భావోద్వేగానికి లొంగనిదే న్యాయం | Rights of arrested and detained persons | Sakshi
Sakshi News home page

భావోద్వేగానికి లొంగనిదే న్యాయం

Published Sat, Nov 2 2013 1:24 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

భావోద్వేగానికి లొంగనిదే న్యాయం - Sakshi

భావోద్వేగానికి లొంగనిదే న్యాయం

రాజ్యాంగంలోని అధికరణ 22(1) ప్రకారం - ఎవరినైనా అరెస్టు చేసిన వెంటనే, ఏ కారణాలతో అరెస్టు చేశారో అతనికి తెలియజేయాలి. ఇష్టమైన న్యాయవాదిని సంప్రదించుకునే అవకాశాన్ని కల్పించాలి.
 
‘నిర్భయ’, ‘అభయ’ కేసులు మానవతా వాదులందరినీ బాధిస్తాయి.  భావోద్వేగానికి గురిచేస్తాయి. ఫలితంగా నేరగాళ్ల విషయంలో వారు రాజ్యాంగ వ్యతిరేక, చట్టవ్యతిరేక ప్రక టనలు చేస్తూ ఉంటారు. అభయ కేసు తరువాత నిందితులను కాల్చివేయాలని ఒక నాయకుడు, అంగచ్ఛేదనం చేయాలని ఓ నాయకురాలు ప్రకటించారు. వారి ఆవేశాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ బాధ్యతాయుత మైన పదవుల్లో ఉన్నవారు అలాంటి ప్రకటనలు చేయకూడదు. కొన్నేళ్ల క్రితం యాసిడ్ దాడి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు ‘ఎదు రు కాల్పుల్లో’ చనిపోయారు. దాని ప్రభావం తాత్కాలికమే. ఈ నాగరిక సమాజంలో న్యాయాధిక్యం (రూల్ ఆఫ్ లా) గెలవాలి. మనసుల్లో అనుకున్నట్టుగా శిక్షలు విధిస్తే మనది అనాగరిక సమాజం అయిపోతుంది.
 
 ‘నిర్భయ’, ‘అభయ’ కేసుల లాంటివి, ఉగ్రవాద చర్యలు జరిగినప్పుడు నాయకు లూ, సాధారణ ప్రజానీకంతో పాటు, న్యాయ వాదులూ విచిత్రంగా స్పందిస్తూ ఉంటారు. నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తుల కేసులని వాదించబోమని న్యాయవాదుల సంఘాలు తీర్మానిస్తుంటాయి. దేశవ్యాప్తంగా ఇదే పరి స్థితి. రాజ్యాంగం చదువుకొని, రోజూ శాసనా లని చదువుతూ వ్యాజ్యాలలో వాదిస్తున్న వారు ఇలాంటి తీర్మానాలు చేయడం ఎంత వరకు సమంజసం? పోలీసుల ముందు ఒప్పుకున్నంత మాత్రాన నేరం రుజువైనట్టు కాదు కదా! నేరం రుజువయ్యే వరకు ముద్దా యిని అమాయకుడిగా పరిగణించాలని న్యాయశాస్త్రం చెబుతుంది. వాదించుకోవడా నికి, నడపడానికి న్యాయవాది సాయం లేక పోతే ఆ కేసుకి విలువ ఉండదు. శిక్ష పడినా పై కోర్టులలో నిలవదు. ఈ విషయం గురించి సుప్రీంకోర్టు, రాజ్యాంగం ఏమని నిర్దేశిస్తు న్నాయో చూద్దాం.
 
రాజ్యాంగంలోని అధికరణ 22(1) ప్రకారం - ఎవరినైనా అరెస్టు చేసిన వెంటనే, ఏ కారణాలతో అరెస్టు చేశారో అతనికి తెలియ జేయాలి. ఇష్టమైన న్యాయవాదిని సంప్రదిం చుకునే అవకాశాన్ని కల్పించాలి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన అధ్యాయం -2లోని నియమాల ప్రకారం ఆ న్యాయవాది వచ్చిన కేసుని విధిగా స్వీకరించాలి.  నిరాకరిం చడానికి వీల్లేదు.
 
 ఎ.ఎస్. మహమ్మద్ రఫీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు (ఏ.ఐ.ఆర్. 2011 సుప్రీం కోర్టు 308- తీర్పు తేదీ, 6.12.2010) కేసు విషయాలని పరిశీలించి కోర్టు ఈ ఆదేశాలని జారీ చేసింది. ‘న్యాయవాదుల నీతి నియమాల సూత్రాల ప్రకారం, న్యాయవాది చట్ట ప్రకారం కోరిన ఫీజుని ముద్దాయి గానీ వాది గానీ చెల్లించడానికి ఇష్టపడినప్పుడు ఆ కేసు లని నిరాకరించడానికి వీల్లేదు. అందుకని న్యాయవాదుల సంఘం తీర్మానం చేసినంత మాత్రాన నేరం ఆరోపించిన పోలీసుల కేసు లని, అనుమానిత ఉగ్రవాదుల కేసులని,  హత్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటు న్న వారి కేసులని, మానభంగం ఆరోపణలు ఉన్న వ్యక్తుల కేసులని వాదించడానికి నిరాక రించకూడదు. ఇలాంటి కేసులని స్వీకరించ కూడదన్న తీర్మానాలు రాజ్యాంగ వ్యతిరేకం, శాసన విరుద్ధం, వృత్తి నియమాలకి విఘా తం. అంతేకాదు భారత న్యాయవాదులకి ఉన్న సంస్కృతికి మాయని మచ్చ. అందుకని ఇలాంటి తీర్మానాలు చెల్లవని, శాసన వ్యతిరే కమని ప్రకటిస్తున్నాం. అలాంటి తీర్మానాలని న్యాయవాదులు ఉల్లంఘించాలి. ప్రజాస్వా మ్యాన్ని న్యాయాధిక్యాన్ని కాపాడాలి. ఎలాం టి పరిణామాలు ఎదురైనా న్యాయవాదులు తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి. ఈ విధం గా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించని న్యాయ వాదులు గీతలోని సందేశాన్ని పాటించడం లేదని అనుకోవాల్సి ఉంటుంది’.

న్యాయవాదులు ఈ విషయాలను గుర్తిం చుకోవాలి. 1792లో ‘మనుషుల హక్కులు’ అన్న కరపత్రం రాసిన ధామస్ ఫైన్ మీద బ్రిటిష్ ప్రభుత్వం రాజద్రోహాన్ని  ఆపాదిం చింది. ఆ కేసుని వాదించడానికి థామస్ ఎక్క న్ అన్న ప్రముఖ న్యాయవాది ముందుకొచ్చా డు. అప్పుడు ఆయన ఫ్రిన్స్ ఆఫ్ వేల్స్‌కి అటా ర్నీ జనరల్. కేసు వాదిస్తే ఆ పదవి నుంచి తొలగిస్తామని చెప్పారు. అయినా వాదిం చాడు.  పదవిని కోల్పోయాడు. ఆ సందర్భం లో అతను చెప్పిన మాటలు న్యాయవాదులు గుర్తించుకోవాలి.
 
‘రాజుకీ కోర్టుకీ మధ్య ఉండను అని ఎవ రైనా న్యాయవాది అనుకుంటే ఇంగ్లాండ్‌లో వ్యక్తి స్వేచ్ఛకి ముగింపు వచ్చినట్టే. కేసుని స్వీకరించకూడదని న్యాయవాది అనుకుంటే అతను తీర్పు కన్నా ముందే నిర్ణయానికి వచ్చి నట్టు. ముద్దాయికి వ్యతిరేకంగా త్రాసు మొగ్గి నట్టుగా భావించాల్సి ఉంటుంది.’
 
లక్షలాది మందిని హతమార్చిన నాజీల తరఫున కూడా న్యూరమ్‌బర్గ్ విచారణల్లో న్యాయవాదులు వాదించారు. చరిత్రలో ఇట్లా ఎన్నో. కోర్టుల్లో రుజువైతేనే నేరం చేసినట్టు. ఇప్పుడు కావాల్సింది సత్వర దర్యాప్తు. ఆ తరువాత సత్వర విచారణ. ఇవి రెండూ సత్వ రం జరిగితే న్యాయాధిక్యం నిలుస్తుంది. మరో విధంగా ఉంటే అది సత్‌ఫలితాలను ఇవ్వదు. సరికదా చెడు పరిణామాలకు దారితీస్తుంది.
 
 -మంగారి రాజేందర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement