిల్లో అవినీతి రాజ్య మేలుతోంది. వారి ఆగడాలకు అంతుం డటం లేదు. ఒకప్పుడు లంచాలంటే.. నిబంధనలకు విరుద్ధంగా, తప్పుడు పద్ధతిలో పని చేయించుకోడానికి కొంత సొమ్మును చాటు మాటుగా ‘వసూల్‌ రాజా’లకు చెల్లించేవారు. కానీ, ఇప్పటి పద్ధతి వేరు. చట్టానికి లోబడి, నిబంధనల ప్రకారం జరగాల్సిన పనులు కూడా అధికారుల, వారి ఏజెంట్ల చేయి తడపకుండా, పర్సంటేజీలు చెల్లించకుండా జరుగవు. ప్రభుత్వ ఉద్యో గులంతా ఇంతే అని కాదు. మంచి వారు, నిజాయితీపరులూ ఉంటారు. కాకపోతే, కాలక్రమంలో ఈ మంచి – చెడుల శాతాలు తిరగబడుతున్నాయి. ఉద్యోగుల్లోనే నైతిక విలువలు లోపించడం, అవినీతికి అడ్డూ అదుపూ లేక పోవడం, తప్పులు తేటతెల్లమైనా తగు చర్యలు లేకపోవడం, ప్రభుత్వాల ‘ఉద్యోగులతో స్నేహపూర్వక వైఖరి’, దాన్ని సానుకూలంగా మలచుకొని కొల్ల గొట్టే అవినీతి అధికారుల తత్వం.. ఇలాంటివన్నీ ఇందుకు కారణమవు తున్నాయి.
అపవిత్ర కలయికే అసలు కారణం
రాజకీయ అవినీతి, అధికారుల అవినీతి మన వ్యవస్థను ప్రధానంగా పట్టి పీడిస్తున్నాయి. విధాన నిర్ణయాలు, అమలు, ప్రాజెక్టులు, అభివద్ధి–సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి అత్యున్నత స్థాయిలోనే రాజకీయ యంత్రాంగం అవినీతికి పాల్పడటం తరచూ వివాదా స్పదమౌతోంది. తమ అధికారాన్ని నిరంతరం కొనసాగించడానికి, ఆధి పత్యం చెలాయించడానికి కార్యనిర్వాహక వ్యవస్థను గుప్పిట్లో ఉంచుకునే క్రమంలో వారు అధికారులకు అనుచిత ప్రయోజనాలు కల్పిస్తూ అవినీతిపరు లను చేసే సందర్భాలూ ఉంటాయి. చట్టాల్లో లొసుగుల్ని చూపిస్తూ, తప్పుల్ని మరుగుపరుస్తూ... రకరకాలుగా రాజకీయ నేతలకు అవినీతి అధికారులు దన్నుగా ఉంటారు. వారి ఇష్టానుసారం బదిలీలు, పోస్టింగులు, కేసులు ఎత్తి వేత, మినహాయింపులు ఇప్పిస్తూ నేతలు వారికి అండగా నిలుస్తారు. అటు నేతలు, ఇటు అధికారులు పరస్పరం ప్రయోజనం పొందుతూ చేస్తున్న నిర్వా కాలతో అవినీతి తారస్థాయికి చేరుతోంది. రాజకీయ అవినీతి వల్ల పోగయ్యే డబ్బులో కొంతయినా ఎన్నికలప్పుడు తిరిగి ప్రజాబాహుళ్యంలోకి వస్తోంది, ప్రతి అయిదేళ్లకోసారి ఎన్నికల రూపంలో వారు ప్రజాతనిఖీకి వెళ్తుంటారు. కానీ, అధికారులు అవినీతికి అలవాటు పడితే... బదిలీలు, తాత్కాలిక సస్పె న్షన్లు వంటి చిన్న చిన్న శిక్షలుంటాయేమో తప్ప పదవీ విరమణ వరకు వారి దురాగతాలకు అడ్డు అదుపూ ఉండదని విశ్లేషకులు చెబుతుంటారు. లంచాలు తీసుకుంటూ ఏసీబీ కేసుల్లో ఇరుక్కున్న అధికారులు సైతం... తదనంతర దశల్లో ఉన్నతాధికారులకో, నేతలకో పెద్ద మొత్తాల్లో లంచాలిచ్చి సదరు కేసుల్ని ఉపసంహరింపజేసుకుంటున్న ఉదంతాలూ ఉన్నాయి. రూ. 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి, సదరు కేసు విరమింప జేసు కోవడానికిచ్చే రెండు, మూడు లక్షల్లో కొంత వాటా సహకరించిన మంత్రికీ వెళుతుందని ఉద్యోగులే అంటున్న మాట.
సహజ సంపద కొల్లగొడుతున్న తోడు దొంగలు
రాజకీయ, అధికార వ్యవస్థలు కూడబలుక్కుని జరిపే సహజ వనరుల దోపిడీ మరింత ప్రమాదకరమైంది. భవిష్యత్తరాలకు శాపంగా పరిణమిస్తున్న వీరి జమిలి నిర్వాకాల్లో ఎర్రచందనం, ఇసుక, ఇతర ఖనిజ సంపద దోపిడీ అత్యంత ప్రమాదకరమైంది. ప్రకతి భవిష్యత్తునే వీరు పణంగా పెడుతు న్నారు. దానికి తోడు, ప్రాజెక్టుల్లో వాటాలు, అక్రమ నిర్మాణాలు, దొంగ సరుకు రవాణా, కల్తీలు, ప్రజా పంపిణీ సరుకుల దారి మళ్లింపులను ప్రోత్సహించడం వంటివి వారికి ఇబ్బడి ముబ్బడిగా రాబడి తెచ్చిపెడు తుండటంతో ఈ అపవిత్ర కలయిక మరింత బలపడింది. ఆశయాలు, లక్ష్యాలతో పనిచేయాలనుకునే యువ ఉద్యోగులకు స్థానం లేకుండా చేస్తున్నారు. కాలక్రమంలో వారిని తమలో కలిపేసుకొని అవినీతిపరు ల్నయినా చేస్తారు, లేదంటే ప్రాధాన్యత లేని స్థానాల్లోకయినా బదిలీ చేయి స్తారు. ఇదేదీ కుదరకపోతే, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిళ్లు పెంచి ఉద్యో గంలోంచో, కడకు జీవితాల్లోంచో వైదొలగే పరిస్థితులు కల్పించి తమ అడ్డు తొలగించుకుంటారు. ప్రజలు కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మును, పౌరుల ఉమ్మడి సహజ వనరుల్ని ఈ అవినీతిపరులు దోచేస్తున్నారు. ఇసుక అక్రమ తరలింపుదారుల నుంచి రెవెన్యూ, పోలీసు, రవాణా శాఖల అధికారులు పెద్ద మొత్తాల్లో మామూళ్లు వసూలు చేస్తున్నారనడానికి ఇటీవలి గజ్వేల్‌ తాజా ఉదంతమే నిలువెత్తు నిదర్శనం. పోలీసు శాఖలో కింది ఉద్యోగుల పనితీరు గురించి వారి పై అధికారులిచ్చే వార్షిక రహస్య నివేదిక (ఏసీఆర్‌)లే కీల కమైనవి. చెప్పింది వినకుంటే ఏం రాస్తారో? అనే భయం, నోరువిప్పితే ‘యూనిఫామ్‌ సర్వీసు’ ఉద్యోగులుగా క్రమశిక్షణా చర్యలకు గురి కావాల్సి వస్తుందనే భయం.
తగు శిక్షలు లేకే తప్పులు పునరావతం
అవినీతి అధికారుల్ని శిక్షించే వ్యవస్థలు సరిగా లేవు. లోకాయుక్త, ఏసీబీ, విజిలెన్స్, మానవ హక్కుల సంఘం వంటివి ఆచరణలో ఎంతో బలహీనంగా ఉండటం అవినీతి అధికారులకు ఆటవిడుపుగా మారింది. ఎవరికీ పెద్దగా శిక్షలు పడటం లేదు. అందుకే బలమైన లోక్‌పాల్‌ వ్యవస్థను పౌర సమాజం కోరుకుంది. ‘ట్రాన్స్‌ఫరెన్సీ ఇంటర్నేషనల్‌’ పౌర సంస్థ ఆధ్వర్యంలో ఏడాది కింద మలేషియాలో సమావేశమైన 16వ ‘అవినీతి వ్యతిరేక అంతర్జాతీయ సదస్సు’ భారత్‌లో పరిస్థితిపై అసంతప్తి వ్యక్తం చేసింది. అవినీతి వ్యతిరేక విధానాలు, సంప్రదాయాలు, పద్ధతులు కాగితాల్లోనే తప్ప ఆచరణలో ఉండవని పేర్కొంది. కర్ణాటకలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న డీఎస్పీ ఎమ్‌.కె. గణపతి తన సుసైడ్‌నోట్‌లో ప్రస్తావించిన మంత్రి కె.జె. జార్జి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని ఆయన కుటుంబీకులు కోరినపుడు, స్థానిక కోర్టు అలాగే ఆదేశాలిచ్చింది. దాంతో, కేసు నమోదయింది, మంత్రి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. కానీ, ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరును చేర్చడానికి పోలీసులు ససేమిరా అంటున్నారు. ఇంకా విచిత్రంగా, చని పోతూ ఎస్సై రామకష్ణారెడ్డి ఏ పోలీసు అధికారిపై ఫిర్యాదు చేశాడో ఆయనే ఆ కేసు ఎఫ్‌ఐఆర్‌ తయారు చేశాడు. ఎస్సై చచ్చిపోతూ ఎలుగెత్తిన దురా గతాలపై విచారణకు నియమించిన ఏఎస్పీ స్థాయి దర్యాప్తు అధికారికి, రామకష్ణారెడ్డి అభియోగాలు మోపిన వివిధ స్థాయి పోలీసులు వసతులు కల్పిస్తూ సహకారం అందించనున్నారు. ఇదీ, మన దగ్గర జరిగే  ధృతరాష్ట్ర నీతి!

దిలీప్ రెడ్డి

ఈమెయిల్‌: dileepreddy@sakshi.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement