sandhrbham
-
BSNL Vodafone Idea Merger: అప్పుల బరువుతో విలీనమా?
వొడాఫోన్–ఐడియా(వీఐ) కంపెనీని ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్లో విలీనం చేస్తే సమస్య పరి ష్కారం అవుతుందా? వీఐకి 2018లో చైర్మన్‌గా ఎన్నికైన ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన కుమారమంగళం బిర్లా కొన్ని రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేశారు. గతంలో ఐడియా కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న హిమాంషు కాపారియా కొత్త చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వొడాఫోన్–ఐడియా ఆర్థిక కష్టాలలో పడటం, మార్చి 2022 లోపు రూ. 24,000 కోట్లు కట్టాల్సి ఉండటం, కొత్త అప్పులు పుట్టకపోవడం, ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు వల్ల అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూపై ఎక్కువ పన్ను కట్టాల్సి రావడం వంటి కారణాల వల్ల రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు బిర్లా వెల్లడించారు. టెలికం రంగంలో ఒకటి, రెండు కంపెనీల గుత్తాధిపత్యం కొనసాగితే వినియోగదారునికి అన్యాయం జరుగుతుందనీ, కనుక కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని, వీఐ కంపెనీని బీఎస్ఎన్ఎల్లో కలపడం లేదా అప్పుల్ని ఈక్విటీలుగా మార్చడం, టెలికం శాఖకు కట్టాల్సిన వాయిదాలు చెల్లించే గడు వులు పెంచడం లాంటి చర్యలు వెంటనే చేపట్టాలనీ మొన్న జూన్‌లో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాకు రాసిన లేఖలో కుమారమంగళం బిర్లా కోరారు. ఐడియా కంపెనీలో 2018లో విలీనమైన వొడాఫోన్ కంపెనీలో ఆదిత్య బిర్లా గ్రూపునకు 27 శాతం, బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్‌కు 44 శాతం వాటాలు ఉన్నాయి. 2020 సెప్టెంబర్ 7న కంపెనీ పేరును ‘వీఐ’గా మార్చారు. వొడాఫోన్‌కి దాదాపు రూ. 1,80,000 కోట్ల అప్పులున్నాయి. రాబోయే 10 ఏళ్లలో స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీల కింద రూ. 58,254 కోట్లు, ఏటా రూ. 7,854 కోట్లు చెల్లించాల్సి ఉంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో దివాలా పిటిషన్ వేసే ఆలోచనలో వొడాఫోన్ ఐడియా ఉంది. ఇదే జరిగితే ఆ ప్రభావం ఎస్ బ్యాంకు, ఐడీఎఫ్సీ బ్యాంకులపై ఉంటుంది. మరోవైపు ‘డీఓటీ’కి వెంటనే చెల్లించాల్సిన రూ. 8,292 కోట్లు చెల్లించడానికి మరో ఏడాది గడువు కావాలని వొడాఫోన్–ఐడియా కోరింది. బీఎస్ఎన్ఎల్లో వీఐ విలీనం వల్ల ఉపయోగం ఉంటుందా? ప్రతి టెలికం సర్కిల్లో కనీసం నాలుగు టెలికం కంపెనీలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసు కోవాలనీ, లేకపోతే ఒకటి, రెండు కంపెనీల పెత్తనం కొనసాగి, టెలికం రంగమే కొందరి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందనీ, బీఎస్ఎన్ఎల్కు 4జీ సర్వీసులు ఇంకా లేవు కనుక 4జీ సౌకర్యం కల్పిస్తున్న వీఐని వినియోగించుకుంటే రెండు కంపె నీలకూ మేలు జరుగుతుందని కొంతమంది టెలికం రంగ నిపుణులు సూచిస్తు న్నారు. ఈ ఆలోచనను బీఎస్‌ఎన్‌ఎల్‌లోని కొన్ని యూనియన్లు, అసోసి యేషన్లు సమర్థిస్తున్నాయి. కొన్ని నిజాలను పరిశీలిస్తే బీఎస్ఎన్ఎల్ అప్పు కేవలం రూ. 26,000 కోట్లు కాగా, వొడాఫోన్–ఐడియా అప్పు రూ. 1,80,000 కోట్లు. 2022లో జరుగబోయే 5జీ స్పెక్ట్రమ్ వేలంలో మరింత అప్పు చేయాల్సి ఉంటుంది. పదవీ విరమణ పథకం ద్వారా 80 వేల మంది ఉద్యోగులను సాగనంపడం ద్వారా ఏటా 8 వేలకోట్ల ఖర్చును బీఎస్ఎన్ఎల్ తగ్గించుకుంది. నిజానికి 2019 నాటి కేంద్ర కేబినెట్ నిర్ణయం ప్రకారం 4జీ స్పెక్ట్రమ్‌ను బీఎస్ఎన్ఎల్కు కేటాయిం చారు. కానీ ఆత్మనిర్భర్ భారత్ పథకం ప్రకారం, బీఎస్ఎన్ఎల్కు దాన్ని భారతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూనే ఇవ్వాలని ఫిర్యాదులు రావడం, చైనా కంపెనీలు పాల్గొనకూడదన్న నిర్ణయంవల్ల గత రెండేళ్లుగా బీఎస్ ఎన్ఎల్ 4జీ సేవలను అమలు చేయడం ఆలస్యం అవుతోంది. కానీ వొడాఫోన్– ఐడియా చైనాకు చెందిన హువవాయ్, జడ్టీయూ కంపెనీల సాంకేతిక పరిజ్ఞానం తోనే 4జీ ఇస్తోంది. కనుక వొడాఫోన్–ఐడియాతో బీఎస్ఎన్ఎల్ కలిసి పనిచేయ డానికి ఇది ఒక అడ్డంకి. పైగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)లో వ్యూహాత్మక భాగస్వామ్యం పేరుతో గతంలో విదేశీ సంచార నిగమ్ మొత్తం ప్రైవేటుపరం అయిన అనుభవాలు తెలుసు. కాబట్టి వొడాఫోన్–ఐడియాను బీఎస్ఎన్ఎల్లో కలిపే ఆలోచన ప్రభుత్వం చేయకూడదనే ఆశిద్దాం. మురాల తారానాథ్ వ్యాసకర్త టెలికం రంగ విశ్లేషకులు ‘ మొబైల్: 94405 24222 -
తిరిగి భారత్ పైకి లేస్తుంది
అప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా ప్రధాని మోదీ లాక్డౌన్ విధించినట్లే... ఇప్పుడు రికవరీ రేటు పెరగడం, మరణాల సంఖ్య అత్యల్పంగా ఉండటం, వైద్య సదుపాయాలు, మౌలిక సదుపాయాలు తగినన్ని ఉన్నాయనే ధీమాతోనే లాక్‌డౌన్‌ను క్రమక్రమంగా తొలగిస్తున్నారు. భారతదేశంలో అర్థిక రంగం కుదేలైపోయిందని, ఎన్నడూ లేనంత చీకట్లోకి మనం వెళ్లిపోయామని, ఇదంతా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ల వల్లనే జరిగిందనీ ప్రతిపక్ష హోదా కూడా పొందలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కమ్యూనిస్టు సానుభూతిపరులుగా వ్యవహరించే విశ్లేషకులు ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్లైన్లోనూ, వీడియోల్లోనూ, టీవీల్లోనూ, సోషల్ మీడియాలోనూ, అడిగిన వారికీ, అడగని వారికీ అందరికీ చెప్పాలని తహతహలాడుతున్నారు. మబ్బులు కమ్మినంత సేపూ సూర్య, చంద్రులు కనిపించరు. అలాగని వారు అసమర్థులైపోతారా? మబ్బుల్ని కూడా పక్కకు తీయలేనివాళ్లు అని అనగలమా? ఈ దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఉన్నారు కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల రీత్యా వారు ఈ అపనిందలను మోయాల్సి వస్తోంది. కానీ, అసలు వాస్తవాలను కాంగీయులు, బీజేపీ అంటే గిట్టని విశ్లేషకులు ఎంతకాలం తొక్కిపెట్టగలరు? సోనియా గాంధీ పుట్టిన దేశం ఇటలీతో పాటు అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో కరోనా మృతదేహాలను రోడ్లపైనే వదిలేశారు. శ్మశానాల్లో చోటు దొరక్క కొత్తకొత్త శ్మశానాలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ఖననం చేసిన మృతదేహాలను తీసేసి శ్మశానాలను ఖాళీ చేశారు. వేలాది మంది కరోనా బాధితులు ఆసుపత్రుల్లో వైద్య సేవలు లభించక చనిపోయారు. వృద్ధాశ్రమాల్లో ఉన్న పెద్దవారిని ఎవరూ పట్టించుకోకపోవడంతో వారు చనిపోయారు. ఇవన్నీ చాలవన్నట్లు అసలు కరోనాయే అబద్ధం, లాక్డౌన్ నిబంధనలు ఎత్తేయాలి అంటూ వేలాది మంది రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేస్తున్నారు. అలాంటి పరిస్థితులేవీ భారతదేశంలో లేవు. దానికి ఏకైక కారణం సకాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాక్డౌన్ విధించడమే. లాక్డౌన్ నిబంధనలు పాటించేలా ప్రజల్లో ఆయన కల్పిం చిన నమ్మకమే కోట్లాది మందిని కాపాడింది. ప్రపం చవ్యాప్తంగా కరోనా పేషెంట్ల రికవరీ రేటు అధి కంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. భారత్‌లో వంద మందికి కరోనా సోకితే సగటున 76 మంది త్వరగా కోలుకుంటున్నారు. కరోనా మరణాలు అత్యంత తక్కువగా ఉన్న దేశం భారతదేశం. లాక్డౌన్ విధించడం వల్ల భారతదేశంలో లక్షలాది ప్రజలు చనిపోకుండా కాపాడారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కితాబు ఇచ్చింది. లాక్‌డౌన్‌ను ఎగతాళి చేసిన బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాలు సైతం తర్వాతి కాలంలో లాక్డౌన్ విధించాల్సి వచ్చింది. అయితే, అప్పటికే ఆలస్యం కావడంతో ఆ దేశం ఎన్నో ఇబ్బందులు పడుతోంది ఇప్పటికీ. అగ్రరాజ్య మైన బ్రిటన్‌లో వైద్యులు, వైద్య సిబ్బంది కనీస మౌలిక సదుపాయాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ, భారతదేశం మాత్రం తక్షణం స్పందించి పీపీఈ కిట్లు సహా అన్ని అత్యవసర మౌలిక సదుపాయాలనూ సొంతంగా తయారు చేసుకోగలిగింది. ఇవన్నీ, వాస్తవాలు. కానీ వీటిపై ఎక్కడా చర్చ జరగదు. జీడీపీపై వస్తున్న విమర్శల్లో ఈ వాస్తవాలకు స్థానం లేదు. జీడీపీ పతనం కేవలం భారతదేశానికే పరిమిత మైందా? కరోనా మహమ్మారి మనం ఎవ్వరం ఊహించని, వందేళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారి. ఇలాంటి విపత్తును ప్రస్తుత తరం ప్రజలెవ్వరూ ఎప్పుడూ ఊహించి ఉండరు. ప్రపంచంలోని అన్ని అగ్ర దేశాలూ దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ ప్రకటించిన ఏప్రిల్–జూన్ త్రైమాసిక గణాంకాలను పరిశీలిస్తే అన్ని అగ్రరాజ్యాల్లోనూ ఆర్థిక వ్యవస్థ పతనమైంది. అమెరికాలో 9.5 శాతం తగ్గగా, యురోపియన్ యూనియన్‌లో 14.4 శాతం, ఇటలీలో 17.3 శాతం, ఫ్రాన్స్‌లో 18.9 శాతం, బ్రిటన్‌లో 21.7 శాతం, స్పెయిన్‌లో 22.1 శాతం తగ్గుదల నమోదైంది. ఈ విషయం మన విమర్శకులకు తెలియదా? తెలిసినా కావాలని అసత్యాలనే ప్రచారం చేస్తున్నారా? ఆర్థికంగా ఇబ్బందికరమే అయినప్పటికీ ప్రజల ప్రాణాలను కాపాడాలని లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రధానమంత్రి ముందే చెప్పిన మాట గుర్తు లేదా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద లక్షా 70 వేల కోట్ల ఉపశమనాన్ని కేంద్రం ప్రకటించింది. పేదలకు ఆహారాన్ని, నగదును అందించింది. మహిళలకు, వృద్ధులకు, రైతులకు నగదు బదిలీ చేసింది. నిర్మాణ రంగ కార్మికులకు ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఇవన్నీ వాస్తవాలు కాదా? అప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా ప్రధాని మోదీ లాక్డౌన్ విధించినట్లే... ఇప్పుడు రికవరీ రేటు పెరగడం, మరణాల సంఖ్య అత్యల్పంగా ఉండటం, వైద్య సదుపాయాలు, మౌలిక సదుపాయాలు తగినన్ని ఉన్నాయనే ధీమా తోనే లాక్‌డౌన్‌ను క్రమక్రమంగా తొలగిస్తున్నారు. పేదలు, కార్మికులు, ఉద్యోగులకు ఉపశమనాన్ని కలిగించడం, ఉద్యోగాలను కాపాడటమే ధ్యేయంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. పరిశ్రమలు తిరిగి తెరుచుకుంటున్నాయి. బస్సులు, రైళ్లు, విమానాలు నడుస్తున్నాయి. వ్యాపార కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరుకునే దిశగా జరుగుతున్నాయి. ఆర్థిక రంగం ఎలాగైతే కిందకు పడిందో అదే రీతిలో పైకిలేస్తుంది. ప్రపంచంలో అత్యంత వేగంగా తిరిగి పుంజుకున్న దేశంగా భారతదేశం నిలబడుతుంది. ఇది నేను చెబుతున్న మాట మాత్రమే కాదు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వంటి ప్రముఖ ఆర్థిక సంస్థలు చెబుతున్న మాట కూడా. సమర్థవంతమైన నాయకత్వం మనకు ప్రధాని నరేంద్ర మోదీ రూపంలో ఉంది. అసత్యాలను ఎంతగా ప్రచారం చేసినా సత్యమే జయిస్తుంది. పురిఘళ్ల రఘురామ్ బీజేపీ అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ -
కొలువుల కోసం కొత్త విధానాలు
ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మంది దాకా అభ్యర్థులు పరీక్షలు రాస్తారు. వీరు 1.25 లక్షల ఉద్యోగాల కోసం పలు రకాల పరీక్షలను రాస్తున్నారు. అయితే వచ్చే సంవత్సరం నుంచి ఈ బాధ వుండదు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి కేంద్ర క్యాబినెట్ ఇటీవలే ఆమోదించిన జాతీయ ఉద్యోగ నియామక ఏజెన్సీ ఏర్పాటు కోట్లాదిమంది యువతకు ఒక వరం లాంటిది. కింది స్థాయి ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వూ్యలను తొలగించడమే కాకుండా కాలం చెల్లిన పురాతనమైన 1,500 నిబంధనలు, చట్టాలను రద్దు చేశారు. ఇకపై ఉమ్మడి అర్హతా పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ నియామకాల్లో విప్లవాత్మక సంస్కరణకు ఈమధ్యనే కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆ సంస్కరణ జాతీయ ఉద్యోగ నియా మక ఏజెన్సీ (నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ–ఎన్ఆర్ఏ)ని ఏర్పాటు చేయ డానికి సంబంధించినది. ఆమోదిం చిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ.. దేశంలోని యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ సంస్కరణ దేశంలోని కోట్లాదిమంది యువతకు ఒక వరంలాంటిదని అన్నారు. అంతేకాదు ఈ సంస్కరణ కారణంగా పలు పరీక్షలు రాసే శ్రమ తప్పుతుందని, విలువైన సమయం, వనరులు ఆదా అవుతాయని అన్నారు. ఆయన మరోమాట కూడా అన్నారు. ఎన్ఆర్ఏను ఏర్పాటు చేయడమనేది పారదర్శకతను బలోపేతం చేస్తుందని... పారదర్శక పాలన అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన మైన విధానమని మోదీ అన్నారు. పలు సంస్థల వ్యవస్థగా రూపొందిన జాతీయ నియామక సంస్థ (ఎన్ఆర్ఏ) ఒక ఉమ్మడి అర్హతాపరీక్ష (కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్– సీఈటీ)ను నిర్వహిస్తుంది. దీనిద్వారా గ్రూప్ బి, సి (నాన్ టెక్నికల్) ఉద్యోగాల భర్తీకోసం కావలసిన అభ్యర్థులను వడపోస్తారు. రైల్వేలు, ఆర్థికశాఖ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్‌ల నుంచి ప్రతినిధులు ఎన్ఆర్ఏలో వుంటారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సంపా దించాలంటే పలు సంస్థలు నిర్వహించే పలు రకాల పరీక్షలను ఉద్యో గార్థులు రాయాల్సి ఉంటుంది. సరాసరి తీసుకుంటే ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మంది దాకా అభ్యర్థులు పరీక్షలు రాస్తారు. వీరు 1.25 లక్షల ఉద్యోగాల కోసం ఈ పరీక్షలను రాస్తున్నారు. అయితే వచ్చే సంవత్సరం నుంచి ఈ బాధ వుండదు. ఎన్ఆర్ఏ ఉమ్మడి అర్హతా పరీక్ష(సీఈటీ)ను నిర్వ హిస్తుంది. సీఈటీ మార్కుల ఆధారంగా అభ్యర్థులు ఆయా సంస్థల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది దేశంలోని లక్షలాది మంది ఉద్యోగార్థుల జీవితాలను సంతోషపెట్టే ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పవచ్చు. ఈ మార్పు కారణంగా వారి సమయం, వన రులు ఆదా అవుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో గత ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వం అనేక పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఎవరూ ఊహించని అసాధారణమైన సంస్కరణలను తెచ్చాము. గతంలో డాక్యుమెంట్లను గెజిటెడ్ ఆఫీసర్ అటెస్ట్ చేసేవారు. ఆ విధానాన్ని తొలగించి సెల్ఫ్అటెస్టేషన్ ప్రవేశ పెట్టాం. కింది స్థాయి ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వూ్యలను తొలగిం చడమే కాకుండా కాలం చెల్లిన పురాతనమైన 1,500 నిబంధనలు, చట్టాలను రద్దు చేశాం. ఐఏఎస్ అధికారులు తమ కెరీర్ ప్రారంభంలో మూడు నెలల పాటు కేంద్ర ప్రభుత్వంలో సేవలందించాలని నియమం పెట్టాం. అవినీతి నిరోధక చట్టంలో సవరణ తీసుకొచ్చాం. ప్రధాని ఎక్సలెన్స్ అవార్డుల కోసం కొత్త ఫార్మాట్‌ను రూపొందించాం. ఇదే వరుసలో ముందుకొచ్చిన ఎన్ఆర్ఏ ఒక విశిష్టమైన విధానం. ప్రభుత్వ ఉద్యో గాల నియామక ప్రక్రియలో ఒక ప్రాథమికమైన మార్పుగా దీన్ని పేర్కొనవచ్చు. ఉద్యోగాల కోసం కృషి చేస్తున్న యువత ఒడిదుడు కులు లేకుండా జీవించాలనేది మోదీ ప్రభుత్వవిధానం. అందుకోసం ప్రభుత్వ ఉద్యోగాల నియామక విధానాన్ని, ఎంపిక, ఉద్యోగ కేటా యింపును సరళతరం చేసింది. ఇంతవరకు ఉన్న పలు నియామక పరీక్షలనేవి అభ్యర్థులకు భారంగా మారాయి. ఉద్యోగులను ఎంపిక చేసే సంస్థలపైన కూడా ఇది భారంగా పరిణమించింది. ఖర్చులు, శాంతి భద్రతల సమస్య, పరీక్షా కేంద్రాల ఎంపిక మొదలైన సమ స్యలు ఆందోళన కలిగించేవి. అందువల్ల అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బం దులు కలిగించకుండా, వారికి అనుకూలంగా, తక్కువ వ్యయంతో ఉద్యోగ నియామకాలు చేయడానికి ఎన్ఆర్ఏను ఏర్పాటు చేశాం. సులువుగా పరీక్ష కేంద్రాల అందుబాటు దేశవ్యాప్తంగా ప్రతిజిల్లాలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడంవల్ల అవి మారుమూల ప్రాంత అభ్యర్థులకు సైతం పూర్తిస్థాయిలో అందు బాటులోకి వస్తాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా 117 జిల్లాల్లో పరీక్ష లకు సంబంధించిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ సదుపాయాల కారణంగా ఈ జిల్లాల్లోని అభ్యర్థులు తమ నివాసానికి సమీపంలోనే పరీక్షలకు హాజరు కావచ్చు. ఎన్ఆర్ఏ ఏర్పాటు చేయాలనే ఒక నిర్ణయం కొండప్రాంతాల్లో, గ్రామీణ, మారు మూల ప్రాంతాల్లో నివసించే కోట్లాదిమంది ఉద్యోగార్థులకు వరంలా మారింది. ఈ నిర్ణయం ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు మరింత ప్రయోజనకరం. ఎందుకంటే వివిధ కేంద్రాల్లో వివిధ సమయాల్లో ఈ పరీక్షలను రాయాలంటే మహిళా అభ్యర్థులు అనేక సమస్యలను ఎదు ర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు వారికి ఖర్చులు, శ్రమ తగ్గడమే కాకుండా వారికి తగిన భద్రత కూడా లభిస్తుంది. ఉద్యోగ అవకాశాలను ప్రజ లకు అందుబాటులోకి తేవడానికి తీసుకున్న ఈ నిర్ణయం సాహసో పేతమైనది. ఇది దేశంలోని యువత జీవనాన్ని సరళతరం చేస్తుంది. గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కోసం మాక్‌టెస్ట్ నిర్వహిస్తారు. అంతేకాదు 24/7 హెల్ప్‌లైన్, ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేస్తు న్నారు. సీఈటీలో వచ్చిన మార్కులు మూడేళ్లపాటు పరిగణనలోకి తీసుకుంటారు. ఒక అభ్యర్థి ఎన్నిసార్లయినా పరీక్షలు రాయవచ్చు. పరీక్ష ఫలితాలు వచ్చిన తేదీ నుంచి మూడేళ్లపాటు ఆ మార్కులకు విలువ వుండేలా చేయాలనుకోవడం ఇందులో ఒక గొప్ప అంశం. గరిష్ట వయోపరిమితికి లోబడి ఒక అభ్యర్థి ఎన్నిసార్లయినా పరీక్షలు రాసుకోవచ్చు. వాటిలో ఉత్తమమైన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అమలులో వున్న ప్రభుత్వ విధానం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇంకా ఇతర కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయో పరిమి తిలో సడలింపు ఇస్తారు కూడా. కాబట్టి ఎన్ఆర్ఏ అనేది అభ్యర్థులు ఇంతకాలం పడుతున్న కష్టాలను తగ్గిస్తుంది. అంతేకాదు వారి సమ యాన్ని, డబ్బును ఆదా చేస్తుంది. ప్రామాణికంగా పరీక్షలు గ్రాడ్యుయేషన్, హయ్యర్ సెకండరీ (12వ తరగతి పాస్), మెట్రిక్యు లేషన్ (10వ తరగతి పాస్) ఈ మూడు స్థాయిల అభ్యర్థులకు ప్రత్యే కంగా సీఈటీ వుంటుంది. ఈ అభ్యర్థుల కోసం ప్రస్తుతం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(ఆర్ఆర్బీ), బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఇన్స్టిట్యూట్ (ఐబీపీఎస్) సంస్థలు పరీక్షలు నిర్వ హిస్తున్నాయి. ఇవి ఇకముందు ఉండవు. సీఈటీ స్థాయిలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను విభాగాలుగా వర్గీకరించి తుది ఎంపికకు పంపుతారు. తుది ఎంపిక కోసం పరీక్షలను సంబంధిత నియామక సంస్థలు నిర్వహిస్తాయి. సీఈటీ కోసం పాఠ్యప్రణాళిక ఉమ్మడిగా వుంటుంది. ప్రామాణికంగా వుంటుంది. ఇంతకాలం వివిధ పాఠ్యప్రణాళికలతో ఆయా ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా తయారయ్యే అభ్యర్థులకు ఇకముందు ఆ ఇబ్బంది వుండదు. పరీక్ష కేంద్రాల ఎంపి కలో, పరీక్షల నిర్వహణలో సరళీకరణ సీఈటీ కోసం దరఖాస్తు చేసు కునే అభ్యర్థులు తమ పేర్లను ఉమ్మడి పోర్టల్‌లో నమోదు చేసుకో వచ్చు. అంతేకాదు తమకు అనువైన పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసు కోవచ్చు. అందుబాటునుబట్టి వారికి కేంద్రాలను కేటాయిస్తారు. ప్రభుత్వ అంతిమ ఉద్దేశం ఏంటంటే అభ్యర్థులు తమకు అనుకూల కేంద్రాల్లో పరీక్షలు రాయడం. బహుళభాషల్లో అందుబాటులోకి వస్తున్న సీఈటీ పలు భాషల్లో సీఈటీ రాయవచ్చు. దీని కారణంగా దేశవ్యాప్తంగా పలు భాషలు మాట్లాడే అభ్యర్థులు పరీక్షలు రాయవచ్చు. ఎంపిక అయ్యే అవకాశాలు దేశంలో అందరికీ సమానంగా ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్తో పాటు పన్నెండు భాషల్లో సీఈటీ నిర్వహించడానికి ప్రయ త్నిస్తున్నాం. రాజ్యాంగం 8వ షెడ్యూల్లో పొందుపరిచిన అన్ని భాషల్లో సీఈటీ నిర్వహించడానికి ముందు ముందు ప్రయత్నాలు చేస్తారు కూడా. సీఈటీలో వచ్చే మార్కులను మొదటగా మూడు ప్రధా నమైన రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఉపయోగించుకుంటాయి. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఇతర నియా మక సంస్థలు కూడా వీటిని ఉపయోగించుకుంటాయి. మరికొంత కాలం తర్వాత పబ్లిక్, ప్రైవేట్ రంగంలోని ఇతర సంస్థలు కూడా వారికి అవసరమనుకుంటే ఈ సీఈటీని ఉపయోగించుకోవచ్చు. సహ కార సమాఖ్య విధానం అసలైన స్ఫూర్తిని ప్రతిఫలించేలా సీఈటీ మార్కులను కేంద్ర ప్రభుత్వంలోని ఇతర నియామక సంస్థలు, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లోని నియామక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ఉపయోగించుకోవడం జరుగుతుంది. డాక్టర్ జితేంద్రసింగ్ కేంద్ర సహాయమంత్రి -
మోదీ.. ప్రజల్ని గెలిపించగల నాయకుడు
కరోనా అనంతరం ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత వేగంగా ఎదగగల దేశం భారత్ మాత్రమే. ఇది బిజినెస్ ఇంటెలిజెన్స్‌లో ప్రపంచంలోనే గొప్పది అని పేరుపడిన ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) నివేదిక చెప్పిన మాట. కరోనా వైరస్ మహమ్మారిని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశం భారత్. ఇది ఇప్పుడు ప్రపంచం అంతా అంటున్న మాట. ఎందుకంటే.. వందవ కేసు నమోదైన రోజు నుంచి ముప్పై రోజుల్లో భారత్‌లో నమోదైన మొత్తం కేసులు 15 వేలు కూడా దాటలేదు. కానీ, ప్రపంచానికే పెద్దదిక్కుగా పరిగణించే అమెరికాలో ఏడు లక్షలు దాటితే, బ్రిటన్, చైనా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో సైతం భారత్‌కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మనకంటే ఎక్కువ కేసులు నమోదైనప్పటికీ కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశాలు దక్షిణ కొరియా, సింగపూర్, జపాన్ మాత్రమే. మిగతా అభివృద్ధి చెందిన దేశాల్లోని అన్ని ప్రభుత్వాలూ కరోనాపై యుద్ధంలో చేతులెత్తేశాయి. ఆయా దేశాధినేతలంతా తలలు పట్టుకుంటే, ప్రజలంతా విలవిల్లాడిపోతున్నారు. కొన్ని దేశాధినేతలకూ, వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ వైరస్ సోకింది. దేశాల సరిహద్దులు ఆపలేని, చిన్నా, పెద్దా.. పేద, ధనిక అన్న భేదం లేని వైరస్ ఇది. ఇలాంటి వైరస్‌ను భారత్ చాలా చక్కగా కట్టడి చేసింది. కానీ, ఒకే ఒక్క మతపరమైన కార్యక్రమం కారణంగా దేశంలో కేసులు ఉన్నట్టుండి పెరిగిపోయాయి. కరోనా కేసుల్లో సగానికి పైగా ఆ మత కార్యక్రమ సంబంధమైనవే. ఇక్కడ మతాన్ని కానీ, ఆ మత విశ్వాసాలు పాటించే వారిని కానీ నిందించాల్సిన పనిలేదు. వారి తప్పూ లేదు. కానీ, అందులో ఉన్న కొందరు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే వారికి మంచి చెడ్డలు చెప్పేందుకు పెద్దలు ఎవ్వరూ ముందుకు రాకపోవడమే విషాదం. ఇప్పుడు భారత్ ఆర్థికంగా చూసినా, ఆరోగ్యపరంగా చూసినా చాలా భద్రమైన చేతుల్లో ఉంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతున్నప్పుడు అమెరికా సహా ఏ దేశమూ నేనున్నానంటూ ఒక పెద్దన్న పాత్ర పోషించలేదు, ఒక్క భారత్ తప్ప. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలంటూ ప్రధాని మోదీ సార్క్ దేశాధినేతలకు పిలుపునిచ్చారు. వ్యక్తిగత చొరవతో, వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా కోటి అమెరికన్ డాలర్లతో నిధిని కూడా ఏర్పాటు చేశారు. అక్కడితో ఆగకుండా పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులతో మోదీ ఫోన్లో మాట్లాడారు. కరోనాపై పోరాటానికి భారత్ తరపున అన్ని విధాలా సహాయం చేస్తామని చెప్పారు. మోదీ చొరవను, నాయకత్వ ప్రతిభను అమెరికా, రష్యాలు ప్రశంసించాయి. ‘ప్రపంచం విపత్తుల్లో ఉన్నప్పుడు కావాల్సింది ఇలాంటి నాయకత్వమే’ అని అమెరికా మోదీని అభినందించింది. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు భారతదేశం సర్వసన్నద్ధంగా ఉంది. కరోనా కేసుల్ని, అనుమానితుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిక్షణం సమీక్షిస్తోంది. మహమ్మారి ఉధృతిని తట్టుకునేందుకు అవసరమైనన్ని వైద్య సామగ్రిని, యంత్రాలను సిద్ధం చేసింది. అవసరానికి తగ్గట్టుగా మందుల్ని కూడా దగ్గర ఉంచుకుంది. అత్యంత అభివృద్ధి చెందిన దేశమైన బ్రిటన్‌లో లాగా వైద్యులు డస్ట్‌బిన్ కవర్లను కప్పుకునే దుస్థితి భారతదేశంలో లేదు. ధీమానే కాదు బీమాను కూడా అందించి అభివృద్ధి చెందిన దేశాలు సైతం తనవైపు చూసేలా చేస్తోంది. ఇది ఒక యుద్ధం. ప్రపంచ దేశాలన్నీ ఒక కనిపించని శత్రువుతో పోరాడుతున్నాయి. ఇలాంటి యుద్ధ సమయంలో మోదీ నాయకత్వాన్ని అన్ని దేశాలూ అభినందిస్తోంటే విమర్శలు మాత్రం ఒక దేశం నుంచే వినబడుతున్నాయి. అది మన శత్రుదేశమైన పాకిస్తాన్ నుంచి అనుకుంటే మీరు పొరబడినట్లే. ఆ విమర్శలు వినిపిస్తోంది మన సొంత దేశం నుంచే. ఇలాంటి విపత్తులోనూ రాజకీయం చేయాలని చూసే కాంగ్రెస్ పార్టీ నాయకులే నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఒకప్పుడు మోదీపై పోటీకి దిగి, రోడ్డెక్కి ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ సైతం మోదీ సమయానుకూల నిర్ణయాల వల్లే దేశంలో కరోనా సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం అని బహిరంగంగా ప్రశంసిస్తుంటే, కాంగ్రెస్ నాయకులు మాత్రం కోడిగుడ్డుపై కూడా ఈకలు పీకుతున్నారు. దేశంలో లాక్డౌన్ విధించి 21 రోజులు గడుస్తున్నాయి. తొలిదశ పూర్తయ్యింది. రెండో దశ మొదలు కానుంది. ఈ రోజు వరకూ దేశవ్యాప్తంగా ఒక్కటంటే ఒక్క ఆకలి చావు కూడా లేదు. నిజమే, కొంతమంది వలసకార్మికులు కాలి నడకన వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని మొదలు పెట్టి, మార్గమధ్యంలో చనిపోయారు. ఇది చాలా దురదృష్టకరం. కానీ, వారు అప్పుడు ఉంటున్న నగరాలను వదిలిపెట్టాల్సిన పనిలేదు. సొంతూళ్లకే వెళ్లాల్సిన పనీ లేదు. ఎక్కడివారక్కడ ఉండటం వల్ల నష్టం కూడా ఏమీ లేదు. అందరికీ ఆహారం, మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రయాణాలను రద్దు చేసినా, రాష్ట్రాల సరిహద్దుల్ని మూసివేసినా, నియమాలను, నిబంధనలను అతిక్రమించి ఇంకా కొందరు సొంతూళ్లకు వెళ్లాలనే తపనతో ఆపదల్ని కొనితెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. తన బాధ్యత ప్రకారం ప్రభుత్వం ప్రజలందరికీ భరోసా కల్పిస్తోంది. నూటముప్పై కోట్ల మంది ప్రజల్ని కాపాడేందుకు నరేంద్ర మోదీ కంకణం కట్టుకున్నారు. కనీవినీ ఎరుగని మానవ విపత్తును ప్రపంచం ఎదుర్కొంటున్న సమయంలో ఈ విశ్వంలో ఎన్నడూలేనంత మందిని లాక్డౌన్ చేసి, వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. భారత్‌లోని ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని చాటిచెప్పేందుకు, ప్రజల్లో విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచేందుకు, మనోధైర్యాన్ని నూరిపోసేందుకు పలు కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు. ‘దేశం ముందు.. వ్యక్తిగతం ఆఖరికి’ అన్నది భారతీయ జనతాపార్టీ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని అక్షరాలా రుజువు చేసి, కరోనాపై యుద్ధంలో భారతదేశాన్ని గెలిపించడమే కాదు, తమ దేశాలనూ గెలిపించగల సత్తా ఉందని ప్రపంచదేశాల నాయకులు, ప్రజలు అనుకునేంత ధైర్యాన్ని నింపిన వ్యక్తి మోదీ. పురిఘళ్ల రఘురాం వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, న్యూఢిల్లీ ఈ–మెయిల్ : raghuram.bjp@gmail.com -
ఆ సగానికి అధికారంలో వాటా ఎన్నడు?
మహిళలకు న్యాయంగా అధికారంలో దక్కాల్సిన వాటాను ఇవ్వడం పట్ల విముఖత గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్రోద్యమంలో వారి పాత్రను సహజమైనదిగా అంగీకరించిన మనం స్వాతంత్య్రానంతరం ఏడు దశాబ్దాలుగా అధికారంలో వారికి దక్కాల్సిన వాటాను ఎందుకు నిరాకరిస్తున్నాం? నూతన బ్రిటిష్ పార్లమెంటు లో కొత్త లైంగిక పొందిక కనిపిస్తోంది. పార్లమెంటు సభ్యుల్లో మూడోవంతు మహి ళలే. ప్రపంచంలోని అన్ని పార్లమెంట్లకు తల్లి అయిన బ్రిటన్ పార్లమెంటరీ చరిత్ర లోనే ఇంత అత్యధికంగా మహిళలు ఎన్నిక కావడం ప్రప్రథమం. మన చట్టసభల్లో మహిళలకు మూడింట ఒకటి రిజర్వు చేయాలనే ప్రతిపాదన ఉన్నా అది అంద రానిదిగానే, దాదాపు అసాధ్యంగానే ఉంది. 1996లో తొలుత ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మరో నాలుగుసార్లూ ఆ పని చేశారు. కానీ ఆమోదం లభించలేదు. అలా బోర్లాపడ్డాక ఇక అదొకటి ఉందనే విషయం కూడా తరచుగా మరపున పడి పోతోంది. అయితే పంచాయితీ ఎన్నికల్లో ఆ రిజర్వేషన్లు న్నాయి. కొన్ని రాష్ట్రాలు 50 శాతం కూడా ఇస్తున్నాయి. కాకపోతే బ్రిటన్ మహిళలు ఎలాంటి కోటాలు లేకుం డానే ఆ స్థాయిని సాధించారు. మన దేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు వయోజన ఓటింగు హక్కు ప్రాతిపదికపైనే జరిగాయి. మహిళలపట్ల వివక్ష చూపలేదు. అంతకు పూర్వమే మహాత్మాగాంధీ ‘‘మహిళలు ‘‘ఓటర్లుగా’’ నమోదైతే కలుషిత వాతావారణం పరిశుభ్రమవుతుంది.’’ ఓటు హక్కు ‘‘వారికి స్వతంత్రంగా ఆలోచించడాన్ని నేర్పు తుంది, వారిని కుల శృంఖలాల నుంచి విముక్తం చేసి, వారిలో మార్పును తెస్తుంది’’ అన్నారు. మనమిప్పుడు ఆయనను పెద్దగా పట్టించుకోమనేది వేరే సంగతి. కోటాలు ఉన్న చోట అతి సుతారంగా వాటిని వికృతీకరించి, చాలా సందర్భాల్లో ఆ మహిళల జీవితాల ను శాసించే మగవారే ప్రధాన పాత్రధారులుగా ఉంటు న్నారు. వారి తరఫున వారే ప్రజా ప్రతినిధుల విధులను నిర్వహిస్తున్నారు కూడా. అదంతా మహిళలు సహా ఓటర్లంతా గుసగుసలైనా లేకుండా చూస్తుండగా బహి రంగంగానే జరుగుతోంది.అయినా దాన్ని మన దేశంలో జరిగే చాలా విషయాల్లాగే ఆమోదించడానికి అలవా టుపడ్డాం. ఈ ప్రజాప్రతినిధుల తరపున నెరపే నాయక త్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ.. ఇది అసలు రిజర్వేషన్ల ఉద్దేశ్యాన్నే వక్రీక రిస్తోందని అన్నారు. మహిళలకు వారి వాటాను ఇవ్వడం పట్ల విముఖత గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్రో ద్యమంలో వారి పాత్రను సహజ మైనదిగా అంగీకరిం చిన మనం అధికారంలో వారి న్యాయమైన వాటాను స్వాతంత్య్రానంతరం ఏడు దశా బ్దాలుగా ఎందుకు నిరాకరిస్తున్నాం? మొట్టమొదటి పార్లమెంటులో ఉన్నది కేవలం 19 మహిళలే. ఆ విష యమై మాట్లాడుతూ మహిళలను సభలోకి రానివ్వ డమంటే ‘‘వారికేదో మేలు చేస్తున్నట్టు కాదు’’ అన్నారు. మగాళ్ల ఆధిపత్యం ఉన్న సమాజం ‘‘ఈ విషయంలో అసమాన దృష్టిని’’ చూపు తోంది అని వాపోయారు. బృందాకరత్ ముంబైలోని ఒక పత్రికా సమావేశం లో వాజపేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందడానికి చేయాల్సిం దంతా చేయడం లేదని ఆరోపించారు. అయితే గట్టిగా అడిగితే ఆమె ప్రభుత్వం కాదు అసలు సమస్య పార్లమెం టేనని నిర్ధారించారు. ములాయంసింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్‌ల నేతృత్వంలోని రెండు పార్టీలు రెండూ తమకు అవకాశం దొరికినప్పుడల్లా ఆ బిల్లును అడ్డగించాయని అంగీకరించాయి. వారికి అసలు ‘‘సామాజిక ఎజెండా’’యే లేదని ఆమె తేల్చి చెప్పారు. మహిళల హక్కుల సాధనకు సహాయపడా ల్సిన ఈ పార్టీలు మెనారిటీ వాదం వెర్రినే ప్రధాన కవచంగా ధరించి లైంగిక పక్షపాతం అనే సామాజిక చెడుగును కప్పిపుచ్చడానికి సహాయపడటం మాత్రమే చేశారు. బిహార్‌లో చక్రం తిప్పడానికి లాలూ తన భార్య సహా యం తీసుకోవాల్సి రావడానికి అది అడ్డం కాలేదు. పైగా విలక్షణమైన పంచాయితీ పెద్దలాగా ఆమెను అడ్డు పెట్టుకుని అధికారం సాగించారు. ఈ రాజకీయ సిగ్గు చేటుతనం సీపీఎంకు సైతం ఇబ్బందికరం కాలేదు. అవకాశవాదమే మన రాజకీయాలకు మార్గదర్శక సూత్రం కాబట్టి అందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదనుకోండి. లోక్‌సభకు ఎన్నికైన మహిళల సంఖ్య ఎన్నడూ 10 శాతానికి మించింది లేదు. రాజ్యసభలో వారి సంఖ్య 12 శాతం దాటలేదు. ఆశ్చర్యకరంగా మహిళా వ్యతిరేక ఖాప్ పంచాయితీలు ఆధిపత్యం చలాయించే హర్యానా శాసనసభలో మహిళల వాటా 14 శాతానికి చేరింది. ఇక మిగతా రాష్ట్రాలన్నీ మహిళా రిజర్వేషన్లగురించి మాటలు తప్ప మరేం చేయడం లేదు. ఇంతవరకు ఏ ఎన్నిక లోనూ పోటీదారుల్లో మహిళా అభ్యర్థులు మూడోవం తుకు మించింది లేదు. మహిళల పట్ల పార్టీలలోనే ఉన్న వివక్షకు ఇదే సాక్ష్యం. 73, 74 సవరణల పుణ్యమాని రెం డు దశాబ్దాల క్రితమే అమల్లోకి వచ్చిన రిజర్వేషన్ల ఫలితంగా దేశవ్యాప్తంగా పంచాయితీలు, స్థానిక సంస్థల కు దాదాపు 10 లక్షల మంది మహిళలు ఎన్నికయ్యారు. అయినా తమ పాత్రను వాస్తవంగా పార్లమెంటు, రాష్ట్ర స్థాయిల్లో కూడా విస్తరింపజేయాలని మహిళలు మగ రాజకీయ వేత్తలను ఒప్పించలేకపోయారు. ఆసక్తికరం గా, వారి గొంతు మూగవోయింది. చాలా తరచుగా వాళ్లు మహిళా వ్యతిరేక పురుష దృక్పథంతో అర్ధాంగీకా రం తెలుపుతున్నట్టనిపిస్తోంది. అది విషాదకరం. బ్రిటన్ పార్లమెంటరీ ఎన్నికలైనా వారి కళ్లు తెరిపిస్తాయా? (వ్యాసకర్త: మహేష్ విజాపుర్కార్ సీనియర్ పాత్రికేయులు)