ఆంతర్యం ఏమిటి? | what's the meaning in Bhagavan | Sakshi
Sakshi News home page

ఆంతర్యం ఏమిటి?

Published Fri, Jan 17 2014 3:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM

ఆంతర్యం ఏమిటి?

ఆంతర్యం ఏమిటి?

‘‘భగవాన్, ఇక నువ్వు మాకు లేకపోయినా ఫరవాలేదనుకుంటాను. ఎందుకంటే ఈ విషయం నీకు వదిలేయమని చెప్పగా, ‘అలా వదలను. నేను తేల్చుకుతీరాల్సిందే’ నంటున్నా డు ఈ సోదరుడు’అని నివేదించుకున్నాడు.
 
 బాహ్యమైన పనులు చేసేప్పుడు కూడా ‘నీవెవరు’ అనే విచారణ కొనసాగించవచ్చునని ‘భగవాన్’ సలహా ఇచ్చారు. ‘భగవాన్, ఇక నువ్వు మాకు లేకపోయినా ఫరవాలేదనుకుంటా ను’ అనే స్థితికి ఒక భగవదన్వేషకుడు వచ్చాడు. ఆ సందర్భాలు చూడడం, వాటి ఆంతర్యాన్ని గమనించడం ఒక మంచి అనుభవం.
 
 ఉన్నది విచారణే; కర్తలేడు
 శ్రీమతి థార్: బాహ్యమైన పనులు చేసే ప్పుడు కూడా ‘నీవెవరు’ అనే విచారణ కొనసాగించవచ్చునని భగవాన్ సలహా ఇస్తారు. ఈ విచారణ పర్య వసానం ఆత్మసాక్షాత్కారం. అందుచేత ఉచ్ఛ్వాసనిశ్వాసలు ఆగాలి. శ్వాస ఆగిపోతే పని ఎట్లా కొనసాగుతుంది? మరోవిధంగా చెప్పాలంటే, పని చేస్తూ ఉన్నప్పుడు శ్వాస ఎలా ఆగు తుంది? రమణ మహర్షి: సాధన సాధ్యాల మధ్య గందరగోళపడుతున్నారు. విచారణ చేసే వాడెవరు? సాక్షాత్కారం కోరుతున్నవాడే కానీ, సిద్ధుడు కాడుగదా? విచారణ తన కన్నా భిన్నమైనదని అనుకుంటున్నవాడు విచారణ కర్త.
 
 ఈ ద్వంద్వం ఉన్నంతకాలం విచారణ సాగించా ల్సిందే. ఆత్మ శాశ్వతమని కనుగొనే వరకూ, విచా రణా, విచారణకర్త, అన్నీ అందులో భాగమేనని, వ్యక్తి అనేవాడు లేనే లేడని తెలిసేవరకూ విచారణ సాగాలి.  సత్యమేమిటంటే, ఆత్మనిత్యమైనటువంటిది. అది నిరంతరము ఎఱుకతోనే ఉంటుంది. విచారణ ఉద్దేశం, ఈ ఆత్మ నిజస్వభావం ‘ఎఱుక’ అని కనుగొ నడమే. ఆత్మ, ఎఱుక వేర్వేరుగా ఉన్నట్లు కనిపించి నంతవరకూ, విచారణ సలుపుతూ ఉండాల్సిందే.
 
 దేవుడు అవసరమా?

 ఒక భగవదన్వేషకుణ్ణి, మరో అన్వేషకుడు అవమాన పరిచాడు. అవమానితుడికి గుండె ప్రతీకారేచ్ఛతో రగిలిపోయింది. ఒక సాధు పురుషుడి వద్దకొచ్చి జరి గిందంతా చెప్పి, ‘‘వాడు చేసిన ఈ పనికి వాడి మీద పగ సాధించి తీరతాను’’అని తన ఆగ్రహాన్ని ప్రద ర్శించాడు. మనుసును శాంతపరచుకోమనీ, జరిగిన సంఘ టనని భగవదర్పితం చేయమనీ సలహా ఇచ్చాడు సాధువు. అన్వేషకుడు ఆ మాట పట్టించుకోకుండా ‘వాడి సంగతి తేల్చుకు తీరుతాను’అన్నాడు.సాధువు లేచినుంచొని చేతులెత్తి నమస్కరిస్తూ భగవంతుణ్ణి ఇలా ప్రార్థించాడు. ‘‘భగవాన్, ఇక నువ్వు మాకు లేకపోయినా ఫరవాలేదనుకుంటాను. ఎందుకంటే ఈ విషయం నీకు వదిలేయమని చెప్పగా, ‘అలా వదలను. నేను తేల్చుకుతీరాల్సిందే’ నంటున్నా డు ఈ సోదరుడు’అని నివేదించుకున్నాడు. ఈ ప్రార్థనను వింటున్న అన్వేషకుడు తన పొర పాటు గ్రహించి, అవమానించినవాడిపై పగ విరమిం చానని సాధువుతో విన్నవించుకున్నాడు.
 - నీలంరాజు లక్ష్మీప్రసాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement