ఇప్పటికే భారతదేశంలో వందకోట్లకు పైగా జనాభా పెరిగిపోయి, ఉన్న వారికే సరైన తిండి, బట్ట లేక కోట్లాది మంది అభాగ్యులు అడుక్కుతింటుంటే, మరో వంక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కరు, లేక ఇద్దరు మించి పిల్లలొద్దని అందుకు ఎన్నో ప్రోత్సాహకాలు ప్రక టించి కుటుంబ నియంత్రణను ఉధృత పరుస్తుంటే చంద్రబాబు నాయుడేమిటి ఒకరిద్దరుతో ఆపేయవద్దు కుటుంబ నియంత్రణ పాటించొద్దు గంపెడు పిల్లలను కని తనకు ఓటర్లను పెంచమంటున్నట్లున్నారు. అలాంటి పిలుపునివ్వడం బాధ్యతగల ముఖ్యమంత్రిగా ఆయనకు తగునా?
ఇప్పటికే ఉన్న పిల్లలకే కూడు, గుడ్డ లేక ఆకలితో అలమటిస్తూ రాలిపోతుంటే ఇంకా పిల్లల్ని కనాలా? ఉద్యోగాలు దొరకని ఎంతో మంది యువత పెడమార్గాలు పట్టి ప్రభు త్వాన్నే ఎదిరించే పరిస్థితి ఉంది. పిల్లలను కంటే వారిని ప్రభుత్వం పోషించి చదువు చెప్పించి ఉద్యోగాలిస్తుందా? మరి తనెందుకు ఎక్కువ మందిని కనలేదు. జపాన్‌లో వృద్ధులు ఎక్కువ, యువత తక్కువగా ఉన్నారట. ఈయన వెళ్లింది జనాభా లెక్కల తయారీకా! ఒక వంక రైతుల్ని డ్వాక్రా మహిళలను, ఉద్యోగాలివ్వకుండా యువతను ఉసూరు పెట్టినందుకు, అటు రాజధాని అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరిగినందుకు మైండ్‌సెట్ ఏమైనా తేడా వచ్చిందా అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాంటి విమర్శ లకు తావివ్వకుండా నమ్మిన ప్రజలకు మేలు చేయండి.
- ఎం.సుగుణకుమారి, కేశవరం, తూ.గో. జిల్లా
జపానూ.. జనాభా లెక్కలూ
Published Sun, Feb 1 2015 1:51 AM | Last Updated on Tue, Sep 18 2018 7:56 PM
Advertisement
Advertisement