చిత్తుగా ఓడిపోయిన సాయికుమార్‌ | Actor Sai kumar loses in karnataka Assembly Elections | Sakshi
Sakshi News home page

Published Tue, May 15 2018 11:38 AM | Last Updated on Wed, Apr 3 2019 9:02 PM

Actor Sai kumar loses in karnataka Assembly Elections - Sakshi

బెంగళూరు : డైలాగ్‌ కింగ్‌, బహుభాష నటుడు సాయికుమార్‌ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మరో సారి చిత్తుగా ఓడిపోయారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్‌-కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి శాసన సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ డైలాగ్‌ కింగ్‌కు తెలుగు సెంటిమెంట్‌ కలిసిరాలేదు. ఈ సారి సైతం అతను ఓటమి పాలయ్యాడు.

కాంగ్రెస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి విజయానికి చేరువగా ఉండగా.. సీపీఎం, జేడీఎస్‌ అభ్యర్థులు రెండోస్థానంలో నిలిచారు. రాష్ట్రమంతా బీజేపీ హవా కొనసాగుతున్నా సాయికుమార్‌ మాత్రం నాలుగోస్థానంతో సరిపెట్టుకున్నాడు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సాయికుమార్‌ ఈ స్థానం నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement