భేషజాలు తొలగిన బంధం | shekhar gupta writes on Indo-American relation | Sakshi
Sakshi News home page

భేషజాలు తొలగిన బంధం

Published Sat, Jun 11 2016 6:16 AM | Last Updated on Mon, Sep 4 2017 2:15 AM

భేషజాలు తొలగిన బంధం

భేషజాలు తొలగిన బంధం

జాతిహితం

భారత విదేశాంగ విధానంలో ప్రచ్ఛన్న యుద్ధానంతర దిద్దుబాటు ప్రక్రియను పీవీ ప్రారంభించారు. ‘‘బలమైన, సంపన్నవంతమైన భారతదేశం.. అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంద’’ని ప్రకటించడం ద్వారా మోదీ ఇప్పుడు ఆ ప్రక్రియను పూర్తి చేశారు. చరిత్రకు సంబంధించిన శషభిషలను అధిగ మించి, భారత్‌–అమెరికా సంబంధాలపై ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న పద్ధతిలో ఈ వారం కాలమ్‌లో అంశంగా ఎంచుకోవడానికి రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి చరిత్రలోని స్వవచన వ్యాఘాతాలు, రెండు చరిత్రలోని భేష జాల గురించి. లేదా రెండింటి గురించి కూడా.


వ్యూహాత్మక సంబంధాలు చాలా కాలం తరువాత ఏర్పడినాయి గానీ, 1947 నుంచి కూడా భారత్, అమెరికా దేశాలు సహజ భాగస్వాములు, మిత్రులు అయి ఉండాలి. కానీ యుద్ధానంతర పునర్నిర్మాణ దశలో  తూర్పు, పశ్చిమా లలోని ఐరోపా, జపాన్‌లను దాటి సంబంధాలు నెరపడం అమెరికాకు సాధ్యం కాదు. భారత నాయకత్వం మౌలికంగా బ్రిటన్‌ చుట్టూ పరిభ్రమిం చేది. కానీ త్వరలోనే భాగస్వాములు ఇద్దరినీ కూడా ప్రచ్ఛన్నయుద్ధం హరించి వేసింది. పాకిస్తాన్‌ అమెరికా వైపు మొగ్గింది. భారత్‌ మాత్రం అలీనోద్యమ నాయకత్వాన్ని ఆశించింది. అలీనో ద్యమం ఎప్పుడూ సోవియెట్‌ కూటమి వైపే మొగ్గు చూపింది. పశ్చిమదేశాల పట్ల వ్యతిరేక భావం ఉన్న ఇద్దరు ప్రముఖ భారతీయ నేతలు నెహ్రూ, ఇందిర రెండు సంక్షోభాల వేళ అమెరికాకు చేరువయ్యారు. చైనా దురాక్రమణ, ఆహార నిల్వల కొరత వచ్చినప్పుడు ఆ పరిణామం జరిగింది. తరువాత వచ్చిన ప్రధానమంత్రులంతా (నరేంద్ర మోదీ సహా) హరిత విప్లవాన్ని విజయవంతం చేయడంలో అమెరికా నిర్వహిం చిన కీలక పాత్రను గుర్తు చేస్తూనే ఉన్నారు.

ప్రచ్ఛన్న యుద్ధం –1989– పరిసమాప్తితోనే భారత్‌–అమెరికా సంబంధాల నూతన చరిత్ర ప్రారంభమైందని భావించడం మరింత  సముచితంగా ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధానంతర ప్రపంచ చరిత్ర తర్వాత సంభవించిన గొప్ప మూల మలుపు భారత్‌ను నేర్పులేని ఒక మోటు స్థితిలోకి నెట్టింది. ఈ దశలో భారత్‌ ఆత్మవిశ్వాసం స్వల్ప స్థాయిలో ఉండటంతో ప్రచ్ఛన్న యుద్ధ పరిసమాప్తి దేశానికి ఒక అవ కాశం కంటే ఒక సంక్షోభంగానే కనిపించింది.

ఆర్థిక రంగంలో యధాతథ స్థితిని భారత్‌ సాహసోపేతంగా బద్దలు చేసింది కాని దాని రాజకీయ నాయకత్వం మాత్రం పాత వ్యూహాత్మక మానసిక స్థితిలోనే చిక్కుకుని ఉండేది. ఆ తర్వాత ఇజ్రాయెల్‌తో సంబం« దాలను ఏర్పర్చుకోవడం, అమెరికాను సందర్శించడం వంటి కొన్ని దిద్దుబాట్లు జరిగాయి. చివరగా, భారత్‌–అమెరికా సంబంధాలు ఇంకే మాత్రం గత బంధనాలతో ఉండబోవని, కొత్త అవకాశాలకు ఆకాశమే హద్దని పీవీ నరసింహారావు కేపిటల్‌ హిల్‌లో సాహస ప్రకటన చేశారు. ఢిల్లీ, వాషింగ్టన్‌ మధ్య అవకాశాల కంటే చికాకులు ఎక్కువగా ఉండేవి. అయితే పీవీ.. ప్రపంచంలో జరుగుతున్న మౌలిక మార్పును మేధోవం తంగా గ్రహించి దాన్ని స్వీకరించారు.

భారత విదేశాంగ విధానంలో ప్రచ్ఛన్న యుద్ధానంతర దిద్దుబాటు ప్రక్రియను పీవీ ప్రారంభించారు. బలమైన, సంపన్నవంతమైన భారత దేశం.. అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుం దని ప్రకటిం^è డం ద్వారా మోదీ ఇప్పుడు ఆ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ఈ దశకు చేరడానికి భారత్‌ ఊగిసలాటలతో కూడిన పాతికేళ్ల సమయం తీసుకుంది. దీన్నే మోదీ చరిత్ర భేషజాలుగా అద్భుతమైన రీతిలో ఇటీవలి అమెరికా పర్యటనలో వర్ణించారు.
వాస్తవానికి మూడు దశాబ్దాలకు పైగా భారత–అమెరికా సంబం« దాల పునఃస్థాపన క్రమాన్ని మనం ఒక రిలే రేస్‌గా చూడవచ్చు. పీవీ ఈ పరుగుపందేనికి దారి సిద్ధం చేశారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ తొలి పరుగు ప్రారంభించి బ్యాటన్‌ను మన్మోహన్‌సింగ్‌కు అందించారు. సింగ్‌ యూపీఏ–1 హయాంలో అణు ఒప్పందం ద్వారా తుది అంగను చేరు కున్నారు. కానీ యూపీఏ–2వ హయాంలో కాంగ్రెస్‌ పార్టీ ఊగిసలాట వల్ల తడబడ్డారు. ఇప్పుడు ఆ బ్యాటన్‌ని మోదీ అందుకుని చివరి పరు గును పూర్తి చేశారు.

క్షేత్రస్థాయిలో పావుశతాబ్దం కలిగించిన ప్రయోజనానికి తోడుగా మోదీ తన బలాన్ని కూడా తీసుకొచ్చారు. వీటిలో మొదటిది 282 స్థానాల మ్యాజిక్‌ నంబర్‌. అయితే మోదీకి ఇంత మెజారిటీ ఒక బహు మతిగా రాలేదనుకోండి. ఆయన దాన్ని సాధించుకున్నారు. రెండు. ప్రచ్ఛన్న యుద్ధానంతర శకంలో రూపొందిన ప్రొఫెషనల్‌ దౌత్యవేత్తల బృందంతో మోదీ ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. మూడు, భారత కులీన వర్గాలకు చెందిన కుటుంబ సభ్యులు భారీ స్థాయిలో అమెరి కాకు వలస వెళ్లినందున అమెరికాతో భావోద్వేగ బంధం ఇంకా పెద్దది. నాలుగు.. తన పూర్వ ప్రధానులతో పోలిస్తే మోదీ అత్యంత పిన్న వయస్కు డైన ప్రధానిగా ఉన్నారు.

ప్రధాని మంత్రిత్వం అనేది మరింత యుక్తవయస్సులో ఉన్నవారు చేయవలసిన పని అంటూ మన్మోహన్‌ సింగ్‌ తరచూ చెప్పేవారు. భారతదేశపు అత్యంత విజ్ఞులైన ప్రధాన మంత్రులు.. పీవీ నరసింహారావు, వాజ్‌పేయీ, మన్మోహన్‌ సింగ్‌ వారి జీవితాల్లో కనీసం పదేళ్లు ఆలస్యంగా ప్రధాని పదవిని చేపట్టారు. తన సమకాలీన ప్రపంచ నేతలతో పోలిస్తే మోదీ కాస్త ముసలివాడిగానే కని పించినప్పటికీ, తన వయస్సు తనకు అనుకూలంగానే ఉంటూ వస్తోంది.

అయితే మోదీకున్న అతిపెద్ద బలం చెక్కుచెదరని ఆయన మనస్సే. చరిత్ర భారాలు లేదా కపటత్వాలతో ఆయన నలిగిపోవడం లేదు. ఏళ్ల తరబడి దౌత్యపరమైన అంచనాలు, కేబుల్‌ వార్తలు చదవడం ద్వారా కలిగే విశ్లేషణ–పక్షవాత భారానికి ఆయన గురికాలేదు. ఈ అనిశ్చితివల్లే తన ప్రభుత్వాన్ని పణంగా పెట్టి అణు ఒప్పందాన్ని అమలులోకి తీసుకు వచ్చే విషయంలో కాంగ్రెస్‌ పార్టీ మానసికంగా స్తంభించిపోయింది. రక్షణ సహకార ఒప్పందాల విషయంలో ముందుకెళ్లడంలో దాని స్తంభనే భీతిగా మారిపోయింది. తాను, తన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విధానాలను పూర్తిగా వ్యతిరేకించిన విషయాన్ని పక్కనబెట్టి మోదీ స్వచ్ఛ మానసిక స్థితితో, దాపరికంలేనితనంతో అధికారంలోకి వచ్చారు. అధి కారం చేపట్టిన తొలిరోజు కొత్త చరిత్రకు నాంది కావచ్చు కాబోలు.

ఈ చెక్కుచెదరని మనస్సే మోదీని ప్రధానంగా దౌత్యంలో, నిర్ణ యాల రూపకల్పనలో వాస్తవిక వ్యవహార దృక్పథాన్ని చేపట్టేలా చేసి ఉంటుంది. అమెరికాతో మరింత వ్యూహాత్మక అవకాశాలను సృష్టించు కోడానికి, వ్యాపార, వాతావరణ సంప్రదింపుల్లో కూడా ఇచ్చి పుచ్చు కోవడానికి ఆయన అభిలషిస్తున్నారు. అలాగే ఆర్థిక, వాణిజ్య అవకా శాలను విస్తరించుకోవడానికి చైనాతో వ్యూహాత్మక ఎత్తుగడలకు సంబం« ధించిన అలజడిని చల్లబర్చుకోవాలని కూడా మోదీ ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో జూనియర్‌ బుష్‌ లేదా రీగన్‌ తరహాలో మోదీ వ్యవహ రిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే..  చరిత్రకు సంబంధించిన సందే హాలు – బేషజాలు– నుంచి విముక్తి చెందిన, సమస్యతో నేరుగా వ్యవ హరించే సరైన వ్యక్తిగా మోదీ ఆవిర్భవించారు.
 

- శేఖర్‌ గుప్తా
twitter@shekargupta

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement