సర్వజ్ఞుడి తీర్పే మేలు | Saints will know of power of god | Sakshi
Sakshi News home page

సర్వజ్ఞుడి తీర్పే మేలు

Published Fri, Jun 6 2014 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

సర్వజ్ఞుడి తీర్పే మేలు

సర్వజ్ఞుడి తీర్పే మేలు

సాధ పురుషుడొకడు, ఓ సందులో, ఇళ్ల మధ్య నడిచి వెళ్తుంటే, ఎవరో పొయ్యి లోని బూడిద ఓ తట్టలోకి తీసి బయట పడేశారు. అది అతడి తల మీద పడింది. అందుకు సాధువు విచిత్రంగా స్పందించాడు. చేతులు జోడించి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ‘‘నిన్నేమని పొగడను దేవా! బూడిదకాక ముందు, ఆ పొయ్యిలో మండే బొగ్గులు నా తల మీద కుమ్మరించినా, చేసిన పాపాలకు అందుకు నేను అర్హుణ్నే. కానీ నీ అపారమైన దయ మూలంగా, అంతటి శిక్షను తగ్గించి, నిప్పులు బదులు, నేను ఓర్చుకోగలిగిన ఈ చల్లటి బూడిద పడేయించావు’’ అని విన్నవించుకున్నాడు.
 
 సాధుపురుషుడైనవాడే తాను ఒకప్పుడు - అది నిన్నగానీ, నిరుటేడు గానీ, ఈ జన్మలో గానీ, మరే జన్మలో గానీ - చేసిన కర్మకు ఫలితమునుభవిం చక తప్పదని తెలుసుకొని బ్రతుకుతుంటాడు.  వర్తమా నంలో తానేదైనా ఇక్కట్టుకు గురైతే అది పూర్వజన్మ ఫలిత మని గ్రహించి, ఈ ఇక్కట్టును గానీ, దీనిని తనపై విధించిన విధాతను గానీ నిందించ కుండా, సంపూర్ణ సమ్మతితో  అనుభవిస్తాడు. ఈ తెలివి లేనివాడు, ఈ కార్య కారణ సంబంధమెరుగనివాడు, ఆక్రోశపడుతూ దీని నుండి తప్పించుకోవడానికి పలు విఫలయత్నాలు చేసి అనుభవిస్తాడు. అనుభవమనేది ఇద్దరి విషయంలోనూ సమానమే. కానీ తెలివిగలవాడు ‘ప్రతిక్రియా’ భావం లేకుండా విధికి తల ఒగ్గాడు కాబట్టి, విధితో సహక రిస్తున్నాడు. కాబట్టి అతడి బాధ కాస్త ఉపశమిస్తుంది. తేలిగ్గా ఆ అనుభవం వెళ్లిపోతుంది. రెండోవానికి ఆ తెలివి, ఆ ఎరుక లేవు కాబట్టి ప్రతిక్రియా భావంతో పెనుగులాడి అనుభ వాన్ని మరింత కఠినంగా చేసు కుంటాడు. అవగాహన లేని మానవుడు రోదిస్తాడు. విసు గును ప్రదర్శిస్తాడు. కొత్త పాపం చేయకూడదనే గుణ పాఠం నేర్చుకోడు. జన్మ పరంపర కొనసాగుతుంది.
 ఎదురుగా ఉన్న వాస్తవం ‘భగవంతుడు’ అని అనుకుంటే (ట్రూత్ రియాలిటీ) ఈ ఎదురుగా ఉన్నది భగవదేచ్ఛ ప్రకారమే జరుగుతున్నదనుకోవాలి. భగవంతుడు సృష్టిస్తున్న కోటానుకోట్ల జీవరాశిలో మనం ఒకరం. మనం ఒకప్పుడు చేసిన కర్మలకి ఎలాంటి ఫలితమనుభవిం చాలో అతడికి తెలిసినంతగా మనకు తెలియదు.
 
 నీకు విధాయకంగా ఏది మేలు చేస్తుందో, దీర్ఘకాల భవి ష్యత్తును దృష్టిలో ఉంచుకొని దానినే  విధి నిర్వర్తిస్తున్నది. ఇది నమ్మితే నీ సమస్య పరిష్కారమవుతుంది. నువ్వు నమ్మకపోయినా, జరిగేది అంతే జరుగుతుంది. నమ్మని వారు అంతఃసంఘర్షణ పడుతూ శక్తిని కోల్పోతుంటారు. ఎంతగట్టిగా అనుకున్నప్పటికీ ‘ఇదేమేలని’ ఖాయంగా చెప్పగలిగేది లేదు. మనకా సర్వజ్ఞత్వమెలావుంటుంది! ఆ సర్వజ్ఞుడికి తెలిసి ఉండవచ్చు. మన పరిమితమైన జ్ఞానాన్ని విశ్వసించడం బదులు, ఆ సర్వజ్ఞుడి తీర్పును శిరసావహించడం శ్రేయోదాయకమవచ్చు.
 - నీలంరాజు లక్ష్మీప్రసాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement