ఆలూమగల రాజీలో ఆర్టీఐ చెల్లదు | RTI for info regarding legal divorce cases in Indian courts | Sakshi
Sakshi News home page

ఆలూమగల రాజీలో ఆర్టీఐ చెల్లదు

Published Fri, Aug 14 2015 12:24 AM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

ఆలూమగల రాజీలో ఆర్టీఐ చెల్లదు

ఆలూమగల రాజీలో ఆర్టీఐ చెల్లదు

విశ్లేషణ
 అత్యధిక శాతం భార్యాభర్తలకు రాజీ పరిష్కారం అత్యుత్తమం. సలహా సంప్రదింపులలో ఇరుపక్షాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ప్రతిపాదనలు తదితర అంశాలను మరే వివాదంలోకీ తీసుకువెళ్లకూడదు. ఈ గోప్యతే మధ్యవర్తిత్వ రాజీ పరిష్కారానికి ప్రాణం.
 శ్రీమతి అగర్వాల్, భర్తతో తనకున్న వివాదం విషయమై ఢిల్లీ న్యాయ సహాయ కేంద్రంలో మధ్యవర్తి ద్వారా ప్రత్యా మ్నాయ పరిష్కారం కోసమని రాజీ చర్చలు జరిపారు. 1983 లో పెళ్లయిన తనను ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత బల వంతంగా మానసిక చికిత్సాలయానికి తీసుకువెళ్లారని ఆమె ఆరోపించారు. ఈ వివాదాన్ని సలహా సంప్రదింపులకు పంపారు. అవీ విఫలమైనాక కోర్టులో విడాకులు, గృహహింస కేసులు వేశారు. కోర్టులో తన వాదానికి సాక్ష్యాలుగా మధ్యవర్తిత్వ సలహా సంప్రదింపుల వివరాలు కావాలని ఆమె సమాచార హక్కు (సహ) చట్టం కింద కోరారు. అవి గోప్యమై నవని ఇవ్వజాలమని ప్రజా సమాచార అధికారి, ఆపై అధికారి తీర్మానించారు. అప్పీలు సమాచార కమిషన్ ముందుకువచ్చింది. ఈ వివరాలను ధ్రువీకరణ పత్రాలుగా ఇవ్వవచ్చా? ఇది సంక్లిష్ట న్యాయ ప్రశ్న.  
 వివాహ, తదితర వివాదాలు కోర్టుల్లో పరిష్కారం కావడం కష్టం. నిపుణుల సలహాలు, పెద్ద మనిషి మధ్య వర్తిత్వంతో రాజీ కుదుర్చుకోవడం, ఇద్దరూ కూచుని సమస్యల పరిష్కారానికి మాట్లాడుకోవడం వంటి ప్రక్రియలన్నీ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార (ఏడీఆర్) సంస్థల సమ్మతిపై ఆధారపడ్డవి. జాతీయ న్యాయ సలహా సహాయ చట్టం ఇచ్చిన అధికారంతో న్యాయ సహాయ కేంద్రాలలో, మధ్యవర్తిత్వ కేంద్రాల్లో రాజీ ఒప్పందాలు జరుగుతున్నాయి. అయితే ఆర్బిట్రేషన్‌లో కోర్ట్టు తీర్పులా అమలు చేసుకోదగిన అవార్డు లభిస్తుంది. రాజీ చర్చల్లో తీర్పులు, అవార్డులు ఉండవు. మధ్యవ ర్తులు, సలహాదారులు మార్గదర్శనలో కుదిరే రాజీ అంగీకారాలు మాత్రమే ఉంటాయి. ఫలానా విధంగా ఉండా లని భార్యాభర్తలను వారు నిర్దేశించలేరు. ఇలా కుదిరే రాజీ పరిష్కారం కోర్టుల్లో అమలు చేయదగినది కాదు. మధ్యవర్తిత్వ పరిష్కారాన్ని కోర్ట్టు తీర్పులకు సరైన ప్రత్యామ్నాయంగా అన్ని దేశాల్లోనూ వాడుతున్నారు. అయితే సలహా సంప్రదింపుల క్రమంలో ఇరుపక్షాల నుంచి వచ్చిన అభిప్రాయాలు, ప్రతిపాదనలు తదితర అంశాలన్నీ అక్కడే ముగిసిపోవాలి. వాటిని మరే వివా దంలోకీ తీసుకు వెళ్లకూడదు. ఈ గోప్యతే మధ్యవర్తిత్వ రాజీ పరిష్కారానికి ప్రాణం. ఆర్బిట్రేషన్ అండ్ కన్సీలి యేషన్ చట్టం, 1996’లో ఈ గోపనీయతా సూత్రాన్ని చేర్చారు. దానిలో 70, 75, 81 సెక్షన్లు కీలకమైనవి. గోప నీయతే కాదు, ఇక్కడి ప్రతిపాదనలను, కాగితాలను కోర్టుల్లో సాక్ష్యాలుగా అనుమతించరు. మధ్యవర్తిని, పార్టీలను సాక్షులుగా పిలవరాదు. 2004 మధ్యవర్తి త్వం, రాజీ నిబంధనలలోని 20, 21 గోపనీయతను పాటించాలని చెబుతున్నాయి. సుప్రీం, మోతీరాం వర్సె స్ అశోక్ కుమార్ (2010 (14) అడిషనల్ ఎస్‌సీఆర్ 809), హరేశ్ దయారాం ఠాకూర్ వర్సెస్ మహారాష్ర్ట ఏఐఆర్ 2000 ఎస్‌సీ 2281 తీర్పుల్లో పేర్కొంది.
 ఇంటి తగాదాలు తదితర తగాదాల్లో కక్షిదారులు కోర్ట్టుకు వెళితే సీపీసీ ఆర్డర్ 32ఎ కింద రాజీకి ప్రయత్నిం చవచ్చు. సెక్షన్ 89ని సవరించి ప్రత్యా మ్నాయ పరిష్కా రాలకు చట్టబద్ధత కల్పించారు. న్యాయాధికారి పరిష్కా రం సాధ్యమనుకునే  అంశాలలో కక్షిదారులను ప్రత్యా మ్నాయ పరిష్కారాల కోసం పంపవచ్చు. ఆ ప్రక్రియను ఎంచుకుంటే... సాక్ష్యాల తలనొప్పులు, క్రాస్ ఎగ్జామినే షన్ హింస, లాయర్ల క్రూరమైన ప్రశ్నలకు ఆస్కారం ఉండదు. తిక్క నియమాలు వీర విహారం చేయవు. కేసు చదవలేదనే సాకుతో వాయిదాలు వేసే దుర్మార్గాలు సాగవు. కుటుంబంలో హింస భరించలేక కోర్టుకు వచ్చి, అక్కడ కూడా హింసను భరించలేని వారికి ఈ ప్రత్యా మ్నాయం పెద్ద ఊరట. అలాంటి పరిష్కారాలను ప్రోత్సహించడం కోసమే ఈ వివరాలను కోర్ట్టుకు ఈడ్చేందుకు ఒప్పుకోరు. తగాదా పడే కక్షిదారులు పగబట్టిన వారైనా, ససేమిరా దేనికీ అంగీకరించని ధన దురహంకారులైనా రాజీకిరారు. వచ్చినా పరిష్కారానికి ఒప్పుకోరు. అలాంటివారే కోర్టుకు ఈడ్చే ప్రయత్నం చేస్తారు. సామరస్య పరిష్కారం కోరుకునే కోట్లాది సామాన్యులకు గృహహింస కోర్టుల్లో అనుభవించాల్సి వచ్చే హింసల నుంచి రాజీ పరిష్కారం గొప్ప విముక్తి.
 సీపీసీ, ఆర్బిట్రేషన్ చట్టాలలో ఏ నియమాలున్నా సహ చట్ట నియమాలదే ప్రాథమ్యత. సమాచారం ఇవ్వా లని చెప్పే సహ చట్టం వర్తించినా... సెక్షన్ 8(1) (ఇ), (జె) కింద వ్యక్తిగతమైన, నమ్మి ఇచ్చిన సమాచారం ఇవ్వకూడదు. బహళ ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉం టే మాత్రం ఆ సమాచారాన్ని కూడా ఇవ్వవచ్చు. శ్రీమతి అగర్వాల్ కేసులో బహుళ ప్రజా ప్రయోజనమేదీ లేదు. కోర్ట్టులో తమ హక్కులను కాపాడుకోకుండా వారిని ఎవ రూ ఆపరు. సెక్షన్ 8(1) ప్రకారం వెల్లడించడం కన్నా మధ్యవర్తిత్వ సమాచారాన్ని దాచడమే ప్రయోజనకరం అనుకుంటే వెల్లడించనవసరం లేదు. రాజీ చర్చల సమా చారం సాక్ష్యమనడానికి వీల్లేదు. రాజీలో పెద్ద మనిషి ముందు పరిష్కారం మీది నమ్మకంతో చెప్పిన విషయా లను రచ్చకు ఈడ్చడానికి వీల్లేదు. నిజానికి ప్రత్యామ్నా య పరిష్కారమైన రాజీ ప్రయత్నాలు మనగలగడం వివాహ, వివాహేతర వివాదాలకు చాలా అవసరం. అవి సజీవంగా మిగిలేలా రక్షణ కల్పించడంలో ప్రజాప్రయో జనం ఉంది. (రాజీ సలహాసంప్రదింపుల సమాచారం ఇవ్వడానికి వీల్లేదని రమా అగ్రవాస్ వర్సెస్ ఢిల్లీ న్యాయ సహాయాధికార సంస్థ కేసు (సీఐసీ/ఎస్‌ఏ/ఏ/2015/ 000305)లో నిర్ణయం ఆధారంగా).  
 (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
 professorsridhar@gmail.com
                                                                              -మాడభూషి శ్రీధర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement