సర్వేల నిషేధం మీద శ్రీరంగనీతులు | Political Parties seek ban on opinion polls | Sakshi
Sakshi News home page

సర్వేల నిషేధం మీద శ్రీరంగనీతులు

Published Tue, Nov 12 2013 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 12:31 AM

సర్వేల నిషేధం మీద శ్రీరంగనీతులు

సర్వేల నిషేధం మీద శ్రీరంగనీతులు

‘ఇప్పుడు ఎన్నికలు జరిగితే....’ అన్న షర తు మీద ఫలితాల సర్వేలు వెలువడతాయి. వీటి మీద రాజకీయ పార్టీలకీ, వాటి నేతలకీ ఉన్న అభిప్రాయాలు ఎప్పుడూ ఒకే విధంగా కనిపించవు. ఒపీనియన్ పోల్స్ పేరుతో పిలిచే వీటి మీద రాజకీయుల ఒపీనియన్స్ ‘ఛేంజ్’అవుతూనే ఉన్నాయి. ఇరవయ్యేళ్లుగా అసెంబ్లీలు, లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా క్రమం తప్పకుండా సర్వేలు సాక్షాత్కరి స్తూనే ఉన్నాయి.

ఈ సర్వేలను నిషేధించాలని తాజాగా కాంగ్రెస్ నినాదం అందుకుంది. ఈ నెల మొదటివారంలో ఈ ప్రయత్నాలు మొదల య్యాయి. ఈ సూచన అటార్నీ జనరల్ గులాం ఇ  వాహనవతి చేసినదేనని వార్తలు వచ్చాయి. యూపీయే ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ ఈ ప్రకటన చేయగానే, కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఆ అంశాన్ని ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఆలస్యం లేకుండా నివేదిం చింది. ఆగమేఘాల మీద ఈసీ అన్ని పార్టీల అభిప్రాయాలను కోరింది. సీపీఐ మినహా అన్ని జాతీయ రాజకీయ పక్షాలు మనోగ తాన్ని వెల్లడించాయి. తొమ్మిది ప్రాంతీయ పార్టీలు కూడా చెప్పాయి. వింతేమిటంటే, ఎక్కువ పార్టీలు నిషేధానికి అనుకూలమే. కాంగ్రెస్‌తో పాటు డీఎంకే, ఎస్పీ, బీఎస్పీలు నిషేధించమంటున్నాయి. బీజేపీ మిత్రపక్షం అకాలీదళ్ కూడా ఇదే మంచిదని చెబుతోంది. కానీ బీజేపీ మాత్రం సర్వేల నిషేధం అంటే భావప్రకటనా స్వేచ్ఛ మీద వేటువేయడమే నని ఇప్పుడు ఎలుగెత్తి చాటుతోంది. రాజ్య సభలో బీజేపీ నాయకుడు అరుణ్‌జైట్లీ ‘పరాజి తులు నిషేధం కోరతారు’ అని సూత్రీకరించారు.

ఇదంతా అక్కసుతో చేస్తున్నదేనని అను కోవడానికి ఏమాత్రం సందేహించనక్కరలేని సమయంలో కాంగ్రెస్ ఈ ప్రతిపాదన తెచ్చిం ది. ఆ పార్టీకి ఏ దిశ నుంచీ ఆశాకిరణం కని పించడంలేదు. ఉత్తరప్రదేశ్‌లో రెండు దశా బ్దాల నుంచీ, బీహార్‌లో 1990 నుంచి ఆ పార్టీ అధికారంలో లేదు. గుజరాత్‌లో మూడు దశా బ్దాల నుంచి ఆ పార్టీ ఆధిక్యం సాధించలేకపో తోంది. తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెం గాల్, పంజాబ్‌లలో మళ్లీ బతికి బట్టకట్టే అవ కాశం దరిదాపుల్లో లేదు. ఇప్పుడు మధ్య ప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలలో ఓడిపోతే వరసగా మూడోసారి బీజేపీకి అధి కారం అప్పగించినట్టే. ఎంపీతో పాటే  జరుగు తున్న ఇంకో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక లలో రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ బీజేపీ కాతాలోకి పోయేవేనని సర్వేలు చెప్పాయి. ఢిల్లీ బీజేపీకి దక్కడం అనుమానం. అలాఅని ఢిల్లీని కాం గ్రెస్ కాతాలో సర్వేలు వేయలేదు. ఇంకా  2014 లోక్‌సభ ఎన్నికలలో యూపీయే వెనుక బడి, ఎన్‌డీఏ ముందంజలో ఉండవచ్చునని సర్వేలు ఘోషించాయి. ప్రధాని అభ్యర్థిత్వం లో రాహుల్ కంటె మోడీ ముందంజలో ఉన్న ట్టు చెప్పి సర్వేలు పుండు మీద కారం రాశాయి.
 
ఈ ఉక్రోషంతోనే కాంగ్రెస్ సర్వేల మీద ధ్వజమెత్తుతున్నదని బీజేపీ విశ్లేషిచింది. పరా జితులే నిషేధాన్ని కోరతారన్న జైట్లీ మాట స్వీయానుభవంతో చెప్పిందేనని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ మాటతో అర్థమవుతుంది.  ఏప్రిల్ 4, 2004న అప్పటి న్యాయశాఖ మంత్రి జైట్లీ, బీజేపీ సర్వేల నిషే ధాన్ని కోరిన సంగతిని మరిచిపోతే ఎలా అని సిబాల్ చురక వేశారు. ఎన్నికల సంఘం మాజీ కమిషనర్లు టీఎస్ కృష్ణమూర్తి, ఎన్. గోపాలస్వామి కూడా ఆ సంగతి వెల్లడిం చారు. అంటే కాంగ్రెస్, బీజేపీ రెండూ ఈ అం శంలో పిల్లిమొగ్గలు వేస్తున్నాయి.


 మన దేశంలో 1957 ఎన్నికలకు ముందు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీని యన్ సంస్థ మొదటిసారి సర్వే నిర్వహిం చింది. ఎరిక్ డాకోస్టా దీని అధిపతి. నిజానికి 1824 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలలో జాన్ క్విన్సీ ఆడమ్స్ మీద ఆండ్రూ జాక్సన్‌కు ఆధిక్యం సాధిస్తాడని హారీస్‌బర్గ్ పెన్సిల్వేనియా అనే సర్వే సంస్థ వెల్లడించింది. తొలిరోజులలో సర్వేలంటే అభ్యంతరాలు లేని కాంగ్రెస్‌పార్టీకి  ఇప్పుడు ఏవగింపు ఎందుకని బీజేపీ నాయ కుడు రాజీవ్ ప్రతాప్ రూడీ ప్రశ్నిస్తున్నారు. దీని మీద కాంగ్రెస్ ప్రముఖుడు దిగ్విజయ్ సింగ్ తనదైన శైలిలో వాదిస్తున్నారు. ఎంపీలో మూడు కోట్ల మంది ఓటర్లు ఉంటే, 2800 మందిని మాత్రమే సంప్రతించి, అదే మొత్తం ఓటర్ల మనోగతమని చెబితే ఎలా అంటున్నా రాయన.

 గతంలో తాను ఒక సర్వే సంస్థతో సంప్రతించానని, సొమ్ము ఇస్తే కాంగ్రెస్ అను కూల సర్వేలు రూపొందిస్తామని చెప్పారని, వీటి విశ్వసనీయత ప్రశ్నార్థకమేనని కూడా దిగ్గీరాజా చెప్పారు. ఈ వ్యాఖ్యను ‘సి.ఓటర్’ సంపాదకుడు యశ్వంత్ దేశ్‌ముఖ్ ఎద్దేవా చేస్తున్నారు. భారత ప్రభుత్వ ప్రణాళికలూ, విధానాలూ ఎన్‌ఎస్‌ఎస్‌ఓ అనే సొంత సంస్థ చేసిన సర్వేల ఆధారంగా రూపొందించేవి కాదా? అని ప్రశ్నించారాయన. ప్రస్తుతం సర్వే ల మీద పాక్షిక నిషేధం ఉన్నట్టే. ప్రకటన వెలు వడినాక సర్వేలు నిషిద్ధం. ఏమైనా నిషేధం మీద కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ఈ స్థాయి నిషేధాలకు ఈసీకి విస్తృతాదికారాలు లేవం టూ ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ ఏం చేస్తుందో చూడాలి!
 -డా॥గోపరాజు నారాయణరావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement