
సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ చేస్తున్న అవినీతి వల్లే రాష్ట్రానికి ఏ పరిశ్రమలు రావడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, దేశంలోనే అవినీతిలో ఏపీ మొదటి స్థానంలో ఉందని ఆన్‌లైన్ సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో టీడీపీ సర్కార్ మరోసారి లేని గొప్పలు చెప్పుకునేందుకు సిద్ధమైందని ఎద్దేవా చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఎన్ని కోట్ల పెట్టుబడులు ఏపీకి తీసుకొచ్చారు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఆకాశం ఏమైనా బద్దలవుతుందా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.
గతంలో పలుమార్లు ఏపీకి ర్యాంకులొచ్చాయి. వాస్తవానికి ఏ రంగంలోనూ ఏపీని చంద్రబాబు అభివృద్ది చేయలేదు. గత ఎన్నికల్లో 600 హామిలిచ్చి ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. నాలుగేళ్లు పూర్తయినా రాజధాని అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణమైనా కట్టారా. తాత్కాలిక భవనాల పేరుతో దోపిడీ చేస్తున్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు 87 వేల కోట్ల రూపాయలుగా ఉన్న రైతుల రుణాలు నాలుగేళ్లు ముగిసేసరికి 1.3 లక్షల కోట్ల రూపాయలు చేసిన ఘనత చంద్రబాబుదే. నిజంగానే మాఫీ చేసి ఉంటే నాలుగేళ్ల టీడీపీ పాలనలో రైతుల రుణాలు దాదాపు మరో 43వేల కోట్ల రుణాలు అదనంగా ఎందుకు పెరిగాయో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఇసుక మాఫియా, కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులో టీడీపీ నేతలే ఉన్నారు.
ప్రయోజనం లేని సీఎం విదేశీ పర్యటనలు
చంద్రబాబు ప్రయోజనం లేని విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకులు ఇచ్చిన ర్యాంకులు ప్రజలకు వద్దు. చంద్రబాబు పాలనలో ఏపీ అప్పుడు 2.3 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. అప్పు తెచ్చిన డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాల్సిన బాధ్యత ఏపీ సర్కార్‌పై ఉంది. వీటిపై విచారణ చేయించాల్సిన అవసరం కూడా ఉంది. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు సాధించిందేమీ లేదు. చంద్రబాబు పారిశ్రామిక విధానాలతో ఏపీకి ఏం లబ్ధి చేకూరింది. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు, లోకేష్‌ల అవినీతికి భయపడి ఏపీకి పరిశ్రమలు రావడం లేదు. బ్యాంకులు, సంస్థలు ఇచ్చిన సర్వేల వివరాలు చెబుతున్నారే తప్ప.. రాష్ట్ర రైతులు, కార్మికులకు ఏం చేశారో చెప్పాలని’ ఏపీ సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment