Bhagavan
-
ధర్మ సందేహాలు: వాకింగ్ చేస్తూ భగవంతుని ధ్యానం మంచిదేనా?
భగవంతుని ధ్యానం చేసేటప్పుడు శుచిగా ఉండాలంటారు. నేను చాలాకాలం నుండి వాకింగ్ చేసేటప్పుడు భగవద్ధ్యానం చేస్తున్నాను. అది దోషమా? ‘ధ్యానం‘ శుచిగా చేయడం శ్రేష్ఠం. దానికి ఆసనం, ప్రాణాయామం సమకూరాలి. అటు తరువాతనే ధ్యానం. అయితే, నడకలో చేసే దానిని ’స్మరణ’ అంటారు. అది శ్రేష్ఠమైన విషయం. భగవత్ స్మరణ సర్వపాపహరం సర్వాభీష్ట ఫలప్రదం. అది నిరభ్యంతరంగా నడకలో చేయవచ్చు. మీరు చాలా కాలం నుండి చేస్తున్న భగవత్ స్మరణ మంచిదే. ధ్యానానికి గానీ, స్మరణకిగానీ ఆచమనం, సంకల్పం అవసరం లేదు. అవి లేకుండానే ధ్యాన–స్మరణలు చేయవచ్చు. అందులో దోషం ఏమీ లేదు. వాటికి తప్పక ఫలితం ఉంటుంది. పూజ’ అనేది బాహ్యం, మానసికం అని రెండు విధాలు. మానసిక పూజకి దేవుడు ఎదురుగా ఉండనక్కర్లేదు. ఈ మానసిక పూజని కొంతమేరకు ’ధ్యానం’ అని నిర్వచించవచ్చు. బాహ్య పూజకు ఎదురుగా దేవుని బింబం (పటంగానీ, విగ్రహంగానీ) ఎలాగూ అవసరమే కదా! ఆ పూజకు ఆచమనం, సంకల్పం వగైరాలు అవసరమే. బాహ్యపూజ వలన శరీర, మనశ్శుద్ధులు ఏర్పడి మానసికమైన భావన, స్మరణ, ధ్యానం వంటివి శీఘ్రంగా సిద్ధించే అవకాశం కలుగుతుంది. ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారని అంటారు. నిజంగానే అంతమంది దేవతలున్నారా?ముప్పైమూడు కోట్ల మంది దేవతలు ఉన్న మాట నిజమే. ఇక్కడ కోటి అంటే మనం అనుకునే నూరు లక్షలు కాదు. సంస్కృతం లో కోటి అంటే విభాగం అని అర్ధం. మొత్తం ముప్పై మూడు రకాలయిన దేవతలు అని అర్థం వస్తుంది. వారు వరుసగా అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, ఇంద్రుడు, బ్రహ్మ (ప్రజాపతి) కలిపి మొత్తం ముప్పైమూడు మంది దేవతలు. -
భగవాన్ టీచరంటే ఎందుకంత ప్రేమ?
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడు తిరువల్లూర్‌లోని వెలైగారం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు టీచర్‌గా పనిచేస్తున్న 28 ఏళ్ల భగవాన్ బదిలీపై మరో పాఠశాలకు వెళ్లడాన్ని తట్టుకోలేని ఆ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు, ఆయన్ని వెళ్లద్దంటూ ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో తీవ్రంగా హల్చల్ చేస్తున్న విషయం తెల్సిందే. దీనిపై ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, నటుడు హృతిక్ రోషన్లు, కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్‌లు కూడా తమదైన శైలిలో స్పందించారు. ఇలాంటి ‘గురుశిష్యుల’ అనుబంధం తానెక్కడా చూడల్లేదంటూ రెహమాన్ వ్యాఖ్యానించగా, వీరి అనుబంధం తన హృదయాన్ని ఎంతో హత్తుకుందని హృతిక్ రోషన్ వ్యాఖ్యానించారు. భగవాన్ లాంటి ఉపాధ్యాయులు తమకు ఎంతో మంది అవసరం అంటూ కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనిల్ వ్యాఖ్యానించారు. తాను ఇంతగా విద్యార్థినీ విద్యార్థులతో ఎలా అనుబంధాన్ని పెంచుకున్నారో భగవాన్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా విన్నవించారు. ‘నేను విద్యార్థులతో ఓ అనుబంధాన్ని ఏర్పరుచుకోవడంలో భాగంగా వారికి ఆసక్తికరమైన కథలను చెప్పేవాడిని. పాఠాలను కూడా అదే తరహాలో బోధించేందుకు ప్రయత్నించేవాడిని. వారి వారి కుటుంబాల నేపథ్యం గురించి విచారించే వాడిని. వారి భవిష్యత్ ప్రణాళికల గురించి గుచ్చి గుచ్చి అడిగి తెలుసుకునేవాడిని. వారి కుటుంబ నేపథ్యాలు, వారి భవిష్యత్తు కలలను దృష్టిలో పెట్టుకొని వారు భవిష్యత్తులో ఎంచుకోవాల్సిన మార్గాల గురించి సూచించే వాడిని’ అని చెప్పారు. భగవాన్ ఉదంతాన్ని పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉన్న రెండు ప్రధాన లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భగవాన్ ఇంగ్లీషు టీచరు. అయినప్పటికీ ఆయన తప్పులు లేకుండా ఇంగ్లీషును మాట్లాడలేక పోతున్నారు. ఆయన సాదాసీదా అందరికి తెలిసిన సాధారణ పదాల్లోనే తన అభిప్రాయాలను చెబుతూ వచ్చారు. వాటిలోనూ వ్యాకరణ దోషాలు కనిపించాయి. ఆయన కూడా చదువుకున్నది ప్రస్తుత ప్రభుత్వ విద్యా విధానంలోనే కావడం వల్ల ఆయనకు కూడా భాష అంతగా అబ్బినట్లు లేదు. ఇది ప్రభుత్వ విద్యావిధానంలో ఉన్న ప్రధాన లోపాల్లో ఒకటి. ఇక రెండో లోపం కూడా విద్యార్థులతో ఆయన పెనవేసుకున్న బంధమే సూచిస్తోంది. ఏ ఉపాధ్యాయుడికైనా విద్యార్థులతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నప్పుడే విద్యారంగంలో గురుశిష్యులు రాణించగలరు. ఇలాంటి బంధాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ విద్యా విధానాలు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం విద్యారంగాన్ని కూడా అన్ని ప్రభుత్వ విభాగాల్లాగే చూస్తోంది. ఉపాధ్యాయులను ఇతర విభాగాల గుమాస్తాలుగా పరిగణిస్తోంది. ఆ ధోరణి మారాలి. అవసరమైతే బదిలీ నిబంధనల్లో మార్పులు తీసుకరావాలి. వెలైగారంలో భగవాన్ టీచర్ బదిలీని ఆపాల్సిందిగా గ్రామస్థులు కూడా కోరగా అది తన చేతిలో లేదంటూ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చేతులెత్తేశారు. నచ్చిన టీచర్‌ను కాకుండా ఉత్తమ టీచరును రిటేన్ చేసుకునే అధికారం ప్రధానోపాధ్యాయుడికి ఉండాలి. విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే కనుక సామాజిక శాస్త్రంలో వారికి సరైన శిక్షణ ఉండాలి. విద్యార్థులకు కూడా చిన్పప్పటి నుంచే సమాజాన్ని అర్థం చేసుకునే పాఠ్యాంశాలు ఉండాలి. ఎందుకంటే భగవన్ను, విద్యార్థుల మధ్య బంధాన్ని పెంచిందీ ఈ అంశాలే. భగవాన్‌కు సంబంధించిన వీడియో వైరల్ కాగానే కొంత మంది సినీ నిర్మాతలు ఆయనపై సినిమా తీసేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. గురుశిష్యుల అనుబంధం గురించి చెప్పి నాలుగు డబ్బులు వెనకేసుకునే విధంగా ఆయనపై సినిమా ఉండకూడదు. ఆయన విద్యార్థులతో ఎందుకు అలాంటి అనుబంధాన్ని ఏర్పరుచుకోవాల్సి వచ్చిందో వివరణ ఉండాలి. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను పాలకుల దృష్టికి తీసుకెళ్లే విధంగానూ సినిమా ఉండాలి. -
ఆ ఉపాధ్యాయుడి నేపథ్యంపై సినిమా
పళ్లిపట్టు: ఉపాధ్యాయుడు భగవాన్‌పై విద్యార్థుల ప్రేమ పోరాటానికి సంబంధించి సినిమా తీసేందుకు వీలుగా సినీ డైరెక్టర్లు ఇద్దరు శుక్రవారం వెలిగరం పాఠశాల్లో భగవాన్ను కలిసి చర్చలు జరిపారు. అదే సమయంలో డీఈఓ విచారణ, తమ ఉపాధ్యాయుడిని బదిలీని నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులు విద్యాశాఖ మంత్రిని కలిసిందుకు నిర్ణయించుకోవడంతో వెలిగరం పాఠశాల్లో శుక్రవారం సైతం హడావుడి చోటుచేసుకుంది. పళ్లిపట్టు సమీపంలోని వెలిగరం పాఠశాల్లో ఆంగ్లం బీటీ టీచర్ భగవాన్ నాలుగేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఈ స్థితిలో పాఠశాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల ఉండేలా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం 35 మంది విద్యార్థులకు ఒక్క టీచర్ నిష్పత్తిలో ఉండాలి. అయితే వెలిగరం పాఠశాల్లో 280 మంది విద్యార్థులకు ప్రస్తుతం 19మంది టీచర్లు (తెలుగు మీడియం ఉపాధ్యాయులతో కలిపి) ఉన్నారు. వారిలో టీచర్ పోస్టులో ఉన్న జూనియర్లను స్థాన చలనం చేయాల్సి రావడంతో ఇద్దరు టీచర్లను వేర్వేరు పాఠశాలకు బదిలీ చేస్తూ కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగులు కేటాయించారు. అయితే భగవాన్ బదిలీ సమాచారంతో పాఠశాల విద్యార్థులు చలించి తరగతులు బహిష్కరించి ప్రేమ పోరాటం నిర్వహించిన విషయం తెలిసిందే. బదిలీ అయ్యేందుకు పాఠశాలకు వచ్చిన భగవాన్ను విద్యార్థులు చుట్టిముట్టి తమ పాఠశాలను వీడి వెళ్లరాదని బోరున విలపించడంతో విద్యార్థుల ప్రేమకు చలించిన టీచర్ సైతం విలపించారు. విద్యార్థులు గ్రామీణుల కోర్కె మేరకు కొద్ది రోజుల పాటు బదిలీ నిలిపివేస్తూ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో శుక్రవారం భగవాన్ యథావిధిగా వెలిగరం పాఠశాలకు వెళ్లి విధులు నిర్వహించారు. ఈ స్థితిలో ఉదయం పది గంటల సమయంలో చెన్నైకు చెందిన సినిమా డైరెక్టర్లు ఇద్దరూ పాఠశాలకు వెళ్లి భగవాన్‌కు కలుసుకుని విద్యార్థులు, టీచర్ అనుబంధం మీద సినిమా తెరకెక్కించడంపై మంతనాలు జరిపారు. అదే సమయంలో పాఠశాలకు చేరుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి అరుల్‌సెల్వం ప్రధానోపాధ్యాయులు అరవింద్ సహా 18 మంది ఉపాధ్యయులతో సంఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు. విచారణ వివరాలను జిల్లా ఉన్నత విద్యాశాఖ అధికారికి సమర్పించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అదే సమయంలో మరో వారంలో భగవాన్ను మరో పాఠశాలకు బదిలీ చేయనుండడంతో, బదిలీని నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులు విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ డైరెక్టర్‌ను కలిసి వేడుకోవాలని నిర్ణయించారు. -
పోలీసుల మధ్య ఘర్షణ: ఎస్సైకి తీవ్రగాయాలు
విశాఖపట్నం : విశాఖపట్నం నగరంలో సీతమ్మధార తహశీల్దార్ కార్యాలయంలో ఇద్దరు పోలీసుల మధ్య గురువారం రాత్రి జరిగిన ఘర్షణలో ఓ ఎస్సైకు తీవ్ర గాయాలయ్యాయి. నగరంలో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భగవాన్‌తో కానిస్టేబుల్ అమ్మోరు డ్యూటీ విషయమై వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో ఇరువురు పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. కానిస్టేబుల్ అమ్మోరు తనను వెపన్తో కొట్టి గాయపరిచాడని ఎస్ఐ ఆరోపించాడు. అలాగే ఎస్ఐ భగవాన్ తనను కులం పేరుతో దూషించడమే కాకుండా తరచు వేధించాడని కానిస్టేబుల్ ఆరోపించాడు. అయితే అమ్మోరును నాలుగో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గాయాలపాలైన ఎస్ఐ భగవాన్ను స్థానిక ఆసుపత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నారు. -
ఆంతర్యం ఏమిటి?
‘‘భగవాన్, ఇక నువ్వు మాకు లేకపోయినా ఫరవాలేదనుకుంటాను. ఎందుకంటే ఈ విషయం నీకు వదిలేయమని చెప్పగా, ‘అలా వదలను. నేను తేల్చుకుతీరాల్సిందే’ నంటున్నా డు ఈ సోదరుడు’అని నివేదించుకున్నాడు. బాహ్యమైన పనులు చేసేప్పుడు కూడా ‘నీవెవరు’ అనే విచారణ కొనసాగించవచ్చునని ‘భగవాన్’ సలహా ఇచ్చారు. ‘భగవాన్, ఇక నువ్వు మాకు లేకపోయినా ఫరవాలేదనుకుంటా ను’ అనే స్థితికి ఒక భగవదన్వేషకుడు వచ్చాడు. ఆ సందర్భాలు చూడడం, వాటి ఆంతర్యాన్ని గమనించడం ఒక మంచి అనుభవం. ఉన్నది విచారణే; కర్తలేడు శ్రీమతి థార్: బాహ్యమైన పనులు చేసే ప్పుడు కూడా ‘నీవెవరు’ అనే విచారణ కొనసాగించవచ్చునని భగవాన్ సలహా ఇస్తారు. ఈ విచారణ పర్య వసానం ఆత్మసాక్షాత్కారం. అందుచేత ఉచ్ఛ్వాసనిశ్వాసలు ఆగాలి. శ్వాస ఆగిపోతే పని ఎట్లా కొనసాగుతుంది? మరోవిధంగా చెప్పాలంటే, పని చేస్తూ ఉన్నప్పుడు శ్వాస ఎలా ఆగు తుంది? రమణ మహర్షి: సాధన సాధ్యాల మధ్య గందరగోళపడుతున్నారు. విచారణ చేసే వాడెవరు? సాక్షాత్కారం కోరుతున్నవాడే కానీ, సిద్ధుడు కాడుగదా? విచారణ తన కన్నా భిన్నమైనదని అనుకుంటున్నవాడు విచారణ కర్త. ఈ ద్వంద్వం ఉన్నంతకాలం విచారణ సాగించా ల్సిందే. ఆత్మ శాశ్వతమని కనుగొనే వరకూ, విచా రణా, విచారణకర్త, అన్నీ అందులో భాగమేనని, వ్యక్తి అనేవాడు లేనే లేడని తెలిసేవరకూ విచారణ సాగాలి. సత్యమేమిటంటే, ఆత్మనిత్యమైనటువంటిది. అది నిరంతరము ఎఱుకతోనే ఉంటుంది. విచారణ ఉద్దేశం, ఈ ఆత్మ నిజస్వభావం ‘ఎఱుక’ అని కనుగొ నడమే. ఆత్మ, ఎఱుక వేర్వేరుగా ఉన్నట్లు కనిపించి నంతవరకూ, విచారణ సలుపుతూ ఉండాల్సిందే. దేవుడు అవసరమా? ఒక భగవదన్వేషకుణ్ణి, మరో అన్వేషకుడు అవమాన పరిచాడు. అవమానితుడికి గుండె ప్రతీకారేచ్ఛతో రగిలిపోయింది. ఒక సాధు పురుషుడి వద్దకొచ్చి జరి గిందంతా చెప్పి, ‘‘వాడు చేసిన ఈ పనికి వాడి మీద పగ సాధించి తీరతాను’’అని తన ఆగ్రహాన్ని ప్రద ర్శించాడు. మనుసును శాంతపరచుకోమనీ, జరిగిన సంఘ టనని భగవదర్పితం చేయమనీ సలహా ఇచ్చాడు సాధువు. అన్వేషకుడు ఆ మాట పట్టించుకోకుండా ‘వాడి సంగతి తేల్చుకు తీరుతాను’అన్నాడు.సాధువు లేచినుంచొని చేతులెత్తి నమస్కరిస్తూ భగవంతుణ్ణి ఇలా ప్రార్థించాడు. ‘‘భగవాన్, ఇక నువ్వు మాకు లేకపోయినా ఫరవాలేదనుకుంటాను. ఎందుకంటే ఈ విషయం నీకు వదిలేయమని చెప్పగా, ‘అలా వదలను. నేను తేల్చుకుతీరాల్సిందే’ నంటున్నా డు ఈ సోదరుడు’అని నివేదించుకున్నాడు. ఈ ప్రార్థనను వింటున్న అన్వేషకుడు తన పొర పాటు గ్రహించి, అవమానించినవాడిపై పగ విరమిం చానని సాధువుతో విన్నవించుకున్నాడు. - నీలంరాజు లక్ష్మీప్రసాద్