చంఢీగడ్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమ్‌ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, పంజాబ్‌లోని జైటో ఎమ్మెల్యే బల్దేవ్ సింగ్ ఆప్‌కు రాజీనామా చేశారు. పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారంపై అసంతృప్తితో తాను పార్టీ నుంచి వైదులుతున్నానని బుధవారం వెల్లడించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాత్రమే రాజీనామా చేసిన బల్దేవ్ సింగ్.. ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయ్యలేదు. కేజ్రీవాల్ తీరు, ఆయన అహంకారం కారణంగానే తాను పార్టీ నుంచి బయటకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
కాగా పంజాబ్‌లో ఇటీవల వరుసగా నేతలు పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే. ఆపార్టీ కీలక నేత సుఖ్‌పాల్ సింగ్ గత నవంబర్‌లో పార్టీకి రాజీనామా చేశారు. సుఖ్‌పాల్‌కు ప్రధాన అనుచరుడైన బల్దేవ్ సింగ్ కూడా ఆయన మార్గంలోనే నడిచారు. కాగా మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతల రాజీనామాలు పంజాబ్ ఆప్ నాయకత్వాన్ని కలవరపెడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment