బడులే బందెల దొడ్లు | schools situations are very bad | Sakshi
Sakshi News home page

బడులే బందెల దొడ్లు

Published Tue, Sep 5 2017 1:50 AM | Last Updated on Sun, Sep 17 2017 6:23 PM

బడులే బందెల దొడ్లు

బడులే బందెల దొడ్లు

విశ్లేషణ
ఎందుకూ కొరగాని పశువులను అమ్ముకోవడానికి వీల్లేక ఆర్థికపరంగా లాభదాయకంగాని పశువుల సంఖ్య పెరిగిపోతోంది. వాటి యజమానుల పని ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు అవుతోంది.

ఇటీవల, ఉత్తరప్రదేశ్‌ లఖింపూర్‌ ఖేరీ స్థానిక పాఠశాలలో గాలికి తిరిగే ఆవులు సహా దాదాపు 250 పశువులను బంధించి, అక్కడ చదువుకునే హక్కున్న పిల్లలను బయ టకు గెంటేశారు. ఆ బడి ఇక ఎన్నటికి తిరిగి పని చేయడం మొదలవుతుందో విద్యార్థులకు, ఉపాధ్యా యులకు కూడా తెలియదు. ఇదేదో ఒంటరి ఘటన కాదు. కౌ బెల్ట్‌ (హరియాణా, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌)గా పిలిచే ప్రాంతంలో ఉన్న ఈ రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా జరిగిన ఐదో ఘటన ఇది.

రైతులు, తమ పిల్లల చదువులు పోతే పోనీ అని, పశువులను బళ్లోకి తోలి, దాన్ని బందెలదొడ్డిగా మార్చే టంతటి తీవ్ర చర్యకు ఎందుకు పాల్పడ్డారో చెప్పా ల్సిన అవసరం లేదు. గోవధ నిషేధంతో వట్టి    పోయిన, ముసలి, పనికిరాని పశువుల యజమానులు ఊరికే వాటిని పోషించాలని కోరుకోవడం లేదు. వాటిని గాలికి వదిలి, రైతుల పంటలు సహా ఎక్కడ ఏమి  దొరికితే అది మేయమని వదిలేస్తున్నారు.

గోవధ నిషేధం ప్రమాదకరమైన దుస్సాహస మని వ్యవసాయ శాస్త్రవేత్తలు పదే పదే చెబుతూనే ఉన్నారు. పాడి పశువులన్నీ షెడ్లలో పెట్టి క్రమ పద్ధ తిలో పోషించే పశువులు కావని సైతం చెప్పారు. చాలా మంది రైతులు, ప్రత్యేకించి చిన్న, సన్నకారు రైతులకు అది అనుబంధ కార్యకలాపం మాత్రమే. వారు తమ పశువులను గ్రామ ఉమ్మడి ప్రాంతాల్లో మేతకు వదిలేస్తారు. మన వ్యవసాయ జీవావర ణంలో పచ్చిక మైదానాలు భాగం కావు. ఎక్కడబ డితే అక్కడ మేయడమే ఎక్కువగా జరుగుతుం టుంది. దీంతో గాలికి వదిలేసే పశువులతో పాల నిచ్చే పాడి పశువులు  గ్రాసం కోసం పోటీపడాల్సి వస్తుంది. ఇది మొత్తంగా మన పశు పోషణ వ్యవ స్థకు, దాని వల్ల కలిగే ఆర్థికపరమైన ప్రయోజనాలకు తూట్లు పొడుస్తుంది.

గోవధ నిషేధం కారణంగా కొద్దిపాటి భూమికి  యజమానులైన వారు ఏది ఏమైనా సరే తమ పశువు లను గౌరవించాల్సిందే. కాబట్టి వాటికి మేతను ఎక్కడని సంపాదించాలి? ఇకపోతే, కేరా బీఫ్‌ను (గేదె, దున్నపోతుల మాంసం) కూడా గోమాంసమే నని గోరక్షకులు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కేరాబీఫ్‌ సైతం గోరక్షకులకు ఆగ్రహం కలిగేలా చేసి, వారి చేతుల్లో క్రూరమైన హింసకు గురికావాలని కోరుకోవ డంగా మారవచ్చు. ఇలా పనికిరాని పశువులు వేటినీ అమ్ముకోవడానికీ మార్కెట్‌ దొరకకపోవడంతో ఆర్థి కపరంగా లాభదాయకంగాని పశువుల సంఖ్య హఠా త్తుగా పెరిగిపోతోంది. దీంతో అలాంటి పశువుల యజమానుల పని ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు అవుతోంది. అంటే వాటికి మేతను సంపా      దించి సాదలేరు లేదా అమ్మడమో, వధించడమో కూడా చేయలేరు. గోవధ నిషే«ధ సమర్థకులు ఈ సమ స్యకు పరిష్కారాన్ని చూపలేదు. రాజస్తాన్, మధ్య ప్రదేశ్‌లలో గోవధ నిషేధ ప్రచారకులు నడుపుతున్న గోశాలల్లో సైతం వందల కొద్దీ పశువుల మృత కళే బరాలు కనిపిస్తున్నాయి.

గోవధ నిషేధం బాగోగుల గురించి కాక, పర్య వసానం ఎంత సంక్లిష్టమైనదిగా ఉంటుందో అర్థం చేసుకోకుండానే విధాన నిర్ణయాలను తీసుకోవడం పైనే దృష్టిని కేంద్రీకరిస్తున్నాను. ఈ నిర్ణయాన్ని, పెద్ద నోట్ల రద్దుతో పోల్చవచ్చు. కొత్త నోట్లు పెట్ట డానికి అనువుగా ఏటీఎమ్‌లలో మార్పులను చేపట్టా    లని ఆర్‌బీఐ, బ్యాంకులను ఆదేశించినా అవి ఆ పని చేయలేదు. ఆర్‌బీఐ కూడా ఏటీఎంలలో పట్టని కొల తలతోనే కొత్త నోట్లను తేవాలని నిర్ణయించింది.

గొడ్డు మాంసం ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విషయం కూడా ఆలోచించాలి. అమెరికా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం గొడ్డు మాంసం ఎగుమతిలో భారత్‌దే అగ్రస్థానం. ఈ విషయంలో మన ఎగుమతులు బ్రెజిల్‌ కంటే కూడా ఎక్కువ. అమెరికా గొడ్డు మాంసం అనేటప్పుడు బీఫ్‌ (గో మాంసం), కేరాబీఫ్‌ (గేదె మాంసం)లను ఒకటిగానే పరిగణించింది. సరిగ్గా మన గోరక్షకులు చేసినట్టే చేసింది కదూ? అయితే, పశువుల యజ మానుల ఆర్థిక, నిర్వహణాపరమైన దుస్థితితో పోలిస్తే బీఫ్‌ ఎగుమతుల సమస్య చాలా చిన్నదే.

గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ భూమి ఉన్న యజ మానులు తమ పశువులను తరచుగా ఇంటి ముందే కట్టేసుకుంటారు. పశువుల కొట్టం లాంటి ఏర్పాటుకు నోచుకునే పశువులు తక్కువే. గోవధ నిషేధం ఫలి తంగా అదనంగా ఎంత పేడ లభిస్తుంది, దాన్ని ఏ మేరకు ఉపయోగించుకోగలం అనేది మనకు ఇంకా తెలిసి ఉన్నట్టు అనిపిం^è డం లేదు. పేడను ఎండబెట్టి చేసే పిడకలను వంటకు వాడటం వల్ల పొగ వస్తుం దని దాన్ని నిరుత్సాహపరుస్తున్నారు.

గాలికి వదిలేసిన పశువులు, రెండు దశాబ్దాలకు పైగానే ప్లాస్టిక్‌ సంచులను తింటున్నట్టు తెలుసు. గతంలో అవి అనూహ్యంగా జరిగిన ఘటనలు. ప్లాస్టిక్‌ సంచుల వాడకం, వాటిని నిర్లక్ష్యంగా ఎక్క డబడితే అక్కడ పడేయడం పెరిగిపోతుండటానికి అనుగుణంగా.. విషపూరితమే అయినా ప్లాస్టిక్‌ సంచులు తినడానికి తమకు అనువుగా ఉండే ఆహా రమని పశువులు త్వరలోనే గుర్తిస్తాయి.

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
ఈ–మెయిల్‌ :mvijapurkar@gmail.com
మహేష్‌ విజాపృకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement