శాస్త్ర సాంకేతికపరిజ్ఞాన ప్రగతిలో భాగంగా సదుపాయంగా అందుబాటులోకి వచ్చి, ఉపద్రవంగా పరిణమించిన వస్తువుల్లో ముఖ్యమై నవి పాలిథిన్ క్యారీ బ్యాగ్‌లు. ‘యూజ్ అండ్ త్రో’ అంటూ, ఇలా వాడి అలా పారేసే అతి పలుచని క్యారీ బ్యాగ్‌లు పర్యావరణాన్ని, భూగర్భ జలాలను, భూసారాన్ని కలుషితం చేయడమే కాదు, జంతువులు, మొక్కలు, మనుషులలో కూడా తీవ్ర ఆరోగ్యపరమైన సమస్యలకు కారణమవుతున్నాయి.
పర్యావరణ రీత్యా అత్యంత ప్రమాద కరమై నవిగా పరిగణిస్తున్న 20 మైక్రాన్ల కంటే పలచని క్యారీ బ్యాగ్‌ల తయా రీని, వాడకాన్ని కొన్ని రాష్ట్రాలు మాత్రమే నిషేధించాయి. నిషేధించిన చోట్ల కూడా వాటి వాడకం విస్తృతంగానే కొనసాగుతుండటం ఆందో ళనకరం. అంతకు మించి కేంద్రం ఇటీవల వాటి వాడకంపై నిషేధ మేమీ లేదని ప్రకటించడం మరింతగా వాటి వాడకాన్ని ప్రోత్సహించే విధంగా ఉంది. పాలిథిన్ క్యారీ బ్యాగ్‌ల కాలుష్యం భూమికి మాత్రమే పరిమితం కాకుండా సముద్రాలకు కూడా వ్యాపించి పోయింది. వెయ్యి కోట్లకుపైగా క్యారీ బ్యాగ్‌లు సముద్రంలో కలసిపోయి, సముద్ర జీవ రాశికి ప్రాణాంతకంగా మారాయి. ఒక వంక పాలిథిన్ కాలుష్యాన్ని అనుమతిస్తూనే స్వచ్ఛ భారత్ సాధన సాధ్యమేనా? పాలకులు ఆలోచించాలి.
కె. రవికుమార్ శ్రీకాకుళం
క్యారీబ్యాగ్‌లతో స్వచ్ఛభారత్?
Published Sat, Dec 27 2014 4:29 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM
Advertisement