కర్ణాటక ఎన్నికల్లో మఠాల ప్రభావం ఎక్కువ.. | Monasteries Impact High In Karnataka Assembly Elections | Sakshi
Sakshi News home page

కర్ణాటక ఎన్నికల్లో మఠాల ప్రభావం ఎక్కువ..

Published Tue, May 15 2018 9:23 AM | Last Updated on Wed, Sep 5 2018 3:24 PM

Monasteries Impact High In Karnataka Assembly Elections - Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు మరికొద్దిగంటల్లో తెరపడనుంది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కన్నడ ఎన్నికల్లో ఓటరు ఎవరికి పట్టం గట్టారనేది తేలిపోనుంది. కానీ ఈ ఎన్నికల్లో మఠాల ప్రభావం ఎక్కవుగా కనిపిస్తోంది. ఓట్ల కోసం రాజకీయ నాయకులు మఠాల చుట్టూ తిరిగారు. 

  • మాండ్యలో ఒక్కలిగల ఓటును శ్రీక్షేత్ర ఆదిచుంచునగిరి నిర్ణయిస్తుంది. ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఎన్‌. శివన్న, ‍కాంగ్రెస్‌ నుంచి పి. రవికుమార్‌, జేడీఎస్‌ నుంచి ఎం. శ్రీనివాస్‌లు బరిలో ఉన్నారు. ప్రస్తుతం జేడీఎస్‌ అభ్యర్థి ఎం. శ్రీనివాసులు ముందజలో ఉన్నారు.
  • హావేరీ నియోజకవర్గంలో కగినెలె కనక గురుపీఠం కురబలల ఓటును నిర్ణయించనున్నది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి నెహ్రూ ఒలేకర్ అధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి రుద్రప్ప లామాని పోటీలో ఉన్నారు.
  • చిత్రదుర్గ నియోజకవర్గంలో బసవ మాచిదేవ స్వామిజీ మాదిగలకు ఆరాధ్యం. ఈ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి జీహెచ్ తిప్పారెడ్డి ముందజలో ఉన్నారు. హెచ్‌ఎ షణ్ముఖప్ప బరిలో ఉన్నారు.
  • తుముకూరులో లింగాయత్‌లపై సిద్ధగంగ మఠం ప్రభావం ఎక్కువగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement