
ముంబై: మాజీ హీరోయిన్, బహుభాషా నటి ఇషా కొప్పీకర్ ఆదివారం భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో ఆమె కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
‘ఖల్లాస్ గాల్’గా పాపులరయిన ఇషా కొప్పీకర్ 1998లో తమిళ సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశారు. 2000 సంవత్సరంలో ‘ఫైజా’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. కంపెనీ, దిల్ కా రిష్తా, ఖాయామత్, తుజే మేరీ కసమ్, హమ్ హమ్, క్యా కూల్ హై హమ్, మైనే ప్యార్ కౌన్ కియా, 36 చైనా గేట్ తదితర సినిమాల్లో నటించారు. తెలుగులో చంద్రలేఖ, ప్రేమతో రా, కేశవ చిత్రాల్లో కనిపించారు. కన్నడ, మరాఠీ సినిమాల్లోనూ ఆమె నటించారు. 2009, నవంబర్ 29న వ్యాపారవేత్త టిమ్మీ నారంగ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐదేళ్ల పాప ఉంది.
Comments
Please login to add a commentAdd a comment