సిలబస్ మార్పు సరే.. పుస్తకాలేవీ? | syllabus changed even but books not ready to yet | Sakshi
Sakshi News home page

సిలబస్ మార్పు సరే.. పుస్తకాలేవీ?

Published Tue, Jul 28 2015 3:34 AM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM

syllabus changed even but  books not ready to yet

సందర్భం
 
 విద్యార్థుల జీవితాల తో పాలకులు చెలగా టం ఆడుతున్నారు. అధునాతన చరిత్రను విద్యార్థులకు అందిం చాల్సిన విషయం మం చిదే. కాని విద్యా సంవ త్సరం ప్రారంభమైన ప్పటికీ నేటికీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పుస్తకాలను ముద్రించ లేదు. ప్రతి ఏటా సిలబస్ మార్చటం. సరైన సమ యంలో పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అంది వ్వకపోవడం ఇంటర్ బోర్డుకు పరిపాటిగా మారింది. జూనియర్ కాలేజీలు ప్రారంభమై నెలా 10 రోజులు గడిచిపోయినప్పటికీ ద్వితీయ సం వత్సరం ఇంటర్ హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ (హెచ్‌ఈసీ) ఇంటర్ కామర్స్ విద్యార్థులకు క్లాసులు నిర్వహించలేక కాలం వెళ్లదీస్తున్నారు.
 2015-16  విద్యా సంవత్సరానికి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పాఠ్యపుస్తకాలను మార్చు తున్నట్లు 8 నెలల ముందుగానే ప్రకటించారు. పౌరనీతి, అర్థశాస్త్రం, వాణిజ్యశాస్త్రం, చరిత్ర భూగోళశాస్త్రం, మనస్తత్వశాస్త్రం (సైకాలజీ) వంటి పాఠ్యపుస్తకాలను మార్చుతున్నట్లు 2014 లోనే ప్రకటించారు. కానీ వెంటనే పాఠ్య పుస్తకా లను ముద్రించటం ఎందువల్లనో మరిచిపో యారు. ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్‌ను 2014-15 సంవత్సరంలో మార్చారు. అప్పుడు 6 నెలలు గడిచాక, విద్యార్థులు, తల్లిదండ్రులు గొడవ చేశాక పుస్తకాలను మార్కెట్‌కు విడుదల చేశారు.
 తాజాగా మొదటి సంవత్సరం ద్వితీయ భాష సిలబస్ మారిందని సమాచారం అందిం చారు. దీంతో ఇంటర్ చదివే విద్యార్థులు గందర గోళంలో పడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వాల ఆదేశాల ప్రకారం జూన్ మొదటి తేదీ నుండే పాఠాలు బోధించాల్సి ఉంది. కాని మారిన సిలబస్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటి వరకు ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించక పోవడం వల్ల రెండు రాష్ట్రాల్లోని 12 లక్షల మంది విద్యార్థులు ‘పరేషాన్’ అవుతున్నారు.
 ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులకు ఇది అమూల్యమైన సమయం. పైగా ఏఏ పా ఠ్యాంశానికి ఎంత వెయిటేజీ ఇస్తారో తెలియరావ టం లేదు. అత్యధిక మార్కుల కోసం శ్రమించే ద్వితీయ సంవత్సరం విద్యార్థుల గొంతులో వెల క్కాయ పడినట్లు తయారైంది వ్యవహారం. సిల బస్ కమిటీ ఉంటుంది. ముద్రణ కమిటీ ఉంటుం ది. పాఠ్య పుస్తకాల పంపిణీకి కమిటీలు ఉంటా యి. అన్ని రకాల కమిటీలు, అధికారుల సమీక్షలు ఉంటాయి. అన్ని చర్యలు తీసుకుంటారు. అయి నా అంగట్లో అన్నీ ఉన్నా ‘ఇంటర్ బోర్డు’ నోట్లో శని ఉంది అనే ప్రచారం విద్యార్థులు వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటికైనా ఇంటర్ అధికారులు మారిన పాఠ్యపుస్తకాల సిలబస్‌ను తక్షణమే ప్రకటించాలి. మారిన ఇంటర్ పాఠ్యపుస్తకాలను మార్కెట్‌లోకి విడుదల చేయాలి. ఆలస్యానికి కారకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి.
- రావుల రాజేశం, వ్యాసకర్త లెక్చరర్  జమ్మికుంట
 మొబైల్: 9848811424
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement