BC people
-
బీసీ జనగణన ఎప్పుడు?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులాల అభివృద్ధికి విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు.. ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధికై అనేక స్కీములు అమలు జరుపుతున్నాయి. అలాగే రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరణ చేస్తున్నాయి. కానీ బీసీ జనాభాకు చెందిన లెక్కల వివరాలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయి. బీసీ జనాభా లెక్కలు లేని కారణంగానే సుప్రీంకోర్టు, హైకోర్టులు రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడాన్ని కొట్టి వేస్తున్నాయి. జనాభా లెక్కలు సమగ్రంగా లేనందువలన రిజర్వేషన్లను ఎంత శాతం నిర్ణయించాలనే అంశంపై మొదటినుంచి బీసీ కమిషన్లు ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి జనాభా గణనలో బీసీ కులాల వారీగా లెక్కలు తీసే విధంగా తగు ఆదేశాలు జారీ చేయవలసిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం కులాల ప్రాతిపదికన ఎస్సీ/ఎస్టీ/బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక, అభివృద్ధి పథకాలు పెట్టాలని నిర్దేశించింది. ఇందులో భాగంగా ఎస్సీ/ఎస్టీ/మైనార్టీ సామాజిక వర్గాల పేరుమీద జనాభా గణన మొదటి నుంచి తీస్తున్నారు. అలాగే లింగ విభజన పేరుమీద మహిళా–పురుష జనాభా గణన ఉంది. కానీ బీసీ కులాల జనాభా వివరాలు కావాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నా, ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నా, హైకోర్టు–సుప్రీంకోర్టులు ఆదేశిస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఒక బీసీ కులాల కాలమ్ పెట్టడానికి ముందుకు రావడం లేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం 2021లో భారతదేశ జనగణన చేపట్టడానికి విడుదల చేసిన నమూనా పట్టికలో వివరాల కోసం 32 కాలమ్స్ నమూనా పత్రం విడుదల చేశారు. కేంద్రప్రభుత్వం హోంశాఖ ద్వారా జారీ చేసిన నమూనా పత్రంలో ఎస్సీ/ఎస్టీల వివరాలు కాలం, అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తదితర మతాల వివరాలు ఇతర వివరాలకు సంబంధించిన కాలమ్స్ నమూనా పత్రాన్ని జారీ చేశారు. కానీ ఈ జనాభా లెక్కల పట్టికలో బీసీ కులాల వివరాలకు సంబంధించిన కాలమ్ పెట్టలేదు. బీసీ జనాభా లెక్కల వివరాలు సేకరించవలసిన ఆవశ్యకత ఉంది. విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల కేటాయింపు–పంచాయతీరాజ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీసీ జనాభా లెక్కల వివరాలు అవసరం అవుతున్నాయి. జనాభా లెక్కలు లేనందున సుప్రీంకోర్టు–హైకోర్టులు రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడాన్ని కొట్టి వేస్తున్నాయి. ఏయే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లను బీసీలకు కేటాయించాలి, ఎంత శాతం కేటాయించాలనే విషయంలో బీసీ జనాభా లెక్కలు లేక, న్యాయపరమైన చట్టపరమైన కోర్టు కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరించడానికి జస్టిస్ రోహిణి నేతృత్వంలో కమిటీని నియమించింది. బీసీ కులాలవారీగా జనాభా లెక్కలు లేకపోవడంతో ఈ కమిటీ వర్గీకరణ చేసి ఏయే గ్రూపుకు ఎంత శాతం రిజర్వేషన్లు నిర్ణయించాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వ స్పందన ఏమిటి? 1931లో అంటే 90 ఏళ్ల క్రితం బ్రిటిష్ ప్రభుత్వం కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం బీసీ జనాభా లెక్కలు తీయడానికి ఊగిసలాడుతూ వచ్చింది. బీసీ సంక్షేమ సంఘం అనేక వీధి పోరాటాలు న్యాయపోరాటాలు చేసిన తర్వాత స్పందించి 2010లో కులాల వారీ లెక్కలు తీయడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించింది. అయితే అప్పటికే జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభమైంది. దీనితో ప్రత్యేకంగా బీసీ జనాభా లెక్కలు తీయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 8 వేల కోట్లు కేటాయించి కులాల వారీ జనాభా లెక్కల్ని ప్రత్యేకంగా తీశారు. ఈ లెక్కలతో సమగ్ర పట్టిక తయారు చేయడానికి మాజీ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌తో ఒక కమిటీ వేశారు. కానీ ఆ తర్వాత వాటి వివరాలు, జనాభా సంఖ్య ఇంతవరకు ప్రకటించలేదు. గతంలో అంటే 2010లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా బీసీ జనాభా కులాల వారిగా లెక్కలు తీయాలని భారతీయ జనతాపార్టీ పార్లమెంటులో డిమాండ్ చేసింది. బీజేపీ కోరినం దుకే అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కులాల వారీగా లెక్కలు తీయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. కావున కులాలు వారీ లెక్కలు తీయవలసిన బాధ్యత అవసరం–ఆవశ్యకత ఉంది. పైగా దీనికి ప్రత్యేక బడ్జెట్ అవసరం లేదు. ఒక రూపాయి ఖర్చు లేకుండా జనాభా లెక్కలు వస్తాయి. 01.08.2018 నాడు అప్పటి హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిపిన హోంశాఖ ఉన్నతస్థాయి సమావేశంలో జనాభా గణనలో బీసీ కులాల వారీగా లెక్కలు తీయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. కానీ రెండవ సారి ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే ఎందుకు మార్పు వచ్చింది?. జనాభా లెక్కలు తీస్తే తరాలుగా అణచివేతకు గురైన కులాలు తామే అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలిస్తే వారు తిరగబడి.. దేశవనరుల్లో, అధికారంలో తమ వాటా తమకు ఇవ్వాలని అడుగుతారేమోనని పాలకవర్గాలు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. అంతే కాదు.. వేల సంవత్సరాలు తమ అగ్రకులాలకు సేవలు చేస్తున్న ఊడ్చేపని, స్కావెంజర్ పని, వంట చేసే పని, బట్టలుతికే వారు, హెయిర్ కటింగ్ చేసే వారు ఇలా ఇంటి పని, పొలం పనులు చేసే వారు దొరకరని భయపడి జనాభా లెక్కలు తీయడం లేదా!! అలాగే ఇన్ని రోజులు తమ కాళ్ళ కాడ పడి ఉన్న ఈ పేద కులాల వారికి అధికారంలో వాటా ఇస్తే వీరు కలెక్టర్, ఆఫీసర్, ఎమ్మెల్యే, మంత్రులయి తమ పక్కన కూర్చుంటారని భయమా!! అలాగే జనాభా లెక్కలు తేలితే విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్లు పెంచాలని అలాగే స్థానిక సంస్థల్లోనూ రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ బలంగా ముందుకు వస్తుందని భయమా! భయపడవలసిన అవసరం లేదు. మీరు జనాభా లెక్కలలో కులాల వారీ లెక్కలు తీసినంత మాత్రాన ఈ కులాలు తమ డిమాండ్లను తెరమీదకి తీసుకురావు. ఇప్పటివరకు రిజర్వేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో ఏమైనా అవలక్షణాలు దొర్లాయా? రాజ్యాంగం రక్షణ సదుపాయాలు రాజ్యాంగంలోని 15 (4) (5) మరియు 16 (4) (5) ప్రకారం బీసీ కులాలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టంగా ఉంది. జనాభా లెక్కలు లేకుండా రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన పెడతారు? రాజ్యాంగంలోని 243 డి–(6) 243–టి–6 ప్రకారం స్థానిక సంస్థలు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఉంది. కానీ జనాభా లెక్కలు లేకుండా రిజర్వేషన్ల శాతం ఎలా నిర్ణయిస్తారు? రాజ్యాంగంలోని 339–బి–ప్రకారం జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. కానీ బీసీల సమగ్రాభివృద్ధికి ఏ సిఫార్సు చేయాలన్నా జనాభా లెక్కలు కావాలి. రాజ్యాంగం కల్పించిన సదుపాయాలు, రక్షణలు, రిజర్వేషన్ల కోసం జనాభా లెక్కలు అవసరం. రాజ్యాంగంలో బీసీ కులాల రక్షణకు, అభివృద్ధికి సంబంధించి అనేక ప్రోవిజన్స్–ఆర్టికల్స్ ఉన్నాయి. వాటిని అమలు చేయాలంటే బీసీ కులాల లెక్కలు కావాలి. కోర్టు తీర్పు ప్రకారం లెక్క తీయాలి రిజర్వేషన్లు ప్రవేశపెట్టినపుడు లేదా రిజర్వేషన్లు పెంచిన ప్రతి సందర్భంలో హైకోర్టు–సుప్రీంకోర్టులు జోక్యం చేసుకొని జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు పెడతారని లేదా పెంచుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. మండల్ కమిషన్ కేసు సందర్భంగా బీసీ రిజర్వేషన్లు పెట్టినప్పుడు జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన రిజర్వేషన్ల శాతం నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలో ప్రతీ రాష్ట్రంలో నియమించిన ప్రతి కమిషన్ జనాభా లెక్కలు తీయాలని సిఫారసు చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అనేక రాష్ట్రాలు కులాల వారిగా జనాభా లెక్కలు తీశాయి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కేటాయింపు కోసం, ఇతర రిజర్వేషన్ల కోసం ఇతర అవసరాల కోసం ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలు బీసీ జనాభా లెక్కలు తీశాయి. కానీ వీటికి చట్టబద్ధత లేదని కోర్టులు కొట్టివేశాయి. ఈ దేశంలో అన్ని వర్గాల వివరాలను జనాభా గణన ద్వారా సేకరిస్తున్నారు. చివరకు పులులు–జంతువుల వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ బీసీ కులాల వారిగా జనాభా లేకపోవడం అన్యాయం. బీసీ జనాభా లెక్కలు సేకరిస్తే జరిగే నష్టం ఏమిటి? అనే ప్రశ్నకు జవాబు లేదు. కేవలం ఊహాజనితంగా కులాల వారి లెక్కలు తీయడం వలన కులతత్వం పెరుగుతుందని పసలేని విమర్శలు చేస్తుంటారు. ఇది ఊహమాత్రమే; ఎందుకంటే మతాల లెక్కలు తీస్తున్నారు. మతతత్వం పెరుగుతుందా! అలాగే ఎస్సీ/ఎస్టీ కులాల వారి లెక్కలు తీయడం లేదా? ఏమైనా కులతత్వం పెరిగిందా? ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు, రిజర్వేషన్లకు, పరిపాలన సౌకర్యంకోసం కులాల వారీ లెక్కలు ఉపయోగపడుతాయి. కావున వెంటనే ప్రభుత్వం స్పందించి జనాభా గణనలో బీసీ కులాల వారి లెక్కలు తీసే విధంగా తగు ఆదేశాలు జారీ చేయవలసిన అవసరం ఉంది. జనాభా గణన కాలమ్స్‌లో ఒక కాలమ్ పెరుగుతుంది. ఒక పైసా అదనంగా ఖర్చు కాదు. పైగా ప్రభుత్వానికి చట్టపరమైన, పాలనాపరమైన, అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కావున వెంటనే ప్రభుత్వం వారు స్పందించి కులాల వారి కాలమ్ చేర్చాలని ప్రజలు–అన్ని పార్టీలు కోరుతున్నాయి. ఆర్. కృష్ణయ్య వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం -
‘వికారి’లో సంక్షేమ షికారు
సాక్షి నెట్వర్క్, శ్రీకాకుళం: వికారిలో సంక్షేమం షికారు చేయనుంది. వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్‌తో నూతన ఏడాదిలో అంతా మంచే జరుగుతుందని బడుగులు ఆశ పడుతున్నారు. ఆర్థికంగా చేయూతనిస్తూ, గౌరవాన్ని పెంచుతూ, హోదాను మరో ఎత్తుకు తీసుకెళ్తూ జగన్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌పై అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు పెడతామని చెప్పడంతో పాటు, నామినేటెడ్ పోస్టుల్లో తగు ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పడం, దేవాలయాల్లోని బోర్డుల్లో ఇప్పటివరకు చోటు లేని వారికి సముచిత స్థానమిస్తామని చెప్పడం వంటివి సామాన్యులకు చేరువయ్యాయి. నూతన ఏడాదిలో మంచి జరగాలంటే ఈ డిక్లరేషన్ కచ్చితంగా అమలు జరిగి తీరాలని సిక్కోలు వాసులు కోరుతున్నారు. ఎనభై నాలుగు శాతం మందికి ప్రయోజనం జిల్లాలో బీసీల కులాల వారు 84 శాతం మంది ఉన్నారు. ప్రస్తుత జనాభాలో బీసీలు దాదాపు పాతిక లక్షల మందికిపైనే ఉన్నారు. బీసీ కులాల్లో ఎక్కువగా తూర్పుకాపు, కళింగ, వెలమ కులస్తులు ఉన్నారు. తర్వాత మత్స్యకార, యాదవ కులస్తులు ఉన్నారు. జిల్లాను దశాబ్ధాలుగా టీడీపీ ఏలుతోంది. కానీ ఈ కులాలను ఓట్లు వేయించుకోవడానికి తప్ప ఇంకెందులోనూ పట్టించుకోలేదు. అన్ని కులాలకు ఎదిగే అవకాశం ఉన్నా, ఆ దిశగా ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ డిక్లరేషన్‌తో అన్ని కులాల్లో ఉన్న వారికి ప్రాణమొచ్చింది. తమకోసం ఓ నాయకుడు పని చేస్తున్నాడనే ధైర్యమిచ్చింది. బీసీ సబ్‌ప్లాన్ అమలైతే ఇక ఏ కులంలోనూ వెనుకబాటు అన్నదే ఉండదు. ఎప్పుడూ ఓటు బ్యాంకుగానేనా..? చంద్రబాబు బీసీలను ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే చూశారన్నది జగమెరిగిన సత్యం. అందుకు సిక్కోలు జిల్లా కూడా ఓ సాక్ష్యం. ఎన్నికలు వస్తున్నాయంటే గానీ బాబుకు కులాల సంక్షేమం గుర్తురాదు. బీసీలకు శాశ్వత ప్రయోజనం కలిగించే ఏ ఒక్క పనినీ ఆయన చేయలేదన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. గడిచిన ఎన్నికల్లో బీసీ ఓట్లకు గాలం వేసేందుకు వందలాదిగా హామీలు కురిపించారు. అధికారం దక్కాక మాటలన్నీ మర్చిపోయారు. అవి గుర్తు చేసినందుకే మత్స్యకారులపై ఆగ్రహోదగ్రులయ్యారు. ఇచ్చిన హామీ నెరవేర్చకుండా, ఆ హామీని గుర్తు చేసినందుకే చంద్రబాబు తిట్టిన విషయాన్ని మత్స్యకారులెవ్వరూ అంత తొందరగా మర్చిపోలేరు. మభ్య పెట్టడమే పని.. జనాలు చూస్తున్నట్లు ఓ పని మొదలుపెట్టడం, జనం కనిపెట్టడం లేదని తెలిసి ఆ పనిని ఆపెయ్యడం. ఇదీ టీడీపీ తీరు. జనాలు సైతం మభ్యపడేంతలా ఆయన ప్రచార తీరు ఉంటుంది. బీసీ సబ్‌ప్లాన్ విషయంలోనూ ఆయన చేసినది ఇదే. రాష్ట్ర బడ్జెట్లో 25 శాతం బీసీలకు కేటాయిస్తామని ఎప్పుడో హామీనిచ్చారు. కేంద్ర నిధుల్లోనూ పాతిక శాతం బీసీ సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పారు. కానీ ఆ హామీలు నిలబెట్టుకోలేదు. జిల్లాలో ఎంతో మంది చేతివృత్తులు, కుల వృత్తుల వారు ఉన్నారు. నాలు గేళ్ల కాలంలో వారి సాధకబాధకాలు పట్టించుకోని చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్నాయనగా.. ఆదరణ పేరుతో మళ్లీ దగా చేసేందుకు సిద్ధపడ్డారు. నాలుగేళ్ల నిర్లక్ష్యాన్ని మర్చిపోయేందుకు తాయిలాలు ఇచ్చినట్లు పరికరాలు అందించారు. అందులోనూ జన్మభూమి కమిటీ సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారు. బీసీలకు ఎనలేని మేలు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏటా రూ.15వేల కోట్ల వంతున ఐదేళ్లకు రూ.75 వేల కోట్లు ఇస్తామని జగన్ ప్రకటించారు. బీసీ సబ్‌ప్లాన్‌కు తొలి శాసనసభలోనే చట్టభద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రకారం మన జిల్లాకు ఏటా వెయ్యికోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ నిధులు గానీ వస్తే జిల్లాలో సామాన్యుల బతుకులన్నీ బాగుపడతాయి. అర్హత ఉంటే చాలు ఎలాంటి వివక్ష చూపకుండా రుణం అందుతుంది. నిధులు ఆ మేరకు ఉంటే బీసీ ప్రాంతాల రూపురేఖలే మారిపోతాయి. జనానికి ప్రయోజనమిది.. ♦ చిరువ్యాపారులకు వడ్డీ లేకుండా రూ.10 వేల వరకు రుణం. ♦ నాయీ బ్రాహ్మణులకు షాపునకు ఏటా రూ.10 వేల సాయం. ప్రధాన ఆలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం. బోర్డు మెంబర్లలో వారికి చోటు. ♦ సంచార జాతుల వారికి స్థిర నివాసం ♦ మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.10వేలు భృతి. ప్రమాదానికి గురై చనిపోతే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా. కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్. డీజిల్ సబ్సిడీ. ♦ యాదవులకు గొర్రెలు, మేకలు చనిపోతే రూ.6వేలు నష్ట పరిహారం. తిరుమల ఆలయాన్ని తెరిచే హక్కు సన్నిధి గొల్లలకే ఇచ్చి, వంశపారంపర్య హక్కులు కల్పించడం. ♦ ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో సగం పనులు బీసీలకే. నామినేటెడ్ పదవుల్లోనూ వాటా. ♦ అన్ని కులాలకు కార్పొరేషన్లు. ♦ 45–60 ఏళ్ల మధ్య వయసు గల మహిళలకు రూ.75వేల సాయం. ♦ మూడో వంతు నిధులు బీసీల అభివృద్ధికే. ♦ వైఎస్సార్ బీమా సాయం రూ.7లక్షలు యాదవుల కష్టాల తీరుతాయి వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే యాదవుల సంక్షేమానికి పాటుపడతామని జగన్ ప్రకటించారు. యాదవులు అన్నివిధాలా ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధులు, ప్రమాదాలు వల్ల గొర్రెలు, మేకలు చనిపోతే ఒక దానికి రూ.5 వేలు, ప్రమాదవశాత్తు యాదవులు చనిపోతే రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని జగన్ ప్రకటించడం సంతోషంగా ఉంది. – పిన్నింటి సింహాద్రి, యాదవ కులస్తుడు, మురపాక గ్రామం, లావేరు మండలం. జగన్ ప్రకటన చాలా బాగుంది జగనన్న సీఎం అయితే యాదవ కుటుంబా లకు బీసీ కార్పొరేషన్ ద్వారా రాయితీపై రుణాలు, అర్హులైన వారికి పార్టీలతో సంబం ధం లేకుండా పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. ప్రస్తుతం యాదవులు వృత్తి గిట్టుబా టు కాక ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. యాదవుల కోసం జగన్ చేసిన ప్రకటన చాలా బాగుంది. – కోరాడ వల్లప్పడు, యాదవ కులస్తుడు, తామాడ గ్రామం, లావేరు మండలం మేలు జరుగుతుంది ప్రకృతి వైపరీత్యాల వల్ల పశువులు చనిపో యి యాదవ కుటుంబాలు ఎక్కువగా నష్టపోతున్నాయి. వారిని ఎవరూ ఆదుకోవడం లేదు. జగన్ మాత్రమే మా గురించి ఆలోచించారు. జగన్ వల్ల యాదవులకు మేలు జరుగుతుందని భావిస్తున్నాం. – పి.బాలకృష్ణ, యాదవ సంఘం నాయకుడు, ఎనభై నాలుగు శాతం మందికి ప్రయోజనం బీసీ డిక్లరేషన్‌తో ఉపాధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో ఉద్యోగ అవకాశాలు పెరిగి యువతకు ఉపాధి దొరుకుతుం ది. అలాగే రుణాలు కూడా సులువుగా పొందవచ్చు. చట్టసభల్లో బీసీలకు సముచిత స్థానం దొరుకుతుంది. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న జగన్‌కు ఓ అవకాశం ఇవ్వాలి. - కలిపిల్లి సింహాచలం, వీరఘట్టం మంగళసూత్రాల నిర్ణయం హర్షణీయం విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్సీ సీటు కేటా యిస్తామనడం, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, తిరుపతి తిరుమల దేవస్థానానికి మంగళసూత్రాలు విశ్వబ్రాహ్మణులు చేసేలా చట్టం తీసుకువస్తాననడం సంతోషం. ఇవి అమలైతే చాలా బాగుంటుంది. – దేవరకొండ షణ్ముఖాచారి, పలాస నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, పలాస మండలం -
బీసీల లెక్కలు తేల్చాకే ‘పంచాయతీ’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకొని అసభ్యకర భాషలో విమర్శిస్తున్నారని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. సుప్రీంకోర్టుకు బీసీ జనాభా లెక్కలు సమర్పించి రిజర్వేషన్లు ఖరారు చేసిన తరువాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఇక్కడి ఆదర్శ్‌నగర్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ద్వారా జరిగే మార్పులు ఏమీ ఉండవని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు తీవ్ర ప్రభావం చూపిందన్నారు. తెలంగాణ అమరులు, ఉద్యమకారుల సంక్షేమం గురించి కేసీఆర్ ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. వివిధ పత్రికలు, చానెళ్లను చెప్పుచేతల్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో యాజమాన్యాలను బెదిరించడం అప్రజాస్వామికమన్నారు. సుధాకర్ సమక్షంలో తెలంగాణ జనసమితి రాష్ట్ర అధికార ప్రతినిధి కాసుల కృష్ణ ఇంటి పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ఇంటి పార్టీయేనని, అందుకే ఈ పార్టీలో చేరుతున్నానని కాసుల కృష్ణ తెలిపారు. సమావేశంలో ఇంటి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొమ్మాట వెంకటేశ్వర్లు, బుర్ర శ్రీనివాస్‌గౌడ్, నేతలు కొమురయ్య, హరీశ్‌యాదవ్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు ఆదేశాలను పట్టించుకోవట్లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలు తేల్చిన తరువాతనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని, దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కోర్టు ధిక్కార పిటిషన్‌పై కోర్టు స్పందించి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్.కె.జోషి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, గణాంకాల డైరెక్టర్ సుదర్శన్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి సైదా, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ధర్మారెడ్డికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ జానాభా కోసం పలు పిటిషన్లు బీసీ జనాభా లెక్కలు తేల్చకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని, ఇది చట్ట విరుద్ధమని కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్‌కుమార్, బి.రవీంద్రనాథ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తేల్చిన లెక్కల్లో బీసీ జనాభా ఎంత ఉందో బహిర్గతం చేసి, పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం మేర రిజర్వేషన్లు కల్పించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.అలిమేన్ రాజు సంయుక్త మరో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ముందు బీసీ జనాభాను, ఓటర్లను లెక్కించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఆ తరువాత ఆ వివరాలను ప్రచురించి, ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని, ఇవన్నీ పూర్తి చేసిన తరువాతనే ఎన్నికల నిర్వహణ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ ఏడాది జూన్ 26న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వానిది కోర్టు ధిక్కారమే... ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, బీసీ జనాభా గణనకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, బీసీ జనాభాను తేల్చకుండానే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోందంటూ జాజుల శ్రీనివాస్ గౌడ్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం విచారించారు. బీసీ జనాభాను తేల్చకుండా ఎన్నికలు నిర్వహించడం కోర్టు ధిక్కారమే అవుతుందని జాజుల తరఫు న్యాయవాది రామచంద్రగౌడ్ కోర్టుకు నివేదించారు. అందువల్ల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న అధికారులందరికీ నోటీసులు జారీచేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేశారు. -
‘రాష్ట్రంలో బీసీలకు అన్యాయం’
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాటం నరసింహ యాదవ్ ఆరోపించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అరవింద్, ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా, బస్వ లక్ష్మీనర్సయ్య, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్, జిల్లా ఇన్చార్జి నీలకంఠ రాజు తదితరులు కలెక్టరేట్‌కు ర్యాలీగా వచ్చారు. బీసీల సంక్షేమానికి నిధులివ్వాలని కోరుతూ కలెక్టర్ రామ్మోహన్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ సంక్షేమ పథకాలు, కార్పొరేషన్లకు నిధులు కేటాయించినా వాటిని సక్రమంగా విడుదల చేయకపోవడంతో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగడం లేదన్నారు. రాష్ట్ర బడ్జెట్లో బీసీ సంక్షేమానికి కేవలం రూ. 5,919.83 కోట్లు కేటాయించి అన్యాయం చేశారన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఓబీసీలకు చట్ట సభలు, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నరేశ్, ఉపాధ్యక్షులు రాజన్న, నాయకులు అరుణ్, శ్రీనివాస్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీల అభివృద్ధే లక్ష్యం
మేళ్లచెరువు(హుజూర్నగర్) : బీసీ కులాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ తెలిపారు. శుక్రవారం మండలకేంద్రంలో ఆయన మైనార్టీ కులాల వారిని కలిసి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీ, సంచార జాతులు, అత్యంత వెనుకబడిన బీసీలకు ఏ రకమైన అవసరం వచ్చినా వారికి బీసీ కమి షన్‌కు ఫిర్యాదు అందిస్తే క్షేత్ర స్థాయిలో సాయం అందించనున్నట్టు చెప్పారు. అట్టడుగు వర్గాలను అక్కున చేర్చుకున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఆయ న వెంట తహసీల్దార్ దేవకరుణ, నాయకులు రంగాచారి, శ్రీనివాసాచారి, హరిలక్ష్మ ణ్‌కుమార్ తదితరులు ఉన్నారు. -
రాహుల్ జీర్ణించుకోలేకపోతున్నారు: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కానీ బీజేపీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు మాత్రం రాహుల్ గాంధీ నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ జాబితాలో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీ మునుగుతున్న నావలాంటిదని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీకి వస్తున్న ప్రజాదరణను రాహుల్ జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. మరోవైపు తెలంగాణలో బీసీలకు సీఎం కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు నిధులు కేటాయించాలని, ఉద్యోగాల భర్తీలోనూ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. -
బీసీలను మోసం చేస్తున్న చంద్రబాబు
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : బీసీ డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు జి.గంగాధర్ డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు చంద్రబాబు డిక్లరేషన్‌పై హామీ ఇచ్చారని, అధికారం చేపట్టి రెండేళ్లయినా డిక్లరేషన్‌పై పెదవివిప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో చట్ట సభల్లో బీసీలకు 33.3 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగ సవరణ కోసం జాతీయస్థాయిలో ఉద్యమం చేడతామని, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచడంపై దృష్టి సారిస్తామని ప్రకటించారని తెలిపారు. వాటితో పాటు రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 33.3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టం చేశారని తెలిపారు. డిక్లరేషన్‌పై ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేయకపోతే సెప్టెంబర్ 10 నుంచి తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్డీవో కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజాప్రతినిధులను, మంత్రులను ఘెరావ్ చేస్తామని, త్వరలోనే విజయవాడలో 72 గంటల దీక్ష చేపడతామని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ బీసీ సమస్యల పరిష్కారానికి ప్రణాళికా వ్యయంలో 25 శాతం నిధులను ఏడాదికి రూ.10 కోట్లకు తగ్గకుండా ఉప ప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించిన చంద్రబాబు దానిపై ఇప్పటివరకూ స్పందించలేదన్నారు. సమావేశంలో బీసీ సంఘాల నాయకులు కడియాల çసూర్యనారాయణ, లంకా వెంకటేశ్వర్లు, తామాడ పెద్దిరాజు, అంబటి గురుమూర్తి, రాజా మురళీకృష్ణ, మాగంటి హేమ సుందర్, గొట్టేటి అరుణ తదితరులు పాల్గొన్నారు. -
'కోట్ల రూపాయలు ఇచ్చిన వారికే రాజ్యసభ సీట్లు'
నెల్లూరు(సెంట్రల్): రాజ్యసభ సీట్ల విషయంలో బీసీలను పక్కన పెట్టి కోట్ల రూపాయలు ఇచ్చిన వారికే సీట్లు కేటాయించడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిశేషు పేర్కొన్నారు. నెల్లూరులోని ఓ హోటల్ లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల ఓట్లతో గద్దెనెక్కిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారినే చులకన చేసి చూడడంపై రాష్ట్రంలోని బీసీలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారని చెప్పారు. త్వరలోనే బీసీల సత్తా ఏంటన్నది చంద్రబాబుకు చూపిస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య త్వరలోనే జిల్లాలో పర్యటిస్తారని వెల్లడించారు. ఆ సందర్భంగా బీసీల సమస్యలపై పెద్ద ఎత్తున సర్కారుకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. బీసీలు ఆగ్రహిస్తే బాబు ప్రభుత్వం కదులుతుందని హెచ్చరించారు. బీసీల కోసం తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయడానికి ఆర్.కృష్ణయ్య సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. -
'బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని బాబు నెరవేర్చలేదు'
అనంతపురం(గుంతకల్లు): బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా బ్యాలెట్‌కు ఏపీ వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో శనివారం స్థానిక బీసీ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు బీసీలకు అనేక హమీలు ఇచ్చినా వాటిలో ఇంతవరకు ఏ ఒక్కటీ నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. ఈ నేపథ్యంలో బీసీలనే న్యాయనిర్ణేతలుగా ప్రకటిస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు వారికి ఇచ్చిన హామీలను ప్రజా బ్యాలెట్‌గా ముద్రించి ఈనెల 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరుల ముందుకు తీసుకువెళ్లామన్నారు. ప్రజా బ్యాలెట్‌ను విడుదల చేసిన నాలుగు రోజుల్లోనే విశేష స్పందన వచ్చిందన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోవడంతో ముఖ్యంగా గాండ్ల, ఉప్పర, పూసల, పద్మశాలి, నాయీబ్రాహ్మణ, దూదేకుల, కుమ్మర వర్గాలకు చెందిన వారు పూర్తిగా మోసపోయారన్నారు. అలాంటి వారంతా ప్రజాబ్యాలెట్లో విస్తృతంగా పాల్గొనాలంటూ ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు బీసీలకు ఇచ్చిన హమీలన్నీ అమలు చేసేవరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటామన్నారు. -
త్వరలో బీసీలకూ కల్యాణలక్ష్మి: కేసీఆర్
కరీంనగర్: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ములకనూరులో తెలంగాణతల్లి విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలోని పలు నియోజకవర్గాలలో శనివారం పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సర్కార్ త్వరలోనే బీసీలకూ కల్యాణలక్ష్మి పథకాన్ని అమలుచేస్తుందని తెలిపారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. -
బీసీలపై కాంగ్రెస్ వివక్ష: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: బీసీలపై కాంగ్రెస్ పార్టీ వివక్ష చూపిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఆ శాఖ తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఎన్నికలకు ముందు బీసీ ఓట్లకోసం పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ అధ్యక్షుడిని చేసిన కాంగ్రెస్ ఇప్పుడు అగ్రకులాలకు ఆ పదవిని కట్టబెట్టాలనుకోవడం దారుణమని విమర్శించారు. తెలంగాణ ఇచ్చినా ఆ పార్టీ రాష్ట్రంలో ఓడిపోవడానికి గతంలో అగ్ర కుల ముఖ్యమంత్రుల పాలనే కారణమని దుయ్యబట్టారు. బీసీ వర్గానికి చెందిన పొన్నాలను మార్చి ఇప్పుడు అగ్రకులాలకు ఆ పదవిని ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇకనైనా తన వైఖరి మార్చుకోకపోతే ఆ పార్టీ బీసీలకు దూరం కావాల్సి వస్తుందని హెచ్చరించారు.