ఆ సగానికి అధికారంలో వాటా ఎన్నడు? | we should think about women reservations | Sakshi
Sakshi News home page

ఆ సగానికి అధికారంలో వాటా ఎన్నడు?

Published Mon, May 18 2015 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM

ఆ సగానికి అధికారంలో వాటా ఎన్నడు?

ఆ సగానికి అధికారంలో వాటా ఎన్నడు?

మహిళలకు న్యాయంగా అధికారంలో దక్కాల్సిన వాటాను ఇవ్వడం పట్ల విముఖత గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్రోద్యమంలో వారి పాత్రను సహజమైనదిగా అంగీకరించిన మనం స్వాతంత్య్రానంతరం ఏడు దశాబ్దాలుగా అధికారంలో వారికి దక్కాల్సిన వాటాను ఎందుకు నిరాకరిస్తున్నాం?
 
నూతన బ్రిటిష్ పార్లమెంటు లో కొత్త లైంగిక పొందిక కనిపిస్తోంది. పార్లమెంటు సభ్యుల్లో మూడోవంతు మహి ళలే. ప్రపంచంలోని అన్ని పార్లమెంట్‌లకు తల్లి అయిన బ్రిటన్ పార్లమెంటరీ చరిత్ర లోనే ఇంత అత్యధికంగా మహిళలు ఎన్నిక కావడం ప్రప్రథమం.  మన చట్టసభల్లో మహిళలకు మూడింట ఒకటి రిజర్వు చేయాలనే ప్రతిపాదన ఉన్నా అది అంద రానిదిగానే, దాదాపు అసాధ్యంగానే ఉంది. 1996లో తొలుత ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మరో నాలుగుసార్లూ ఆ పని చేశారు. కానీ ఆమోదం లభించలేదు. అలా బోర్లాపడ్డాక ఇక అదొకటి ఉందనే విషయం కూడా తరచుగా మరపున పడి పోతోంది. అయితే పంచాయితీ ఎన్నికల్లో ఆ రిజర్వేషన్లు న్నాయి. కొన్ని రాష్ట్రాలు 50 శాతం కూడా ఇస్తున్నాయి. కాకపోతే బ్రిటన్ మహిళలు ఎలాంటి కోటాలు లేకుం డానే ఆ స్థాయిని సాధించారు.
 మన దేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు వయోజన ఓటింగు హక్కు ప్రాతిపదికపైనే జరిగాయి. మహిళలపట్ల వివక్ష చూపలేదు. అంతకు పూర్వమే మహాత్మాగాంధీ ‘‘మహిళలు ‘‘ఓటర్లుగా’’ నమోదైతే కలుషిత వాతావారణం పరిశుభ్రమవుతుంది.’’ ఓటు హక్కు ‘‘వారికి స్వతంత్రంగా ఆలోచించడాన్ని నేర్పు తుంది, వారిని కుల శృంఖలాల నుంచి విముక్తం చేసి, వారిలో మార్పును తెస్తుంది’’ అన్నారు. మనమిప్పుడు ఆయనను పెద్దగా పట్టించుకోమనేది వేరే సంగతి.

 కోటాలు ఉన్న చోట అతి సుతారంగా వాటిని వికృతీకరించి, చాలా సందర్భాల్లో ఆ మహిళల జీవితాల ను శాసించే మగవారే ప్రధాన పాత్రధారులుగా ఉంటు న్నారు. వారి తరఫున వారే ప్రజా ప్రతినిధుల విధులను నిర్వహిస్తున్నారు కూడా. అదంతా మహిళలు సహా ఓటర్లంతా గుసగుసలైనా లేకుండా చూస్తుండగా బహి రంగంగానే జరుగుతోంది.అయినా దాన్ని మన దేశంలో జరిగే చాలా విషయాల్లాగే ఆమోదించడానికి అలవా టుపడ్డాం. ఈ ప్రజాప్రతినిధుల తరపున నెరపే నాయక త్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ.. ఇది అసలు రిజర్వేషన్ల ఉద్దేశ్యాన్నే వక్రీక రిస్తోందని అన్నారు.

మహిళలకు వారి వాటాను ఇవ్వడం పట్ల విముఖత గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్రో ద్యమంలో వారి పాత్రను సహజ మైనదిగా అంగీకరిం చిన మనం అధికారంలో వారి న్యాయమైన వాటాను స్వాతంత్య్రానంతరం ఏడు దశా బ్దాలుగా ఎందుకు నిరాకరిస్తున్నాం?  మొట్టమొదటి పార్లమెంటులో ఉన్నది కేవలం 19 మహిళలే. ఆ విష యమై మాట్లాడుతూ మహిళలను సభలోకి రానివ్వ డమంటే ‘‘వారికేదో మేలు చేస్తున్నట్టు కాదు’’ అన్నారు. మగాళ్ల ఆధిపత్యం ఉన్న సమాజం ‘‘ఈ విషయంలో అసమాన దృష్టిని’’ చూపు తోంది అని వాపోయారు.

 బృందాకరత్ ముంబైలోని ఒక పత్రికా సమావేశం లో వాజపేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందడానికి చేయాల్సిం దంతా చేయడం లేదని ఆరోపించారు. అయితే గట్టిగా అడిగితే ఆమె ప్రభుత్వం కాదు అసలు సమస్య పార్లమెం టేనని నిర్ధారించారు. ములాయంసింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్‌ల నేతృత్వంలోని రెండు పార్టీలు రెండూ తమకు అవకాశం దొరికినప్పుడల్లా ఆ బిల్లును అడ్డగించాయని అంగీకరించాయి. వారికి అసలు ‘‘సామాజిక ఎజెండా’’యే లేదని ఆమె తేల్చి చెప్పారు. మహిళల హక్కుల సాధనకు  సహాయపడా ల్సిన ఈ పార్టీలు మెనారిటీ వాదం వెర్రినే  ప్రధాన కవచంగా ధరించి లైంగిక పక్షపాతం అనే సామాజిక చెడుగును కప్పిపుచ్చడానికి సహాయపడటం మాత్రమే చేశారు. బిహార్‌లో చక్రం తిప్పడానికి లాలూ తన భార్య సహా యం తీసుకోవాల్సి రావడానికి అది అడ్డం కాలేదు.  పైగా విలక్షణమైన పంచాయితీ పెద్దలాగా ఆమెను అడ్డు పెట్టుకుని అధికారం సాగించారు. ఈ రాజకీయ సిగ్గు చేటుతనం సీపీఎంకు సైతం ఇబ్బందికరం కాలేదు.  అవకాశవాదమే మన రాజకీయాలకు మార్గదర్శక సూత్రం కాబట్టి అందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదనుకోండి.

 లోక్‌సభకు ఎన్నికైన మహిళల సంఖ్య ఎన్నడూ 10 శాతానికి మించింది లేదు. రాజ్యసభలో వారి సంఖ్య 12 శాతం దాటలేదు. ఆశ్చర్యకరంగా మహిళా వ్యతిరేక ఖాప్ పంచాయితీలు ఆధిపత్యం చలాయించే హర్యానా శాసనసభలో మహిళల వాటా 14 శాతానికి చేరింది. ఇక మిగతా రాష్ట్రాలన్నీ మహిళా రిజర్వేషన్లగురించి మాటలు తప్ప మరేం చేయడం లేదు. ఇంతవరకు ఏ ఎన్నిక లోనూ పోటీదారుల్లో మహిళా అభ్యర్థులు మూడోవం తుకు మించింది లేదు. మహిళల పట్ల పార్టీలలోనే ఉన్న వివక్షకు ఇదే సాక్ష్యం. 73, 74 సవరణల పుణ్యమాని రెం డు దశాబ్దాల క్రితమే అమల్లోకి వచ్చిన రిజర్వేషన్ల ఫలితంగా దేశవ్యాప్తంగా పంచాయితీలు, స్థానిక సంస్థల కు దాదాపు 10 లక్షల మంది మహిళలు ఎన్నికయ్యారు.

అయినా తమ పాత్రను వాస్తవంగా పార్లమెంటు, రాష్ట్ర స్థాయిల్లో కూడా విస్తరింపజేయాలని మహిళలు మగ రాజకీయ వేత్తలను ఒప్పించలేకపోయారు. ఆసక్తికరం గా, వారి గొంతు మూగవోయింది. చాలా తరచుగా వాళ్లు మహిళా వ్యతిరేక పురుష దృక్పథంతో అర్ధాంగీకా రం తెలుపుతున్నట్టనిపిస్తోంది. అది విషాదకరం. బ్రిటన్ పార్లమెంటరీ ఎన్నికలైనా వారి కళ్లు తెరిపిస్తాయా?
   

 

 (వ్యాసకర్త: మహేష్ విజాపుర్కార్  సీనియర్ పాత్రికేయులు)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement