
మేళ్లచెరువు(హుజూర్‌నగర్) : బీసీ కులాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ తెలిపారు. శుక్రవారం మండలకేంద్రంలో ఆయన మైనార్టీ కులాల వారిని కలిసి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీ, సంచార జాతులు, అత్యంత వెనుకబడిన బీసీలకు ఏ రకమైన అవసరం వచ్చినా వారికి బీసీ కమి షన్‌కు ఫిర్యాదు అందిస్తే క్షేత్ర స్థాయిలో సాయం అందించనున్నట్టు చెప్పారు.
అట్టడుగు వర్గాలను అక్కున చేర్చుకున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఆయ న వెంట తహసీల్దార్ దేవకరుణ, నాయకులు రంగాచారి, శ్రీనివాసాచారి, హరిలక్ష్మ ణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment